January 10, 2025

16-12-2024 Daily Short News Telugu| Current Affairs |కర్ణాటక వృక్ష మాత ఎవరు?

0

అతి పిన్న వయసులో 1988 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను కూడా అందుకున్నారు. గ్రామీ అవార్డులకు ఎక్కువసార్లు నామినేట్ అయి మొత్తం నాలుగు సార్లు  గ్రామీ  అవార్డును అందుకున్న ఏకైక భారతీయ సంగీత కళాకారుడు జాకీర్ హుస్సేన్.

16-12-24 Daily Short News Telugu

16-12-24 Daily Short News Telugu

16-12-2024 Daily Short News| Current Affairs| కర్ణాటక వృక్ష మాత ఎవరు?

ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్ను మూత

తబలా మేస్ట్రో గా ప్రసిద్ధి గాంచిన ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ అల్లా రఖా ఖురేషి  73 ఏళ్ళ వయసులో తుది శ్వాస విడిచారు. రెండు వారాల క్రితం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడం తో అమెరికా లోని శాన్ ఫ్రాన్సిస్కో లో  ఆసుపత్రి లో చేరారు. ఊపిరి తిత్తుల వ్యాధి తో ఆయన గత కొద్ది కాలం గా అస్వస్థత కు గురౌతున్నారు. ఇడియో పతిక్ పల్మోనరి ఫైబ్రోసిస్ (Idiopathic Pulmonary Fibrosis) అనే ఊపిరితిత్తుల వ్యాధి కి చికిత్స తీసుకుంటూ డిసెంబర్ 16 వ తేదీ సోమవారం తెల్లవారుజామున అస్తమించారు. భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని తబలా వంటి వాయిద్య పరికరం తో విశ్వ వ్యాప్తం చేసి భారతీయత ను కొత్తపుంతలు తొక్కించారు. (16-12-2024 Daily Short News)

అతి పిన్న వయసులో 1988 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను కూడా అందుకున్నారు. గ్రామీ అవార్డులకు ఎక్కువసార్లు నామినేట్ అయి మొత్తం నాలుగు సార్లు  గ్రామీ  అవార్డును అందుకున్న ఏకైక భారతీయ సంగీత కళాకారుడు జాకీర్ హుస్సేన్. ‘వాహ్ తాజ్ వాహ్.. అంటూ అయన తాజ్ మహల్ టీ బ్రాండ్ కు చేసిన వాణిజ్య ప్రకటన అనేక మందిని అలరించింది. భారత శాస్త్రీయ సంగీత ప్రపంచం లో తబలా విద్వాంసుడిగా చెరగని ముద్ర వేసారు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్.

కర్ణాటక వృక్ష మాత కన్నుమూత (16-12-2024 Daily Short News)

కర్ణాటక వృక్ష మాత గా ప్రసిద్ధి గాంచిన తులసి గౌడ 86 ఏళ్ళ వయసు లో కన్ను మూశారు. తులసి గౌడ చేసిన సేవలకు గుర్తుగా 2021 వ సంవత్సరం లో అప్పటి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. పశ్చిమ కనుమలు, అంకోలా మరియు కార్వారా ప్రాంతాలలో ఉన్న అటవీ ప్రాంతం లో ఆమె దాదాపు 35 వేల మొక్కలను నాటి అడవుల విస్తరణ కు తోడ్పడ్డారు. అదే ప్రాంతాలలో ఉన్న ఒక్కళిగ కుటుంబాలకు చెందిన వారితో పది లక్షలకు పైగా మొక్కలను నాటించారు. తన జీవిత కాలం అంతా మొక్కలు నాటుతూ అందరితో మొక్కలు నాటించే ప్రయత్నం చేసేవారు. అందుకే ఆమెను ‘కర్ణాటక వృక్ష మాత’ గా అందరూ గౌరవిస్తారు. వృద్దాప్యం కారణం గా వివిధ అనారోగ్య సమస్యలతో ఆమె డిసెంబర్ 16 వ తేదీ 2024 న  తుది శ్వాస విడిచారు .(16-12-2024 Daily Short News)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *