14-12-2024 Daily Short News| Current Affairs|కుంభ సహాయక్ చాట్ బోట్ | సంక్షిప్త సమాచారం
ప్రయోగ రాజ్ లో జనవరి 13 నుండి ప్రారంభమయ్యే కుంభ మేళా ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది. టెక్స్ట్ రూపం లోనూ వాయిస్ రూపం లోనూ భక్తులకు కావలసిన సమాచారాన్ని అంతా సులువుగా అందజేస్తుంది ఈ చాట్ బోట్.
14-12-2024 Daily Short News|Current Affairs|కుంభ సహాయక్ చాట్ బోట్| సంక్షిప్త సమాచారం
ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం
రాజ్యసభ ఉపఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ముగ్గురు అభ్యర్ధులు ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. బీద మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, ఆర్. కృష్ణయ్య రాజ్యసభకు ఎన్నికయ్యారు. వేరే అభ్యర్దులు ఎవరూ నామినేషన్ వేయకపోవడం తో వీరు ఏకగ్రీవం గా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.14-12-2024 Daily Short News
రాం కో సిమెంట్స్ కు సి ఐ ఐ అవార్డు.
సిఐఐ డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ అవార్డుల కార్య క్రమం లో రాం కో సిమెంట్స్ ‘ఆపరేషనల్ ఎక్స్ లెన్స్’ పురస్కారాన్ని పొందింది. 6 వ ఎడిషన్ సిఐఐ అవార్డుల కార్యక్రమం ఢిల్లీ లో జరిగింది. రాం కో సిమెంట్స్ కి సంబంధించి ‘రాం కో బిజినెస్ ఇంటలిజెన్స్’ ప్రాజెక్టు టాప్ 10 లో చోటు సంపాదించుకొంది.
సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ లో ఫైనల్ కు చేరిన ముంబై
దేశవాళీ టీ 20 క్రికెట్ టోర్నమెంట్ అయిన సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నమెంట్ లో ముంబై జట్టు ఫైనల్ కు చేరింది. సెమీ ఫైనల్ లో బరోడా జట్టును 6 వికెట్ల తేడా తో ఓడించి ఫైనల్ కు చేరింది. ముంబై జట్టులో అజింక్య రహానే కేవలం 56 బంతుల్లో 98 పరుగులు (11 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి జట్టు విజయానికి తోడ్పడ్డారు.
రాజ్ కపూర్ శత జయంతి (14-12-2024 Daily Short News)
రాజ్ కపూర్ డిసెంబర్ 14, 1924 న పెషావర్ (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది) లో జన్మించారు. ఆయన అనేక విలక్షణ సినిమాలు రూపొందించారు. ముఖ్యం గా ఆయన సినిమాలు భారతదేశం లోనే కాకుండా సోవియన్ యూనియన్ లో చాలా ప్రాచుర్యం పొందాయి. రాజ్ కపూర్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా అనేక విజయవంతమైన చిత్రాలను రూపొందించారు.
రాజ్ కపూర్ రూపొందించిన చిత్రాలకు అనేక జాతీయ చలన చిత్ర అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి. తన కెరీర్ లో అనేక క్లాసికల్ చిత్రాలను రూపొందించారు. వాటిలో ‘ఆవారా’, బూట్ పాలిష్, చోరీ చోరీ, శ్రీ 420, సంగం, జిస్ దేశ్ మే గంగా బెహతీ హై, అనారీ, బర్సాత్, ఆగ్, మేరా నాం జోకర్, జాగ్తే రహో వంటి అనేక చిత్రాలు ఉన్నాయి. సంగీతానికి రాజ్ కపూర్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వారు. అనేక అద్భుతమైన గీతాలు ఆయన చిత్రాలలో అలరించాయి. (14-12-2024 Daily Short News)
రాజ్ కపూర్ ను ఇండియన్ చార్లీ చాప్లిన్ అని కూడా అభివర్ణిస్తారు. సంగీత దర్శకుడిగా తన ప్రతిభ చూపించాలను కున్నారు. అయతే వివిధ శాఖలలో అయన మరింత ప్రతిభ చూపారు. మానవ సంబంధాలపై ప్రధానం గా ఆయన చిత్రాలను రూపొందించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను భారత ప్రభుత్వం ఆయనకు ప్రకటించింది.
మహా కుంభమేళా భక్తుల కు ప్రత్యేక ఆప్ ప్రారంభించిన ప్రధాని
మహా కుంభ మేళా 2025 లో పాల్గొనే భక్తులకు సహాయ పడేందుకు ‘కుంభ సహాయక్’ అనే ఏ ఐ తో పనిచేసే చాట్ బోట్ ను ప్రధాని ప్రారంభించారు. ప్రయోగ రాజ్ లో జనవరి 13 నుండి ప్రారంభమయ్యే కుంభ మేళా ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది. టెక్స్ట్ రూపం లోనూ వాయిస్ రూపం లోనూ భక్తులకు కావలసిన సమాచారాన్ని అంతా సులువుగా అందజేస్తుంది ఈ చాట్ బోట్. లక్షల మంది పాల్గొనే ఈ కుంభ మేళా లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో రూపొందించిన ఈ చాట్ బోట్ భక్తులకు మార్గదర్శకం గా ఉండగలదు.