12-12-2024 Daily Short News Telugu|టెన్త్ , ఇంటర్, నీట్ పీజీ పరీక్ష తేదీల విడుదల
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప -2 దేశ వ్యాప్తం గా భారీ వసూళ్లను రాబట్టింది. విడుదలైన ఏడు రోజుల్లోనే వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టిన తొలి చిత్రం గా రికార్డు సృష్టించింది ఈ చిత్రం.
12-12-2024 Daily Short News Telugu|పదవతరగతి, ఇంటర్, నీట్ పీజీ పరీక్ష తేదీల విడుదల
ఆంద్ర ప్రదేశ్ లోని నాలుగు పంచాయితీ లకు జాతీయ అవార్డులు:
కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఒక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.ఏపీ నుండి వివిధ విభాగాలలో ఉత్తమం గా ప్రతిభ కనబరచిన నాలుగు గ్రామ పంచాయతీలకు రాష్ట్రపతి అవార్డులు ప్రధానం చేసారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాలను ఈ సందర్భం గా ప్రధానం చేసారు.12-12-2024 Daily Short News
చిత్తూరు జిల్లా నుండి బొమ్మ సముద్రం గ్రామం, అనకాపల్లి జిల్లా నుండి న్యాయం పూడి గ్రామం, ఆనకాపల్లి జిల్లా నుండి తగరం పూడి గ్రామం, కృష్ణా జిల్లా నుండి ముప్పాళ్ళ గ్రామం ఈ అవార్డులకు ఎంపిక అయ్యాయి.
చిత్తూరు జిల్లా బొమ్మ సముద్రం – గర్భిణీ స్త్రీల సురక్షిత వైద్య సేవలు, అనకాపల్లి జిల్లా న్యాయం పూడి – వంద శాతం సురక్షిత తాగునీటి సౌకర్యం, అనకాపల్లి జిల్లా తగరం పూడి – వ్యర్దాలతో ఎరువులు తయారు చేయుట, కృష్ణా జిల్లా ముప్పాళ్ళ – సామాజిక భద్రత, వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు పెన్షన్లు వంటి కేటగిరీల క్రింద అవార్డులు గెలుచు కున్నారు. ఈ కార్యక్రమం లో కేంద్ర పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ఎస్. పీ సింగ్ బఘెల్, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కూడా పాల్గొన్నారు. 12-12-2024 Daily Short News
పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల:
ఏపీ లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2025 మార్చి 17 వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. మార్చి 31 వరకూ ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ షెడ్యూల్ ను ఏపీ విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ విడుదల చేసారు. ప్రతీ రోజూ పరీక్ష కాకుండా పరీక్ష కు పరీక్ష కు మధ్య ఒక రోజు విరామం ఇచ్చినట్లు దీనివలన విద్యార్దులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని మంత్రి విద్యార్దులను కోరారు.
ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల:12-12-2024 Daily Short News
ఏపీ లో ఇంటర్మీడియట్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 1 వ తేదీ నుండి నిర్వహిస్తారు. ఈ పబ్లిక్ పరీక్షలు మార్చి 20 వరకూ కొనసాగుతాయి. అదేవిధం గా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 20 వరకూ కొనసాగుతాయి. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ రెండు విడతలలో ఈ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తారు.
నీట్ పీజీ -2025 పరీక్ష తేదీ ప్రకటన
నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు నీట్ పరీక్ష తేదీ ని ప్రకటించింది. వచ్చే ఏడాది జూన్ 15 వ తేదీన నీట్ పీజీ 2025 పరీక్ష ను నిర్వహిస్తారు. వచ్చే ఏడాది జూలై 15 కల్లా ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన వారు ఈ పరీక్షకు అర్హులు. దేశ వ్యాప్తం గా 52 వేలకు పైగా వైద్య పీజీ సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల కోసం దాదాపు రెండు లక్షల మందికై పైగా యూజీ చేసిన డాక్టర్లు పోటీ పడతారు.
రాష్ట్రం లో హెల్మెట్ ధరించక పోవడం వల్ల 667 మంది మృతి
ఏపీ లో ద్విచక్ర వాహన వినియోగ దారులు హెల్మెట్ ను ధరించక పోవడం పై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రం లో గత మూడు నెలలలో ఏకం గా 667 మంది హెల్మెట్ వాడక పోవడం వలన ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం అని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం చలానాలతోనే సరిపెట్టకుండా ప్రజలలో అవగాహన తీసుకు రావాలని ట్రాఫిక్ ఇనస్పెక్టర్ జనరల్ (ఐజీ) ని కోర్టు ఆదేశించింది.
గిన్నిస్ రికార్డు సృష్టించిన గీతా పారాయణం (12-12-2024 Daily Short News)
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో గీతా జయంతి సందర్భం గా 6000 మంది భక్తులు గీతా పారాయణం చేసారు. దీనితో ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకొంది. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరయ్యారు. గిన్నిస్ బుక్ ప్రతినిధుల నుండి ధ్రువ పత్రాన్ని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్వీకరించారు.
రైల్వే సవరణ బిల్లు కు ఆమోదం
రైల్వే సవరణ బిల్లు కు లోక్ సభ ఆమోద ముద్ర వేసింది. రైల్వే బోర్డు స్వతంత్రం గా పని చేయడం తో పాటు పని తీరు మెరుగు పరచడానికి ఈ బిల్లు తోడ్పడుతుందని కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వనీ వైష్ణవ్ అన్నారు.
వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన పుష్ప -2
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప -2 దేశ వ్యాప్తం గా భారీ వసూళ్లను రాబట్టింది. విడుదలైన ఏడు రోజుల్లోనే వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టిన తొలి చిత్రం గా రికార్డు సృష్టించింది ఈ చిత్రం. దేశం లో వెయ్యి కోట్లు వసూలు చేసిన ఎనిమిదవ చిత్రం గా పుష్ప నిలిచింది. భారత దేశం లో వెయ్యి కోట్లు వసూలు చేసిన ఎనిమిది చిత్రాలలో నాలుగు చిత్రాలు తెలుగు చిత్రాలు కావడం విశేషం.