1st Test Aus vs Ind BGT 2024| Day 4 highlights|పెర్త్ టెస్ట్ లో భారత్ ఘన విజయం
1st Test Aus vs Ind BGT 2024| Day 4 highlights|పెర్త్ టెస్ట్ లో భారత్ ఘన విజయం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగం గా పెర్త్ లో జరిగిన మొదటి టెస్టు లో ఆస్ట్రేలియా పై భారత్ ఘన విజయం సాధించింది. మూడవ రోజునే భారత విజయం ఖరారు అయినప్పటికీ ఆసీస్ నాల్గవ రోజు కొద్దిగా ప్రతిఘటించింది. 1st Test Aus vs Ind BGT
ఆసీస్ బ్యాట్స్ మన్ లో ట్రావిస్ హెడ్, మార్ష్ తప్ప మిగిలిన వారు అందరూ చేతులెత్తేశారు. దీనితో భారత్ 295 పరుగుల భారీ తేడా తో మొదటి టెస్టు లో ఘన విజయం సాధించింది. రెండు ఇన్నింగ్స్ లోనూ చక్కాగా బౌల్ చేసి మొత్తం 8 వికెట్లు పడగొట్టిన కెప్టెన్ బుమ్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపిక అయ్యారు.
నాల్గవ రోజు ఏం జరిగింది అంటే…
మూడు వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది. స్టీవెన్ స్మిత్ 17 పరుగులకు చేసి అవుట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ మరియు స్టీవెన్ స్మిత్ 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్మిత్ అవుట్ అయిన తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ తో కలిసి ట్రావిస్ హెడ్ 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ట్రావిస్ హెడ్ 89 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
మిచెల్ మార్ష్ 47 పరుగులకు, మిచెల్ స్టార్క్ 12 పరుగులకు, నాథన్ లయన్ పరుగులు ఏమీ చేయకుండా అవుట్ అయ్యారు. అలెక్స్ క్యారీ ని హర్షిత్ రాణా అవుట్ చేయడం తో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ కు తెరపడింది.
ఆస్ట్రేలియా జట్టు 58.4 ఓవర్ల లో 238 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీనితో భారత జట్టు 295 పరుగుల భారీ ఆధిక్యం తో ఆస్ట్రేలియా పై గెలుపొందింది. బుమ్రా 3 వికెట్లు, సిరాజ్ 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు, హర్షిత్ రాణా, నితీష్ రెడ్డి ఒక్కొక్క వికెట్ చొప్పున పడగొట్టారు. ఈ మ్యాచ్ ద్వారా ఆరంగేట్రం చేసిన నితీష్ రెడ్డి కూడా ఒక వికెట్ పడగొట్టడం విశేషం.
బోర్డర్ గవాస్కర్ సీరీస్ లో భాగం జరిగిన మొదటి టెస్టును ఆస్ట్రేలియా గడ్డ పైనే ఓడించడం తో భారత శిబిరం లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడు తోంది. ఈ టెస్టులో బ్యాట్స్ మన్, బౌలర్లు అందరూ చక్కటి ప్రదర్శన చేసారు. దీనితో ఎలాగైనా ఈ టెస్టు సీరీస్ లో గెలిచి ప్రపంచ చాంపియన్ షిప్ లో పాల్గొనాలనే కాంక్ష వ్యక్తమౌతోంది. 1st Test Aus vs Ind BGT
ఆస్ట్రేలియన్ పత్రికలు బుమ్రా ను ఆకాశానికి ఎత్తేయడం మరొక కొస మెరుపు. న్యూజిలాండ్ చేతిలో స్వంత గడ్డ పై వైట్ వాష్ కు గురయ్యి తీవ్ర విమర్శలకు గురైంది భారత జట్టు. ఆ పరాభవం నుండి అతి త్వరగానే కోలుకుని ఆసీస్ ను వారి స్వంత గడ్డ పైనే ఓడించి తిరిగి ఫాం లోనికి వచ్చింది భారత క్రికెట్ జట్టు.
