13-12-2024 Daily Short News Telugu | ప్రపంచ చెస్ రారాజు గుకేష్ |సంక్షిప్త వార్తల సమాహారం
ఆస్ట్రేలియా లోని క్వీన్స్ లాండ్ రాష్ట్రం లో తీవ్రమైన నేరాలు చేసే పదేళ్ళ పిల్లలకు కూడా కఠిన మైన జైలు శిక్ష విధించాలని చట్టం తీసుకు వచ్చారు. పిల్లలలో నేర ప్రవృత్తి వివరీతం గా పెరిగిపోవడం తో హత్యలు, దోపిడీలు చేసే బాల నేరస్తుల సంఖ్య విపరీతం గా పెరగడం తో క్వీన్స్ లాండ్ రాష్ట్రం ఈ చట్టాన్ని తీసుకు వచ్చింది.
13-12-2024 Daily Short News Telugu |ప్రపంచ చెస్ రారాజు గుకేష్ | సంక్షిప్త వార్తల సమాహారం
ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ దొమ్మరాజు
సింగపూర్ లో జరిగిన ప్రపంచ క్లాసిక్ చెస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో మన దేశానికి చెందిన గుకేష్ దొమ్మరాజు విజేత గా నిలిచారు.పిన్న వయసులోనే ఈ ఛాంపియన్ షిప్ గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. చైనా ఆటగాడు డింగ్ లిరెన్ పై 14 వ రౌండ్ లో 7.5 – 6.5 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. కేవలం 18 ఏళ్ళ 8 నెలల 14 రోజుల వయసు లో గుకేష్ ఈ ఘనత ను సాధించారు. ఇంతకు ముందు గారీ కాస్పరోవ్ పేరిట ఈ రికార్డు ఉంది. 22 ఏళ్ళ 6 నెలల 27 రోజుల వయసు లో (1985 లో) కాస్పరోవ్ ఈ ఛాంపియన్ షిప్ గెలిచారు. ఆ రికార్డును గుకేష్ అధిగమించారు. భారత్ లో ఇంతకు ముందు విశ్వనాధన్ ఆనంద్ 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో టైటిల్ గెలిచారు. 13-12-2024 Daily Short News
జమిలి ఎన్నికలు – రెండు బిల్స్ ఆమోదించిన కేబినెట్
ఒకే దేశం – ఒకే ఎన్నిక పేరుతో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో రాజ్యాంగ సవరణ బిల్ కూడా ఉంది. ప్రస్తుతం లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడానికి ఈ సవరణ చేస్తున్నారు. అయితే కోవింద్ కమిటీ కేంద్ర, రాష్ట్ర ఎన్నికలతో పాటు స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. అయితే స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగాలంటే 50 శాతం రాష్ట్రాలు ఆమోదం తెలియజేయాలి. కాబట్టి ప్రస్తుత పరిస్టితులలో అది సాధ్యపడే అవకాశం కొంచం తక్కువ గా ఉండటం తో కేంద్ర, రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్ ప్రవేశ పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
అమరావతి నిర్మాణానికి ఏడీబీ, ప్రపంచ బ్యాంకు ఋణం
రాజధాని అమరావతి నగర నిర్మాణం కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) 15 వేల కోట్ల ఋణ మంజూరుకు ఆమోదం తెలిపింది. ప్రపంచ బ్యాంకు కూడా త్వరలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. దీనితో రాజధాని అమరావతి నిర్మాణానికి ఏడీబీ, ప్రపంచ బ్యాంకు సంయుక్తం గా 15 వేల కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నాయి. ఈ ఋణం FRMB పరిధి లోనికి రావని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
ప్రపంచం లోనే అతి సంపన్న వ్యక్తి గా ఎలాన్ మస్క్(13-12-2024 Daily Short News)
ప్రపంచం లోనే అత్యంత సంపన్న మైన వ్యక్తి గా ఎలాన్ మస్క్ నిలిచారు. ఏకం గా 447 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్న వ్యక్తి గా మస్క్ నిలిచారు. భారత కరెన్సీ లో ఆయన ఆదాయం 39 లక్షల కోట్ల రూపాయలు గా ఉంది. అమెరికా అద్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ఎలాన్ మస్క్ కి చెందిన వివిధ కంపెనీల షేర్ల ధరలు అమాంతం పెరిగి పోవడం తో ప్రపంచం లోనే అత్యంత ధనికుడిగా నిలిచారు.
