01-01-2025 Daily Current Affairs Telugu| Daily Short News Telugu
ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో భారత పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా అత్యధిక పాయింట్స్ సాధించిన భారత బౌలర్ గా రికార్డు సృష్టించాడు.
01-01-2025 Daily Current Affairs Telugu| Daily Short News Telugu
ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 – ఏపీ లో తగ్గిన అటవీ విస్తీర్ణం
ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్-2023 ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో అటవీ విస్తీర్ణం గణనీయం గా తగ్గింది. గతం తో పోల్చినపుడు 138.66 చదరపు కిలోమీటర్ల మేర అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. 2021 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క అటవీ విస్తీర్ణం 30,223.62 చదరపు కిలోమీటర్లు . కాగా 2023 లెక్కల ప్రకారం ఏపీ యొక్క అటవీ విస్తీర్ణం 30,084.96 చదరపు కిలోమీటర్లు గా ఉంది. అంటే 138.66 చదరపు కిలోమీటర్ల మేర అడవులు అంతరించి పోయాయి.(01-01-2025 Daily Current Affairs)
ప్రధానం గా ఆంధ్రప్రదేశ్ లో అటవీ సంపద ఎక్కువగా అగ్ని ప్రమాదాల వలన నష్టపోతోంది. వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల వలన అతి విలువైన అటవీ సంపద అగ్ని కి ఆహుతి అవుతోంది. కేవలం గత సంవత్సరం లోనే 5,286.76 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం అగ్ని ప్రమాదాలకు గురై నష్టపోవడం జరిగింది. అగ్ని ప్రమాదాలకు గురై అటవీ విస్తీర్ణాన్ని అధికం గా కోల్పోయిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్థానం లో ఉంది.
అయితే మడ అడవుల విస్తీర్ణం లో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్థానం లో ఉంది. ఇంతకు ముందు గణాంకాల కంటే ప్రస్తుతం 13.01 కిలోమీటర్ల మేర మడ అడవుల విసీర్ణం పెరిగింది. భారత దేశ వ్యాప్తం గా మడ అడవుల విస్తీర్ణం 49,991.68 చదరపు కిలోమీటర్లు గా ఉంది. ఏపీ మొదటి స్థానం లో ఉండగా మహారాష్ట్ర రెండవ స్థానం లో ఉంది. (01-01-2025 Daily Current Affairs)
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అడవుల విస్తీర్ణం ఇలా ఉంది
మొత్తం అటవీ విస్తీర్ణం – 30,084.96 Sq Km (చదరపు కిలోమీటర్లు)
అత్యధిక విస్తీర్ణం గల జిల్లా – అల్లూరి సీతారామరాజు జిల్లా – 6,917.32 Sq Km (చదరపు కిలోమీటర్లు)
అత్యల్ప విస్తీర్ణం గల జిల్లా – గుంటూరు జిల్లా – 13.34 Sq Km (చదరపు కిలోమీటర్లు)
అత్యధికం గా దట్టమైన అడవులు గల జిల్లా – అల్లూరి సీతారామరాజు జిల్లా – 1,183.18 Sq km (చదరపు కిలోమీటర్లు)
ఆంధ్రప్రదేశ్ లో దట్టమైన అడవుల విస్తీర్ణం -1,995.71 Sq Km (చదరపు కిలోమీటర్లు)
ఆంధ్రప్రదేశ్ లో మధ్యస్థ అడవుల విస్తీర్ణం – 13,725.75 Sq Km (చదరపు కిలోమీటర్లు)
ఆంధ్రప్రదేశ్ లో 2021 లో అటవీ విస్తీర్ణం – 30,223.62 Sq Km (చదరపు కిలోమీటర్లు)
ఆంధ్రప్రదేశ్ లో గతం తో పోల్చినపుడు తగ్గిన అటవీ విస్తీర్ణం – 138.66 Sq Km (చదరపు కిలోమీటర్లు)
భౌగోళికం గా భారతదేశం లో ఎక్కువ అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతం వరుసగా లక్ష ద్వీప్ – 91.33 శాతం, మిజోరం – 85.34 శాతం, నికోబార్ 81.62 శాతం
ఫ్లూ క్యూర్ వర్జీనియా (FCV) పొగాకు ఉత్పత్తి లో ఏపీ టాప్
ఎఫ్ సి వీ – ఫ్లూ క్యూర్ వర్జీనియా పొగాకు ఉత్పత్తి లో ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయిలో దిగుబడులు సాధించి ప్రధమ స్థానం లో నిలిచింది. 2023-24 సంవత్సరం లో 215.35 మిలియన్ టన్నుల దిగుబడిని సాధించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ వివరాలను తెలియజేసింది. గత సీజన్ల తో పోలిస్తే ఈసారి కిలో పొగాకు ధర 288.65 రూపాయలు పలికిందని కేంద్రం తెలిపింది.
