02-01-2025 Daily Current Affairs| Daily Short News Telugu| పొడవు పెరిగిన ఏపీ తీర రేఖ
02-01-2025 Daily Current Affairs| Daily Short News Telugu|పొడవు పెరిగిన ఏపీ తీర రేఖ
భూమికి దగ్గరగా గ్రహాలు – ప్లానెట్ పరేడ్ (02-01-2025 Daily Current Affairs)
జనవరి 01 నుండి భూమికి అతి దగ్గరగా గ్రహాలు కనువిందు చేయబోతున్నాయి. శుక్రుడు, గురుడు, బృహస్పతి, శని మొదలైన గ్రహాలు ఒక వరుసలో కనిపిస్తాయి. ఎటువంటి టెలిస్కోప్ లేకుండానే సాయంత్రం సమయం లో వీటిని చూడవచ్చు. సూర్యుడు అస్తమించిన కొద్ది సేపటి తర్వాత ఈ అద్భుత దృశ్యం కనిపిస్తుంది. శుక్రుడు మరియు శని గ్రహాలు భూమికి చాలా దగ్గరగా రానున్నాయి. గురు గ్రహం అతి ప్రకాశవంతం గా కనిపిస్తుంది. దాదాపు రెండు వారాల పాటు ఈ ప్లానెట్ పరేడ్ ను ఆస్వాదించవచ్చు.(02-01-2025 Daily Current Affairs)
ప్రజలను క్షమాపణ కోరిన మణిపూర్ ముఖ్యమంత్రి
మణిపూర్ లో జాతుల మధ్య ఏర్పడిన వైరం కారణం గా దాదాపు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఈ విషయమై ప్రజలను క్షమాపణ కోరుతున్నానని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ చెప్పారు. 2023 నుండి జరిగిన హింసాత్మక ఘటనలలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
కొత్త సంవత్సరం ప్రవేశించిన తొలి దేశం, చివరి దేశం ఇవే
నూతన సంవత్సర సంబరాలు ప్రపంచ వ్యాప్తం గా అంబరాన్ని అంటాయి. 2025 కొత్త సంవత్సరం మొదట ఎక్కడ ప్రవేశించిందో తెలుసా. క్రిస్మస్ ఐలాండ్ అని పిలవబడే కిరిబాటి రిపబ్లిక్ 2025 సంవత్సరాన్ని స్వాగతించిన తొలి దేశం. అలాగే ప్రపంచం లో అందరి కంటే చాలా ఆలస్యం గా కొత్త సంవత్సర వేడుకలు చేసుకున్న దేశం మాత్రం న్యూ సమోవా. ఈ రెండు దేశాల మధ్య దాదాపు 24 గంటల వ్యత్యాసం ఉంది. (02-01-2025 Daily Current Affairs)
ఎదురెదురు గా వచ్చే రైలు ప్రమాదాలు నివారించే ‘కవచ్’
ఒకే ట్రాక్ మీదకు ఎదురెదురుగా రెండు రైళ్ళు గాని వచ్చి ఢి కొట్టకుండా ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థ పేరే ‘కవచ్’. Research Designs and Standards Organization వారు రూపొందించిన ఈ ప్రత్యేక మైన రక్షణ వ్యవస్థ ఇప్పటికే అనేక రైలు ప్రమాదాలు కాకుండా నివారించింది. ఈ కవచ్ వ్యవస్థ వలన కీలకమైన ప్రాంతాలలో రైలు వేగం తగ్గించ బడుతుంది. ప్రధానం గా ‘కవచ్’ వ్యవస్థ ఇలా పనిచేస్తుంది
- అతివేగం గా అంటే 130 కిలోమీటర్లు అంతకంటే వేగం గా ప్రయాణించే రైళ్ళు వేగం తగ్గించవలసిన ప్రాంతాలు (కాషన్ జోన్ లకు)రాగానే వాటి వేగం తగ్గించబడుతుంది.
- ఎక్కడైనా రెడ్ సిగ్నల్ పడితే చాలు రైలు కనీసం 50 మీటర్ల దూరం లో ఆగిపోతుంది
- లూప్ లైన్ లలో రైలు వేగం గంటకు ముప్పై కిలోమీటర్ల కు దానంతట అదే తగ్గిపోతుంది.