భారత్ లో కాలుష్యం తో ఏటా పది లక్షల మంది మృతి
లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ జర్నల్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశం లో వాయు కాలుష్యం తో పదేళ్ళ లో ఏటా పది లక్షల మందికి పైగా మరణాలు సంభవించినట్లు పేర్కొంది. 2009 నుండి 2019 మధ్య కాలం లో జరిపిన అధ్యయనం ప్రకారం మన దేశం లో కోట్లాది మంది వాయు కాలుష్యం ప్రభావానికి గురవుతున్నారని, వచ్చే రోజులలో ఈ మరణాల సంఖ్య మరింత పెరగవచ్చని ఈ నివేదిక లో పేర్కొన్నారు.
క్రయోజెనిక్ ఇంజన్ పరీక్ష సక్సెస్ (13-12-2024 Daily Short News)
CE – 20 క్రయోజెనిక్ ఇంజన్ ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతం గా పరీక్షించారు. తమిళనాడు రాష్ట్రం లోని మహేంద్ర గిరులలో ఉన్న ప్రయోగ కేంద్రం లో ఈ క్రయోజెనిక్ ఇంజన్ ను విజయ వంతం గా ప్రయోగించినట్లు ఇస్రో తమ ‘X ‘ హ్యాండిల్ లో తెలిపింది
డోనాల్డ్ ట్రంప్ కి ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
అమెరికా నూతన అద్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ కి ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది. ప్రఖ్యాత టైం మ్యాగజైన్ 2024 సంవత్సరానికి గానూ ట్రంప్ కి ఈ అవార్డుని ప్రకటించింది. ఇంతకు ముందు 2016 వ సంవత్సరం లో కూడా ట్రంప్ కు ఈ అవార్డును ప్రకటించింది ఈ మ్యాగజైన్.
16 ఏళ్ళ లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేదించిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా తమ దేశం లోని 16 ఏళ్ళ లోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించ రాదని ఆంక్షలు విధించింది. పదహారేళ్ళ లోపు టీనేజర్లు సోషల్ మీడియా లో ఎక్కువ కాలం గడుపుతూ ఉండటం వలన అనేక సమస్యలు ఎదుర్కొనవలసి వస్తోందని అందుకే వారు సోషల్ మీడియాను వాడరాదని ఆస్ట్రేలియా కొత్త చట్టాన్ని తీసుకు వచ్చింది. (13-12-2024 Daily Short News)
ఆస్ట్రేలియా లో పదేళ్ళ పిల్లలకూ జైలు శిక్షలు
ఆస్ట్రేలియా లోని క్వీన్స్ లాండ్ రాష్ట్రం లో తీవ్రమైన నేరాలు చేసే పదేళ్ళ పిల్లలకు కూడా కఠిన మైన జైలు శిక్ష విధించాలని చట్టం తీసుకు వచ్చారు. పిల్లలలో నేర ప్రవృత్తి వివరీతం గా పెరిగిపోవడం తో హత్యలు, దోపిడీలు చేసే బాల నేరస్తుల సంఖ్య విపరీతం గా పెరగడం తో క్వీన్స్ లాండ్ రాష్ట్రం ఈ చట్టాన్ని తీసుకు వచ్చింది. దీని ప్రకారం తీవ్రమైన నేరాలకు పాల్పడే పదేళ్ళ వయసు బాలలకు ఎటువంటి పెరోల్ లేకుండా 20 ఏళ్లకు పైగా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది.
Daily short news, Daily Short News Telugu, Telugu Short News, Vijay News Telugu,