కుర్రాళ్ళు ఇరగదీసారు
ఈ టెస్టు తో ఆరంగేట్రం చేసిన హర్షిత్ రాణా, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చాలా చక్కటి ప్రదర్శన చేసారు. నితీష్ రెడ్డి అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ తన ప్రతిభ ను కనబరచారు. హర్షిత్ రాణా కూడా కీలకమైన వికెట్లు పడగొట్టి తన ఆగమనాన్ని గొప్పగా చాటాడు.
రెండేళ్ళ క్రితం ఎప్పుడో టెస్టు క్రికెట్ లో సెంచరీ చేసిన కింగ్ కోహ్లీ కూడా తిరిగి ఫాం లోనికి వచ్చి అజేయం గా టెస్టు సెంచరీ చేయడం గొప్ప విషయం. కే.ఎల్ రాహుల్, పంత్, వాషింగ్టన్ సుందర్ వంటి వారు తిరిగి ఫాం లోనికి రావడం శుభ పరిణామం.
జ్యురెల్ దురదృష్టవశాత్తూ అవుట్ కావడం, పడిక్కల్ మొదటి ఇన్నింగ్స్ లో డకౌట్ అయి, రెండవ ఇన్నింగ్స్ లో 25 పరుగులు చేయడం కొద్దిగా మైనస్ అయినప్పటికీ ఓవరాల్ గా అందరూ బాగా ఆడారు.1st Test Aus vs Ind BGT
ఆసీస్ వెన్ను విరిచిన బుమ్రా (1st Test Aus vs Ind BGT)
ఈ చారిత్రాత్మక విజయం లో కెప్టెన్ గా వ్యవహరించిన బుమ్రా పాత్ర గురించి తప్పకుండా చెప్పాలి. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా పై 5 వికెట్లు పడగొట్టి ఉండక పోతే ఈ టెస్టు ఫలితం మరొక విధం గా ఉండేది. మ్యాచ్ రెండవ రోజు పిచ్ పై తేమను వినియోగించుకొని కీలకమైన బ్యాట్స్ మన్ ను అవుట్ చేయడం తో భారత శిబిరం లో నూతనోత్సాహం వచ్చింది. మరొక ప్రక్క సిరాజ్ కూడా చక్కగా బౌలింగ్ చేయడం తో ఆసీస్ బ్యాట్స్ మన్ ఏ దశ లోనూ కోలుకోలేక పోయారు.
ఈ టెస్టు విజయం లో అత్యంత కీలక మలుపు తీసుకు వచ్చింది మాత్రం జైస్వాల్. ఇరవై రెండేళ్ళ కుర్రాడు ఆసీస్ సీనియర్ బౌలర్ల ను సైతం లెక్క చేయకుండా 150 కి పైగా పరుగులు సాధించడం ఈ టెస్టు లోనే అతి ముఖ్యమైన సంఘటన గా చెప్పవచ్చు.
స్పీడ్ సరిపోవడం లేదంటూ స్టార్క్ వంటి సీనియర్ బౌలర్లను కూడా రెచ్చగొట్టి పరుగులు సాధించాడంటే ఎంత కృత నిశ్చయం తో ఆడాడో మనం అర్ధం చేసుకోవచ్చు. మొదటి ఇన్నింగ్స్ డకౌట్ కావడం కలిగించిన ప్రతీకారం నిరాశ తో ఆడుతున్న జట్టుకు ఊపిరి పోసింది అనడం అతిశయోక్తి కాదు.
ind vs aus 2nd test
wtc table
wtc points table 2024
steve smith
wtc
cricket live score today india
abhishek nayar
test championship points table
wtc standings
india vs australia 2nd test,
icc test championship,
live cricket match today india,
test ranking,
1st test Aus vs Ind,