January 10, 2025

జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల

jagananna vidya deevena

జూలై – సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి 8,09,039 మంది విద్యార్ధులకు లబ్ది చేకూరుస్తూ రూ 584 కోట్ల రూపాయలను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా తల్లుల, విద్యార్ధుల జాయింట్ ఖాతాలలోనికి విడుదల చేసారు.

గత ప్రభుత్వ హయాం లో ఎన్నడూ జరగని విధం గా పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యం తో ఐటిఐ , పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తీ ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం కుటుంబం లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి జగనన్న విద్యా దీవెన నిధులకు విడుదల చేస్తోంది ప్రభుత్వం.

గత ప్రభుత్వ హయాం లో ఎన్నడూ జరగని విధం గా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్హులు భోజన , వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరం లోనూ రెండు వాయిదాలలో ఐ టి ఐ విద్యార్ధులకు రూ 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. కుటుంబం లో ఎంత మంది చదువుతుంటే అంత మందికి… తల్లులు, విద్యార్ధుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.