1st Test Aus vs Ind BGT 2024| Day 3 Highlights|జైస్వాల్,కోహ్లీ సెంచరీలు | పటిష్ట స్థితి లో భారత్
1st Test Aus vs Ind BGT 2024| Day 3 Highlights|జైస్వాల్,కోహ్లీ సెంచరీలు | పటిష్ట స్థితి లో భారత్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో మొదటి టెస్టు లో భారత జట్టు పటిష్టమైన స్థితి లో ఉంది. ఆసీస్ గడ్డ పై జైస్వాల్, కోహ్లీ సెంచరీలతో కదం తొక్కగా బుమ్రా అద్భుతమైన బౌలింగ్ విన్యాసం తో విజయం వైపుకు దూసుకు పోతోంది భారత జట్టు.1st Test Aus vs Ind
రెండవ ఇన్నింగ్స్ లో 487 /6 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడం తో ఆస్ట్రేలియా జట్టు ముందు 534 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది భారత జట్టు. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. బుమ్రా రెండు వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీయడం తో ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 12 పరుగులు చేసింది.
మూడవ రోజు ఏం జరిగిందంటే..
రెండవరోజు నాటౌట్ గా ఉన్న జైస్వాల్, రాహుల్ ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించారు. భాగస్వామ్యం 201 పరుగులకు చేరిన తర్వాత కే.ఎల్ రాహుల్ 77 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన పడిక్కల్ కొంచం ఆచి తూచి ఆడినప్పటికీ 25 పరుగుల వద్ద హేజెల్ వుడ్ బౌలింగ్ లో అవుట్ కావడం జరిగింది.1st Test Aus vs Ind
మరొక ప్రక్క జైస్వాల్ చక్కటి షాట్ల తో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇంకా వేగం గా పరుగులు తీస్తూ 150 పరుగుల మైలు రాయిని చేరుకున్నాడు. సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్ 161 పరుగులు చేసిన తర్వాత మిచెల్ మార్ష్ బౌలింగ్ లో స్మిత్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జైస్వాల్ ఇన్నింగ్స్ 297 బంతులు ఆడి 161 పరుగులు చేసాడు. దీనిలో 3 సిక్సర్లు, 15 ఫోర్లు ఉన్నాయి.
జైస్వాల్ అవుట్ అయిన కొద్ది సేపటికే పంత్ కూడా అవుట్ అయ్యాడు. తర్వాతి ఓవర్ లోనే జ్యురెల్ దురదృష్టవ శాత్తూ అంపైర్ కాల్ కి అవుట్ అయ్యాడు. రివ్యూ లో అవుట్ కాలేదని స్పష్టం గా కనిపించినప్పటికీ అంపైర్ కాల్ కావడం తో వెనుదిరగవలసి వచ్చింది.1st Test Aus vs Ind
క్రీజు లో ఉన్న కోహ్లీ చక్కటి షాట్లు ఆడుతూ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రారంభం నుండే దూకుడు గా ఆడుతూ చూడ చక్కని బ్యాటింగ్ చేసాడు కోహ్లీ. రెండేళ్ళ విరామం తర్వాత కోహ్లీ సెంచరీ చేయడం విశేషం. ఆస్ట్రేలియా పై ఇంతకు ముందు పెర్త్ లోనే సెంచరీ చేసాడు. చాలా రోజుల బ్రేక్ తర్వాత మళ్ళీ కోహ్లీ ఫాం లోనికి రావడం తో అభిమానుల ఆనందానికి హద్దులు లేవనే చెప్పవచ్చు.
ఏది ఏమైనప్పటికీ ఈ టెస్టును భారత జట్టు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కీలకమైన సమయం లో కీలకమైన ఆటగాళ్ళు ఫాం లోనికి రావడం తో ఈ టెస్టును భారత జట్టు గెలవడం ఇక లాంచనమే అని చెప్పవచ్చు. పెర్త్ లో టెస్టును గెలవడం ఒక మధుర అనుభూతిగా మిగలనుంది.