A tribute to Phillip Hughes| Australian Cricketer|ఫిలిప్ హ్యూస్ చనిపోయి నేటికి పదేళ్ళు
ఒకవేళ ఆ మ్యాచ్ లో నలభై ఎనిమిదవ ఓవర్ మూడవ బంతి కి హ్యూస్ గాని అవుట్ అయి ఉంటే.. ప్రస్తుత బ్యాటింగ్ సంచలనం ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ కు వచ్చేవాడు. ఫిల్ హ్యూస్ తో పాటు ట్రావిస్ హెడ్, ఆడం జంపా కూడా అదే మ్యాచ్ లో సౌత్ ఆస్ట్రేలియా కు ఆడుతున్నారు. అదే మ్యాచ్ లో న్యూ సౌత్ వేల్స్ తరపున ఆడుతున్న వారిలో డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్, నాథన్ లయన్, మిచెల్ స్టార్క్ ఉన్నారు.
A tribute to Phillip Hughes| Australian Cricketer|ఫిలిప్ హ్యూస్ చనిపోయి నేటికి పదేళ్ళు
ఫిలిఫ్ జోయెల్ హ్యూస్ ఆస్ట్రేలియా దేశపు క్రికెటర్. ఆస్ట్రేలియా తరపున 29 టెస్టులు ఆడాడు ఫిలిప్ హ్యూస్. సౌత్ ఆస్ట్రేలియా మరియు వూచెస్టర్ షైర్ తరపున దేశవాళీ క్రికెట్ పోటీలలో పాల్గొనే వాడు. దురదృష్టవశాత్తూ 25 ఏళ్ళ వయసులో క్రికెట్ బాల్ మెడకు తగిలి కన్ను మూసాడు.A tribute to Phillip Hughes
అసలు ఆ రోజు ఏం జరిగిందంటే…
అది నవంబర్ 25, 2014 వ సంవత్సరం. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీ లో భాగం గా సౌత్ ఆస్ట్రేలియా మరియు న్యూ సౌత్ వేల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది.సౌత్ ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సౌత్ ఆస్ట్రేలియా తరపున ఆడుతున్న ఫిలిప్ హ్యూస్ మరియు మార్క్ కాస్ గ్రోవ్ ఓపెనర్లు గా వచ్చారు. ఇద్దరూ ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించారు.
23.4 ఓవర్ల వద్ద ఓపెనర్ కాస్ గ్రోవ్ 32 పరుగుల స్కోరు వద్ద నాథన్ లయన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కాలమ్ ఫెర్గూసన్ బ్యాటింగ్ కి వచ్చాడు. మరొక ఎండ్ లో ఫిలిప్ హ్యూస్ చక్కగా ఆడుతున్నాడు. ఫెర్గూసన్ 28 పరుగులు చేసి బొలింగర్ బౌలింగ్ లో అవుట్ అయిన తర్వాత టాం కూపర్ బ్యాటింగ్ కి వచ్చాడు.
అప్పటికి 47 ఓవర్ అంతా టాం కూపర్ బ్యాటింగ్ చేసాడు. 48 వ ఓవర్ లో హ్యూస్ బ్యాటింగ్ కు వచ్చాడు. బౌలింగ్ చేయడానికి సీన్ అబాట్ రెడీ గా ఉన్నాడు. అబాట్ ఓవర్ మొదటి బంతి వేసాడు. పరుగులేమీ లభించలేదు. నలభై ఎనిమిదవ ఓవర్ రెండవ బంతి ని హ్యూస్ ధాటిగా ఆడాడు. రెండు పరుగులు లభించాయి.
నలభై ఎనిమిదవ ఓవర్ మూడవ బంతిని వేసాడు అబ్బాట్. అది ఒక బౌన్సర్. ఊహించని ఈ బౌన్సర్ ను సరిగ్గా ఎదుర్కొనలేక పోయాడు హ్యూస్. రెప్పపాటులో హ్యూస్ మెడ నరానికి గట్టిగా వచ్చి తాకింది బంతి. ఒక్క క్షణం ఏం జరిగిందో అర్ధం కాలేదు హ్యూస్ కి. అలాగే నేలకొరిగి పోయాడు. అది సాధారణమైన గాయమే అనుకున్నారంతా. ఫిజియో వచ్చి పరీక్షించారు. వెంటనే స్ట్రెచర్ తీసుకువచ్చి ఆసుపత్రి కి తరలించారు హ్యూస్ ని.
చిన్న గాయమే అయి వుంటుంది. త్వరగా కోలుకోవాలి అని యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూసింది. కానీ విధి వక్రించింది. నవంబర్ 27, 2014 న ఫిలిప్ హ్యూస్ కన్ను మూసాడు. రెండు రోజులు కోమా లో ఉండి అలాగే ప్రాణాలు కోల్పోయాడు హ్యూస్. నవంబర్ 30 అతని జన్మ దినం. పుట్టిన రోజుకు సరిగ్గా మూడు రోజుల ముందు ప్రాణాలు కోల్పోయాడు ఫిలిప్ హ్యూస్.A tribute to Phillip Hughes
ఫిలిఫ్ హ్యూస్ మరణం తో యావత్ క్రికెట్ ప్రపంచం దిగ్బ్రాంతి కి గురైంది. అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటించింది.
ఫిలిప్ హ్యూస్ అప్పటికే బాగా పేరు సంపాదించు కొంటున్న క్రికెటర్. వన్డే లలోనూ టెస్టులలోనూ ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు సాధించిన ఆసీస్ బ్యాట్స్ మన్ గా చరిత్ర పుటలకు ఎక్కాడు. మొత్తం 26 టెస్టులు ఆడిన హ్యూస్ 1535 పరుగులు చేసాడు. టెస్టులలో అత్యధిక స్కోరు 160. మొత్తం 25 వన్డేలలో 826 పరుగులు చేసాడు. వన్డేలలో అత్యధిక స్కోరు 138. ఆడుతున్న తొలి వన్డేలోనే ఈ సెంచరీ సాధించాడు. ఒక టీ 20 మ్యాచ్ ఆడాడు.
ఒకవేళ ఆ మ్యాచ్ లో నలభై ఎనిమిదవ ఓవర్ మూడవ బంతి కి హ్యూస్ గాని అవుట్ అయి ఉంటే.. ప్రస్తుత బ్యాటింగ్ సంచలనం ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ కు వచ్చేవాడు. ఫిల్ హ్యూస్ తో పాటు ట్రావిస్ హెడ్, ఆడం జంపా కూడా అదే మ్యాచ్ లో సౌత్ ఆస్ట్రేలియా కు ఆడుతున్నారు. అదే మ్యాచ్ లో న్యూ సౌత్ వేల్స్ తరపున ఆడుతున్న వారిలో డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్, నాథన్ లయన్, మిచెల్ స్టార్క్ ఉన్నారు.
ఫిలిఫ్ హ్యూస్ చనిపోయి పదేళ్ళు అయిన సందర్భం గా క్రికెట్ ఆస్ట్రేలియా ఘనం గా నివాళులు అర్పించ బోతోంది.
డిసెంబర్ 6 నుండి 10 వరకూ భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ లో జరిగే రెండవ టెస్టు మ్యాచ్ ప్రారంభం లో హ్యూస్ జ్ఞాపకార్ధం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. అలాగే ఈ టెస్టులో హ్యూస్ పేరును జట్టులో 13 వ సభ్యుడిగా చేర్చ బోతున్నారు. అంతే కాకుండా హ్యూస్ తన చివరి మ్యాచ్ లో చేసిన 63 పరుగులకు గుర్తుగా స్టేడియం లో 63 సెకన్ల పాటు చప్పట్లు కొట్టి నివాళి అర్పిస్తారు. హ్యూస్ చివరిసారిగా ఆడిన దేశవాళీ ట్రోఫీ షెఫీల్డ్ షీల్డ్ లో మూడు మ్యాచ్ ల పాటు ఆటగాళ్ళు అందరూ నల్లని రిబ్బన్ లను ధరించి ఆడతారు. A tribute to Phillip Hughes
ఈ సందర్భం గా భారత ఆటగాడు రామన్ లాంబా ను గుర్తు చేసుకోవాలి. డాకా లో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఫార్వార్డ్ షాట్ లెగ్ లో హెల్మెట్ లేకుండా ఫీల్డింగ్ చేస్తున్నపుడు బంతి బలం గా తాకి ప్రాణాలు కోల్పోయాడు.