భారత పౌరసత్వాన్ని వదిలివేసిన వారి సంఖ్య సుమారు 18 లక్షలు
గత పదమూడేళ్ళలో అనగా 2011 – 2023 సంవత్సరాలలో భారత పౌరసత్వం వదిలివేసిన ఎన్నారై ల సంఖ్య సుమారు 18 లక్షలు. 2022 వ సంవత్సరం లో అత్యధికం గా 2.25 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2023 సంవత్సరం లో 2,16,219 మంది భారత పురసత్వాన్ని వదిలివేసి విదేశాలలో స్థిరపడ్డారు. అమెరికా లో స్థిర పడుతున్న విదేశీయులలో మెక్సికో దేశస్తులు మొదటి స్థానం లో ఉండగా భారతీయులు రెండవ స్థానం లో ఉన్నారు. 2022 లో 65,960 మంది భారతీయులు అమెరికాలో స్థిరపడ్డారు.
దేశం లో డిసెంబర్ లో పెరిగిన GST వసూళ్లు (01-01-2025 Daily Current Affairs)
డిసెంబర్ 2024 లో GST వసూళ్లు పెరిగాయి. రూ 1.77 లక్షల కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. గత సంవత్సరం తో పోలిస్తే ఇది 7.3 % అధికం. గత సంవత్సరం తో నెలవారీ అత్యధిక వసూళ్లు ఏప్రిల్ నెలలో వసూలు అయ్యాయి. ఆ నెలలో 2.10 లక్షల కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. డిసెంబర్ నెలకు తెలంగాణా రాష్ట్రం లో 10% వృద్ధి తో 5224 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 6% తగ్గుదలతో 3,315 కోట్ల రూపాయలు వసూళ్లు అయ్యాయి.
ఐరాస భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశాలు గా పాకిస్తాన్, డెన్మార్క్
ఐక్యరాజ్యసమితి తాత్కాలిక సభ్య దేశాల ఎన్నిక జరిగింది. రెండేళ్ళ కాలానికి తాత్కాలిక సభ్య దేశాలు గా పాకిస్తాన్, డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియా దేశాలు ఎంపిక అయ్యాయి. ఐక్యరాజ్యసమితి లో శాశ్వత సభ్యదేశాలు గా ఉన్న అమెరికా, రష్యా , చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ ఉన్నాయి. ఈ దేశాలకు మాత్రమే వీటో అధికారం ఉంది. ఐక్యరాజ్యసమితి లో ప్రస్తుతం సభ్యత్వం కలిగి ఉన్న దేశాల సంఖ్య 193. భద్రతామండలి లో శాశ్వత సభ్యదేశాల సంఖ్య 15. రొటేషన్ పధ్ధతి లో మిగిలిన 10 సభ్యదేశాల ఎంపిక జరుగుతుంది. రెండేళ్ళ కాల వ్యవధి తర్వాత మరలా ఎన్నిక జరుగుతుంది. (01-01-2025 Daily Current Affairs)
భద్రతామండలి లో ప్రస్తుతం ఉన్న శాశ్వత సభ్యదేశాలు (5) – (అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్)
భద్రతా మండలి లో తాత్కాలిక సభ్య దేశాలు – (10) – (డెన్మార్క్, పాకిస్తాన్, గ్రీస్, పనామా, సోమాలియా దేశాలకు 2026 వరకు సభ్యత్వం ఉంది. అలాగే అల్జీరియా, గుయానా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సియెర్రా లియోన్, స్లోవేనియా మొదలైన దేశాలకు 2025 వరకూ సభ్యత్వం ఉంది )
ఎక్స్ ఖాతా లో తన పేరు మార్చిన ఎలాన్ మస్క్ (1-01-2025 Daily Current Affairs)
ప్రపంచ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విటర్) లో తన పేరును, ఫోటో ను మార్చారు. తన పేరును ‘కేకియాస్ మాక్సిమాస్’ గా మార్పు చేసారు. క్రిప్టో కరెన్సీ మార్కెట్ కు సంబంధించి కేకియాస్ మాక్సిమాస్ అనే పేరు ఈ మధ్య కాలం ఎక్కువగా వినిపించింది. క్రిప్టో కరెన్సీ తో గత ఏడాది డిసెంబర్ చివర లో కేకియాస్ మాక్సిమాస్ అనే వ్యక్తి అత్యధికం గా లాభాలు సంపాదించడం తో అతని పేరు మారుమ్రోగిపోయింది. దీనినే మస్క్ తన ఎక్స్ ఖాతా పేరుగా మార్చుకున్నారు.
యాభై కిలోల DAP బస్తా ఖరీదు ఇకపై రూ 1350/- మాత్రమే
DAP (డై అమ్మోనియం ఫాస్పేట్) ఎరువు పై One time settlement package ని ప్రధాన మంత్రి నేతృత్వం లోని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ ప్యాకేజీ ప్రకారం 50 కిలోల DAP బస్తా పదమూడు వందల యాభై రూపాయలకు రైతులకు లభిస్తుంది. జనవరి 1 నుండి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఈ ధర కొనసాగుతుంది.