- ఎక్కడైనా లెవెల్ క్రాసింగ్ దగ్గరకు చేరుకొంటున్నపుడు రైలు హారన్ దానంతట అదే గట్టిగా మ్రోగుతుంది
- ఒకే ట్రాక్ పై 15 కిలోమీటర్ల దూరం లో ఏదైనా రైలు ఉన్నపుడు గాని, ట్రాక్ పై ఏదైనా అవాంచనీయం గా కనిపించినా కూడా రెడ్ హోమ్ సిగ్నల్ పడి రైలు వెంటనే నిలచిపోతుంది.
ఏపీ రాష్ట్ర కొత్త చీఫ్ సెక్రటరీ గా విజయానంద్ (02-01-2025 Daily Current Affairs)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త చీఫ్ సెక్రెటరీ గా కె.విజయానంద్ పదవీ భాద్యతలు స్వీకరించారు. నీరబ్ కుమార్ ప్రసాద్ గత నెలాఖరు వరకూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీ ఎస్) గా ఉన్నారు. ఆయన పదవీ విరమణ చేయడం తో విజయానంద్ ఈ పదవిని చేపట్టారు. (02-01-2025 Daily Current Affairs)
పొడవు పెరిగిన భారత సముద్ర తీరం – ఏపీ లో కూడా
ఇప్పటివరకూ ఉన్న గణాంకాల ప్రకారం భారత దేశ తీర రేఖ పొడవు 7,516 కిలోమీటర్లు గా ఉంది. అది ప్రస్తుతం 11,098 కిలో మీటర్ల కు పెరిగింది. సర్వ్ ఆఫ్ ఇండియా (Survey of India 1970) ప్రకారం నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలలో, 9 రాష్ట్రాలలో ఈ తీర రేఖ విస్తరించి ఉంది. ఇప్పటివరకూ 1970 సర్వే ఆధారం గా ఇవ్వబడిన గణాంకాలను మాత్రమే పరిగణన లోనికి తీసుకుంటున్నారు.
అయితే నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్ నిర్దేశించిన నూతన మార్గదర్శకాలను ప్రస్తుతం ప్రామాణికం గా తీసుకొంటున్నారు. దీని ప్రకారం భారత తీర రేఖ పొడవు 48% వరకూ పెరిగింది. ప్రస్తుతం నిర్వహించిన రీ వెరిఫికేషన్ లో భారత తీర రేఖ పొడవు 11,098 కిలోమీటర్లు గా నమోదైంది. కేంద్ర హోం శాఖ విడుదల చేసిన వార్షిక నివేదిక లో ఈ అంశాలను ప్రస్తావించారు. (02-01-2025 Daily Current Affairs)
ఆంధ్రప్రదేశ్ ను ఇప్పటివరకూ దేశం లో రెండవ అతిపెద్ద తీర రేఖ గల రాష్ట్రం గా పరిగణించే వారు. ఇప్పటివరకూ 973.70 కిలోమీటర్ల పొడవైన తీర రేఖ ఉండేది. ప్రస్తుత రీ వెరిఫికేషన్ వలన ఇది 1,053.07 కిలోమీటర్ల కు పెరిగింది. అయితే తమిళనాడు తీరరేఖ 1,068.69 కిలోమీటర్ల కు చేరడం తో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానాన్ని కోల్పోయి మూడవ స్థానం తో సరిపెట్టుకోవలసి వచ్చింది. గుజరాత్ 2,340.62 కిలోమీటర్ల తో ప్రధమ స్థానం లో కొనసాగుతోంది
- అతి పెద్ద తీర రేఖ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం – అండమాన్ నికోబార్ దీవులు – 3,083.50 కిలోమీటర్లు (పూర్వపు లెక్కల ప్రకారం 1,962 km)
- అతి పెద్ద తీర రేఖ కలిగిన రాష్ట్రం – గుజరాత్ – 2,340.62 కిలోమీటర్లు (పూర్వపు లెక్కల ప్రకారం 1,214.70 km)
- రెండవ అతి పెద్ద తీర రేఖ గల రాష్ట్రం – తమిళనాడు – 1,068.69 కిలోమీటర్లు (పూర్వపు లెక్కల ప్రకారం 906.90 Km)
- మూడవ అతి పెద్ద తీర రేఖ గల రాష్ట్రం – ఆంధ్రప్రదేశ్ – 1,053.07 కిలోమీటర్లు (పూర్వపు లెక్కల ప్రకారం 973.70 Km)
- భారత దేశం యొక్క మొత్తం తీర రేఖ పొడవు – 11,098.81 కిలోమీటర్లు (పూర్వపు లెక్కల ప్రకారం 7516.60 Km)
ఇది కూడా చదవండి : 01-01-2025 Daily Current Affairs