1st Test Aus Vs Ind BGT 2024| 1st day highlights| తొలిరోజు 16 వికెట్ల పతనం
రెండవరోజు ఏ జట్టు అయితే పై చేయి సాధిస్తుందో ఆ జట్టునే విజయం వరిస్తుంది అని చెప్పడం అతిశయోక్తి కాదు. మొదటి రోజు ఆటలో మొత్తం ఇరు వైపులా 16 వికెట్ల పతనం దీనినే సూచిస్తుంది. భారత్ తమ రెండవ ఇన్నింగ్స్ లో గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగితే మాత్రం ఈ టెస్టు లో గెలిచి తీరుతుంది.
1st Test Aus Vs Ind BGT 2024| 1st day highlights| తొలిరోజు 16 వికెట్ల పతనం
ఆస్ట్రేలియా ఇండియా జట్ల మధ్య పెర్త్ లో జరుగుతున్న మొదటి టెస్టు లో మొదటిరోజు రసవత్తరం గా జరిగింది. మొదటి రోజే ఇరు జట్లకు చెందిన 16 వికెట్లు పతనం కావడం తో టెస్టు ఫలితం తేలే అవకాశం స్పష్టం గా ఉంది. రెండవ రోజు ఏ జట్టు అయితే పైచేయి సాధిస్తుందో ఆ జట్టునే విజయం వరించడం ఖాయం గా కనబడుతోంది.1st Test Aus Vs Ind
తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు తమ మొదటి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. అంతకు ముందు మొదటి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్, బుమ్రా కీలకమైన 4 వికెట్లు పడగొట్టడం ఈ రోజు ఆటలో హైలెట్స్ గా చెప్పవచ్చు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 ఐదు టెస్టుల సీరీస్ ప్రారంభం అయ్యింది. ఆస్ట్రేలియా లోని పెర్త్ లో ప్రారంభం అయిన మొదటి టెస్టు లో మొదటి రోజు టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టెస్టు ద్వారా దేవదత్ పడిక్కల్, హర్షిత్ రాణా ఆరంగేట్రం చేసారు.
ఇన్నింగ్స్ లో ఆరంభం లోనే జైస్వాల్ అవుట్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు కు ఆది లోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యశస్వి జైస్వాల్ రెండవ ఓవర్ మొదటి బంతి కే స్టార్క్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. జట్టు స్కోరు 5 పరుగుల వద్ద మొదటి వికెట్ ను కోల్పోయింది భారత్. మొదటి టెస్టు ఆడుతున్న పడిక్కల్ క్రీజులోనికి వచ్చి చాలా సేపు ఆచి తూచి ఆడాడు. 23 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్ తన ఖాతా తెరవకుండానే డకౌట్ గా వెనుదిరిగాడు. హేజెల్ వుడ్ బౌలింగ్ లో కేరీ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు పడిక్కల్. 1st Test Aus Vs Ind
పడిక్కల్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన కోహ్లీ కూడా సరిగ్గా ఆడలేక పోయాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ హేజెల్ వుడ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అప్పటికి భారత జట్టు స్కోరు మూడు వికెట్ల నష్టానికి 32 పరుగులు మాత్రమే.
73 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన భారత్
అప్పటివరకు ఓపిగ్గా ఆడిన రాహుల్ 26 పరుగులు చేసి అవుట్ కావడం తో 47 పరుగుల వద్ద 4 వ వికెట్ పతనం అయ్యింది. ఆ తర్వాత ధృవ్ జ్యురెల్ కూడా తక్కువ స్కోరు కే తిరుగుముఖం పట్టడం తో భారత్ జట్టు 59 పరుగులకే కీలకమైన 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్వంత గడ్డ పై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కి గురైన తర్వాత ఆ షాక్ నుండి ఇంకా కోలుకోనట్లే కనిపించింది. వాషింగ్టన్ సుందర్ కేవలం 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అప్పటికి భారత స్కోరు 6 వికెట్ల నష్టానికి 73 పరుగులు.
మరొక ఎండ్ లో రిషబ్ పంత్ భారీ స్కోరు చేసేటట్లు కనిపించాడు. 78 బంతుల్లో 37 పరుగులు చేసిన పంత్ చివరకు కమ్మిన్స్ బౌలింగ్ లో క్వాజా కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పంత్ స్కోరులో ఇక సిక్సర్, మూడు ఫోర్లు ఉన్నాయి. అప్పటికి జట్టు స్కోరు 7 వికెట్ల నష్టానికి 121 పరుగులు.
తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సంచలన ఇన్నింగ్స్
ఈ టెస్టులోనే ఆరంగేట్రం చేసిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన పరిణితి ప్రదర్శించాడు. జట్టులో సీనియర్ బ్యాట్స్ మన్ విఫలమైనప్పటికీ అపారమైన అనుభవం గల ఆటగాడిగా నితీష్ రెడ్డి చక్కటి షాట్ లు ఆడి తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. నితీష్ రెడ్డి ని అవుట్ చేయడానికి ఆస్ట్రేలియన్ బౌలర్లు విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు.
మరొక ఎండ్ లో నితీష్ రెడ్డి కి సరైన మద్దతు లభించక పోవడం తో భారీ స్కోరు సాధించ లేక పోయాడు. హర్షిత్ రాణా, బుమ్రా అవుట్ కావడం తో డీలా పడ్డ నితీష్ రెడ్డి చివరకు 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నితీష్ రెడ్డి స్కోరు లో ఒక సిక్సర్, 6 బౌండరీలు ఉండటం విశేషం. భారత ఇన్నింగ్స్ లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ హైలెట్ గా నిలచింది. ఈ విధం గా 150 పరుగులకు భారత జట్టు ఆలౌట్ అయ్యింది. 1st Test Aus Vs Ind
ఆస్ట్రేలియా బౌలింగ్ లో హేజెల్ వుడ్ 4 వికెట్లు, కమ్మిన్స్ , స్టార్క్ 2 వికెట్ల చొప్పున తీసుకున్నారు. మొత్తం 49.4 ఓవర్ల లో 150 పరుగులు చేసి భారత జట్టు ఆలౌట్ అయ్యింది.
ఆస్ట్రేలియా వెన్ను విరిచిన బుమ్రా
వెంటనే తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు తమ రెండవ ఓవర్ లోనే మొదటి వికెట్ ను కోల్పోయింది. బుమ్రా అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్ లో బౌలింగ్ వేయడం తో ఆస్ట్రేలియా జట్టుకు కష్టాలు ఎదురయ్యాయి. ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ ను ఊపిరి పీల్చు కొనివ్వలేదు బుమ్రా. అతి కీలకమైన 4 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ వెన్ను విరిచాడు బుమ్రా.
మరొక ప్రక్క సిరాజ్, హర్షిత్ రానా కూడా కట్టుదిట్టం గా బౌలింగ్ చేయడం తో 27 ఓవర్ల లో కేవలం 67 పరుగులు మాత్రమే చేయగలిగింది ఆస్ట్రేలియా.ఈ మధ్య అంతగా ఫాం లో లేని సిరాజ్ రెండు వికెట్లు తీయడం విశేషం.
అలాగే మొదటి టెస్టు ఆడుతున్న హర్షిత్ రాణా తన మొదటి టెస్టు వికెట్ ను సాధించడం విశేషం. ట్రావిస్ హెడ్ ను బౌల్డ్ చేయడం ద్వారా మొదటి వికెట్ సాధించిన రాణా కూడా చక్కటి బౌలింగ్ చేసాడు. ఆస్ట్రేలియా జట్టులో ఎవరూ పెద్ద స్కోరు సాధించలేక పోయారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి కేరీ 19 పరుగులతో, స్టార్క్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండవ రోజు ఆటపైనే ఫలితం 1st Test Aus Vs Ind
రెండవరోజు ఏ జట్టు అయితే పై చేయి సాధిస్తుందో ఆ జట్టునే విజయం వరిస్తుంది అని చెప్పడం అతిశయోక్తి కాదు. మొదటి రోజు ఆటలో మొత్తం ఇరు వైపులా 16 వికెట్ల పతనం దీనినే సూచిస్తుంది. భారత్ తమ రెండవ ఇన్నింగ్స్ లో గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగితే మాత్రం ఈ టెస్టు లో గెలిచి తీరుతుంది.
ind vs aus live,
mitchell starc,
india vs australia live,
aus vs ind live,
bgt score,
india vs aus,
ind vs aus test live,
india australia match,
india australia,
ind aus test,
test match live,
aus vs ind test,
bumrah,
virat kohli,
border-gavaskar trophy,
yashasvi jaiswal,
sports,
ind v aus,
india at australia,
ind vs australia,
in vs aus,
1st test cricket india vs australia,
india vs australia test series,
bgt live score,
india-australia test match,
australia vs. india,