అణు స్థావరాల జాబితాలు మార్పిడి చేసుకున్న భారత్ , పాకిస్తాన్ దేశాలు
అణు కేంద్రాలపై గాని, అణు స్థావరాల పై గాని ఇరుదేశాలు దాడులు చేసుకోరాదని 1988 వ సంవత్సరం డిసెంబర్ 31 వ తేదీన భారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 1991 జనవరి 27 నుండి అమలు లోనికి వచ్చింది. అప్పటినుండి ఇప్పటివరకు ఇరు దేశాలూ ప్రతి సంవత్సరం అణు స్థావరాల జాబితా ల మార్పిడి చేసుకుంటున్నాయి. ఈ ఒప్పందాన్ని పురస్కరించుకొని న్యూ ఢిల్లీ మరియు ఇస్లామాబాద్ లోని దౌత్య మార్గాల ద్వారా ఒకేసారి ఈ జాబితాల మార్పిడి జరిగింది. జనవరి 1, 2025 బుధవారం నాడు 34వ సారి ఈ జాబితాల మార్పిడి జరిగింది.(1-01-2025 Daily Current Affairs)
ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్ షిప్ లో కాంస్యం నెగ్గిన వైశాలి
న్యూయార్క్ లో జరిగిన ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో భారత గ్రాండ్ మాస్టర్, తమిళనాడు కి చెందిన వైశాలి రమేష్ బాబు కాంస్య పతకం గెలుచుకున్నారు. 23 ఏళ్ళ వైశాలి చైనా గ్రాండ్ మాస్టర్ వెన్ జున్ తో జరిగిన సెమీ ఫైనల్ పోటీ లో ఓడిపోయారు. దీనితో కాంస్య పతకం తో సరిపెట్టు కోవలసి వచ్చింది. ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్ షిప్ గెలుచు కున్న భారతీయులలో ఆమె మూడవ వారు. ఇంతకుముందు 2017 లో గ్రాండ్ మాస్టర్ విశ్వనాధన్ ఆనంద్ మొదటి సారి కాంస్య పతకం గెలుచుకున్నారు. 2022 లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఈ చాంపియన్ షిప్ లో రజతపతకం గెలుచు కున్నారు. ఇప్పుడు వైశాలి రమేష్ బాబు కాంస్య పతకం గెలుచుకున్న మూడవ వ్యక్తి గా నిలిచారు.
మహిళల రాపిడ్ ఫార్మాట్ విజేత కోనేరు హంపీ (01-01-2025 Daily Current Affairs)
ప్రపంచ మహిళల చెస్ ర్యాపిడ్ ఫార్మాట్ లో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి స్వర్ణ పతకం గెలుచుకున్నారు. దీనితో ఆమెకు స్వర్ణ పతకం తో పాటు విన్నర్స్ ట్రోఫీ ని అందజేశారు
ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్ షిప్ పురుషుల విభాగం లో సంయుక్త విజేతలు
ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్ షిప్ ఫైనల్ లో ఒక వింత జరిగింది. ఈ చాంపియన్ షిప్ లోనే తొలిసారిగా ఫైనల్ లో ఇద్దరు విజేతలను ప్రకటించారు. టోర్నీ నిబంధనలు అనుమతించ నప్పటికీ ఇద్దరు ఆటగాళ్ళు నిరాసక్తత ప్రదర్శించడం తో ఇద్దరినీ విజేతలు గా ప్రకటించారు. ఈ పోటీలలో ఆరుసార్లు చాంపియన్ గా నిలిచిన నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్ సన్ తో రష్యా గ్రాండ్ మాస్టర్ నిపొమ్ నిషి పోటీ పడ్డారు. ఏడు గేమ్స్ ముగిసినప్పటికీ స్కోరు సమానం గా ఉండటం, అప్పటికే వారు తీవ్రం గా అలసి పోవడం తో వారి సమ్మతి మేరకు ఇద్దరినీ సంయుక్త విజేతలు గా ప్రకటించారు.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో బుమ్రా రికార్డు( 1-01-2025 Daily Current Affairs)
ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో భారత పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా అత్యధిక పాయింట్స్ సాధించిన భారత బౌలర్ గా రికార్డు సృష్టించాడు. మొత్తం 907 రేటింగ్ పాయింట్స్ సాధించిన ఏకైక భారత బౌలర్ గా అవతరించాడు. ఇంతకు ముందు రవిచంద్రన్ అశ్విన్ 904 రేటింగ్ పాయింట్లు సాధించి ఈ ఘనత సాధించాడు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో అద్భుతం గా బౌలింగ్ చేయడం తో రేటింగ్ పాయింట్లు బాగా మెరుగు పడ్డాయి.(01-01-2025 Daily Current Affairs)
అదేవిధం గా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్ల జాబితా లో బుమ్రా 17 వ స్థానం లో ఉన్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ బౌలర్ సిడ్నీ బార్నేస్ 932 రేటింగ్ పాయింట్స్ సాధించి మొదటి స్థానం లో కొనసాగుతున్నారు. 1914 లో ఈ రికార్డు స్థాపించారు. అలాగే ఇంగ్లాండ్ కు చెందిన జార్జి లోమస్ రెండవ స్థానం లో (931 పాయింట్లు), మూడవ స్థానం లో పాకిస్తాన్ కు చెందిన ఇమ్రాన్ ఖాన్ 922 పాయింట్ల తో కొనసాగుతున్నారు.