1st Test Aus vs Ind BGT 2024| 2nd day highlights| భారత్ దే పై చేయి
ఇప్పటికే 218 పరుగుల ఆధిక్యం లో ఉంది భారత్. పది వికెట్లు చేతిలో ఉన్నాయి. మూడవ రోజు అంతా గనుక బ్యాటింగ్ చేయగలిగితే 400 పై చిలుకు ఆధిక్యం లభిస్తుంది. దీనితో ఈ టెస్టు మ్యాచ్ లో గెలుపు దిశగా పయనం చేయడం మరింత సులువు అవుతుంది.
1st Test Aus vs Ind BGT 2024| 2nd day highlights| భారత్ దే పై చేయి
ఆస్ట్రేలియా ఇండియా జట్ల మధ్య పెర్త్ లో జరుగుతున్న మొదటి టెస్టు రెండవ రోజు ఆటలో భారత్ పై చేయి సాధించింది. మొదటి రోజు ఆటలో 16 వికెట్లు పడ్డాయి. దీనితో రెండవ రోజే ఫలితం తేలిపోతుంది అని అనుకున్నారు అంతా.1st Test Aus vs Ind
కానీ జైస్వాల్, రాహుల్ ఆస్ట్రేలియా బౌలర్ల కు చుక్కలు చూపించడం తో పరిస్థితి మొత్తం మారిపోయింది. మొదటి వికెట్ కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పే దిశ గా భారత ఓపెనింగ్ జోడీ దూసుకు పోతోంది. ఆస్ట్రేలియా పై ప్రస్తుతం 218 పరుగుల ఆధిక్యం లో కొనసాగుతోంది భారత జట్టు. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి జైస్వాల్ 90 పరుగులతోనూ, రాహుల్ 62 పరుగులతోనూ ఆడుతున్నారు.
రెండవ రోజు ఏం జరిగింది అంటే..
67 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది. కొద్దిసేపు ప్రతిఘటించిన బ్యాట్స్ మన్ 104 పరుగులకు ఆలౌట్ అయ్యారు. కేరీ 21 పరుగులు, స్టార్క్ 26 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కమ్మిన్స్ ను అవుట్ చేయడం ద్వారా బుమ్రా 5 వికెట్లు సాధించడం విశేషం. జట్టు కెప్టెన్ గా 5 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.1st Test Aus vs Ind
రెండవ ఇన్నింగ్స్ లో అదరగొట్టిన భారత ఓపెనర్లు
రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన జైస్వాల్ , కే.ఎల్ రాహుల్ చాలా నిదానం గా ఆటను ప్రారంభించారు. మెల్లగా ఒక్కో పరుగూ చేస్తూ, వీలు కుదిరినప్పుడు ఫోర్లు కొడుతూ స్కోరు బోర్డు ను పరుగులెత్తించారు. మధ్యలో కొన్ని సార్లు అవుట్ అయ్యే పరిస్టితి నుండి తప్పించుకున్నారు. దీనితో ఆస్ట్రేలియా బౌలర్ల లో అసహనం పెరిగిపోయింది.
అనేక రకాలుగా ప్రయత్నించారు. పార్ట్ టైం బౌలర్ల తో కూడా బౌలింగ్ చేయించారు. అయినా సరే అటు జైస్వాల్ గానీ, రాహుల్ గానీ తొణకలేదు బెణకలేదు. టెస్టు క్రికెట్ ఎలా ఆడాలో అలాగే ఆడారు. ఎక్కడా తొందర పడలేదు. ఆచి తూచి ఆడారు. సొగసైన షాట్లు ఆడారు.
జైస్వాల్ కొట్టిన సిక్స్ అయితే 100 మీటర్ల దూరం లో పడింది. చాలా ఆత్మ విశ్వాసం తో ఆడారు. ఇద్దరిలో జైస్వాల్ కొంచం దూకుడు గానే ఆడాడని చెప్పవచ్చు. మొదటి ఇన్నింగ్స్ లో చెత్త షాట్ కొట్టి డకౌట్ తో ఈ సారి తీవ్రం గా శ్రమించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత సాధించాడు.1st Test Aus vs Ind
ఈ ఇద్దరూ అభేద్యమైన 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 2004 సంవత్సరం తర్వాత ఓపెనర్లు ఇంత ఎక్కువ భాగస్వామ్యం నెలకొల్పింది లేదు. ఆస్ట్రేలియా గడ్డ పై ఎక్కువ భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనర్లు గా చరిత్ర సృష్టించాలంటే మరొక 20 పరుగులు చేయవలసి ఉంటుంది.
ఇప్పటికే 218 పరుగుల ఆధిక్యం లో ఉంది భారత్. పది వికెట్లు చేతిలో ఉన్నాయి. మూడవ రోజు అంతా గనుక బ్యాటింగ్ చేయగలిగితే 400 పై చిలుకు ఆధిక్యం లభిస్తుంది. దీనితో ఈ టెస్టు మ్యాచ్ లో గెలుపు దిశగా పయనం చేయడం మరింత సులువు అవుతుంది.
ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ చేరుకోవాలంటే ఈ సీరీస్ ను గెలవడం తప్పనిసరి భారత్ కు. న్యూజిలాండ్ సీరీస్ ను కనీసం డ్రా చేసుకున్నా సరిపోయేది. అలా కాకపోవడం తో ఈ సీరీస్ ను కచ్చితం గా గెలవవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం భారత ఆటగాళ్ళు ఆడుతున్నతీరు చూస్తే ఈ సీరీస్ ను గెలవగలరు అనే నమ్మకం అభిమానులకు కలుగుతోంది. 1st Test Aus vs Ind
భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ : 150 పరుగులకు ఆలౌట్
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ : 104 పరుగులకు ఆలౌట్
భారత జట్టు రెండవ ఇన్నింగ్స్ : వికెట్ నష్టపోకుండా 172 పరుగులు
Nice explanation. Keep going.
Thank you very much sir