January 10, 2025

19-12-2024 Daily Short News Telugu| Daily Current Affairs Telugu|

0

దేశవ్యాప్తం గా ఒకేరోజు ఎన్నికల నిర్వహణ కు సంబంధించిన జమిలి ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ను ప్రతిపాదిస్తూ పార్లమెంట్ లో బిల్లు ను ప్రవేశ పెట్టింది. దీనికి సంబంధించి 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ని ఏర్పాటు చేసింది.

19-12-2024 Daily Short News Telugu

19-12-2024 Daily Short News Telugu

19-12-2024 Daily Short News Telugu| Daily Current Affairs Telugu|

నెల్లూరు జిల్లా లో ఆరేళ్ళ బాలునికి సోకిన ‘జికా వైరస్’

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ళ వయసు గల  ఒక బాలుని కి జికా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. పూణే లో ఉన్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంస్థ జరిపిన పరీక్షలలో బాలునికి జికా వైరస్ సోకినట్లు తేలింది. ఇతర ప్రైవేట్ పరీక్ష శాల లో కూడా జికా వైరస్ లక్షణాలను బాలునిలో నిర్ధారించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కు ఈ సమాచారాన్ని అందించారు. దాదాపు పది రోజుల పాటు తీవ్ర జ్వరం, ఫిట్స్ తో బాధ పడిన బాలునికి వచ్చిన వ్యాధి అంతుచిక్కక పోవడం తో రక్తం యొక్క శాంపిల్ ను పూణే పంపించారు. దానితో బాలునికి జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడం తో హుటాహుటిన చెన్నై ఎగ్మోర్ ఆస్పత్రి కి బాలుని తరలించారు. (19-12-2024 Daily Short News Telugu)

SBI మేనేజింగ్ డైరెక్టర్ గా తెలుగు వ్యక్తి (19-12-2024 Daily Short News Telugu)

భారత దేశం లో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి మేనేజింగ్ డైరెక్టర్ గా శ్రీ అమర రామ మోహన రావు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని చీరాల కు చెందిన శ్రీ రామ మోహనరావు మొదట ప్రొబేషనరీ అధికారిగా 1991 వ సంవత్సరం లో విశాఖ పట్నం లోనే స్టేట్ బ్యాంకు లో ఉద్యోగం పొందారు. ఈ పదవి ని ఆయన మూడేళ్ళ పాటు నిర్వర్తిస్తారు. ఇప్పటివరకు ఆయన SBI డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. (19-12-2024 Daily Short News Telugu)

ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎం.డీ గా ఉన్న సి. శ్రీనివాసులు శెట్టి SBI చైర్మన్ గా నియమితులయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉన్నతాధికారులను సిఫారసు చేసే ‘ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) SBI ఎం డీ గా శ్రీ అమర రామమోహనరావు పేరును సిఫారసు చేసింది. దానితో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వం లోని వివిధ నియామకాలు చేసే మంత్రి వర్గ సంఘం అమర రామమోహన రావు ను మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించింది.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న పెనుగొండ లక్ష్మీ నారాయణ

అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జాతీయ అధ్యక్షుడు, ప్రముఖ రచయిత శ్రీ పెనుగొండ లక్ష్మీ నారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్నారు. శ్రీ పెనుగొండ లక్ష్మీ నారాయణ రచించిన అభ్యుదయ వ్యాసాల సంకలనం ‘దీపిక’ కు ఈ అవార్డు లభించింది.

జమిలి ఎన్నికలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు 

దేశవ్యాప్తం గా ఒకేరోజు ఎన్నికల నిర్వహణ కు సంబంధించిన జమిలి ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ను ప్రతిపాదిస్తూ పార్లమెంట్ లో బిల్లు ను ప్రవేశ పెట్టింది. దీనికి సంబంధించి 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ని ఏర్పాటు చేసింది. కేంద్ర న్యాయ శాఖా మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ ఈ తీర్మానాన్ని పార్లమెంట్ లో ప్రవేశ పెడతారు. 21 మంది లోక్ సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఈ కమిటీ లో ఉంటారు. వచ్చే సంవత్సరం జరిగే బడ్జెట్ సమావేశాల చివరి వారం లో ఈ కమిటీ తన నివేదికను సమర్పించాలని గడువు విధించారు.

ఈ జేపీసీ లో ఏపీ నుండి సి ఎం రమేష్, హరీష్ బాలయోగి, బాలశౌరి ఎంపికయ్యారు. మొదటి సారి పార్లమెంట్ కి ఎన్నికైన ప్రియాంకా గాంధీ కి కూడా ఈ పార్లమెంటరీ కమిటీ లో చోటు దక్కడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *