January 10, 2025

సంచలన విజయం దిశ గా డొనాల్డ్ ట్రంప్| అమెరికా అద్యక్ష పీఠం పై మళ్ళీ ట్రంప్

కడపటి వార్తలు అందేసరికి(భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.40 PM)  ట్రంప్ 277 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించారు. కమలా హారిస్ 224 ఓట్లు సాధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలుపుకు అవసరమైన 270 స్థానాలను ట్రంప్ ఇప్పటికే గెలుచుకున్నారు. దీనితో అమెరికా అధ్యక్ష పీఠాన్ని ట్రంప్  రెండవసారి అధిరోహించ బోతున్నారు. 

2024 United States Elections - Donald Trump

2024 United States Elections - Donald Trump

సంచలన విజయం దిశ గా డొనాల్డ్ ట్రంప్| అమెరికా అద్యక్ష పీఠం పై మళ్ళీ ట్రంప్| 2024 United States Elections

అమెరికా అధ్యక్ష  ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించే దిశ గా ముందుకు దూసుకు వెళ్తోంది. డోనాల్డ్ ట్రంప్ తిరిగి రెండోసారి అమెరికా అద్యక్ష పీఠాన్ని అధిరోహించ బోతున్నారు. డెమో క్రాటిక్ పార్టీ అనూహ్యం గా పరాజయం పాలు కాబోతోంది. అమెరికా లోని కొన్ని రాష్ట్రాలలో ఇంకా ఓట్ల లెక్కింపు జరుగుతోంది కాబట్టి పూర్తి ఫలితాలు ఇంకా వెలువడలేదు.2024 United States Elections

అయితే మెజార్టీ కి అవసరమైన 274 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను ట్రంప్ గెలుచుకోవడం విశేషం. కీలకమైన స్వింగ్ స్టేట్స్ లో కూడా ట్రంప్ హవా నడిచింది. అంతే గాకుండా 300 కు పైగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు గెలుస్తానని విజయోత్సవ సభలో ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.కమలా హారిస్ చివరిదాకా గట్టి  పోటీ ఇచ్చినప్పటికీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల లో వెనుకబడి ఉన్నారు. ట్రంప్ విజయం తో వలసదారులకు కష్టాలు ఎదురు కావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

కడపటి వార్తలు అందేసరికి(భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.40 PM)  ట్రంప్ 277 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించారు. కమలా హారిస్ 224 ఓట్లు సాధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలుపుకు అవసరమైన 270 స్థానాలను ట్రంప్ ఇప్పటికే గెలుచుకున్నారు. దీనితో అమెరికా అధ్యక్ష పీఠాన్ని ట్రంప్  రెండవసారి అధిరోహించ బోతున్నారు.

అద్యక్ష ఎన్నికల ఫలితాలు ట్రంప్ కు అనుకూలం గా రావడం తో అమెరికా లోని పలు ప్రాంతాలలో సంబరాలు మిన్నంటాయి. ట్రంప్ విజయోత్సవ సభలో తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. తనకు భారీ విజయాన్ని అందించిన ప్రజలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలియజేసారు. ఇకపై అమెరికా ప్రజలకోసం  అమెరికా  ఫస్ట్ అనే నినాదం తో తాను ముందుకు వెళ్తానని చెప్పారు. ప్రపంచం లో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలను ఆపడానికి ప్రయత్నం చేస్తానని ట్రంప్ ప్రకటించారు.

అలాగే అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్న జేడీవాన్స్ ను ఆయన భార్య ఉషా వాన్స్ ను ట్రంప్ ప్రత్యేకం గా అభినందించారు.

ఈ సందర్భం గా భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ కు శుభాకాంక్షలు తెలియజేసారు. అపూర్వ విజయాన్ని సాధించిన మిత్రుడు ట్రంప్ కు ప్రత్యేక శుభాకాంక్షలు. గతం లో మాదిరి గానే భారత్ – అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేయడానికి, ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం కలిసి పనిచేద్దాం మిత్రమా అంటూ మోడీ ‘ఎక్స్ ‘ లో తన సందేశాన్ని ట్రంప్ కు పంపించారు.

79 ఏళ్ల వయసుగల ట్రంప్ అమెరికా 47 వ అధ్యక్షుడి గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జూన్ 14, 1946 న న్యూయార్క్ నగరం లో ట్రంప్ జన్మించారు. 2016 అద్యక్ష ఎన్నికలలో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధి గా పోటీ చేసిన హిల్లరీ క్లింటన్ పై ట్రంప్ గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ట్రంప్ ఓడిపోయారు. తిరిగి ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలలో మరొక మహిళా అభ్యర్ధి కమలా హారిస్ పై ట్రంప్ ఘన విజయం సాధించారు. ట్రంప్ గెలిచిన రెండు సందర్భాలలోనూ ప్రత్యర్డులు మహిళలే. 2024 United States Elections

అటు కమలా హారిస్ అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఫలితాల ప్రకటన అనంతరం సభలో మాట్లాడ వలసి ఉండగా కమలా హారిస్ ఆ సభను క్యాన్సిల్ చేసుకున్నారు. కమలా హారిస్ ఈ ఎన్నికలలో గెలుస్తారని భారతీయులతో సహా అనేకమంది ఇతర దేశాల వారు, ప్రత్యేకం గా వలస దారులు ఆతృత గా ఎదురు చూసారు. ఫలితాలు వ్యతిరేకం గా రావడం తో అనేకమంది కన్నీటి పర్యంతం అయ్యారు.

ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోవడం అలాగే పశ్చిమాసియా లో అశాంతి, ఇజ్రాయెల్, గాజా మధ్య యుద్ధం వంటి  అంతర్జాతీయ అంశాలు  కమలా హారిస్ ఓటమికి ప్రధాన కారణాలు గా విశ్లేషిస్తున్నారు.

 

2024 united states elections,
2024 united states presidential election,
who won us president 2024,
2024 united states elections results,
trump news,
president of usa,
us results,
donald trump age,
presidential elections,
us result,
america president,
democratic party,
us presidential election results,
2024 united states presidential election results,
trump wins,
american president,
donald trump news,