January 10, 2025
PSLV-C59 PROBA-3

PSLV-C59 PROBA-3

సూర్యుని గురించి అధ్యయనం చేయడానికి పంపబడ్డ మొట్టమొదటి భారతీయ అంతరిక్ష నౌక ఆదిత్య ఎల్-1 దాదాపు 120 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత లగ్రాంజ్ పాయింట్ ను చేరుకుంది. జనవరి 6, 2024 సాయంత్రం 4 గంటలకు నిర్దేశిత కక్ష్య లోనికి ఇస్రో (ISRO) ప్రవేశపెట్టింది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరం లోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్నహాలో కక్ష్య లోనికి ఆదిత్య ఎల్-1 ను ప్రవేశ పెట్టారు. ఇస్రో కీర్తి కిరీటం లో మరో కలికితురాయి ఆదిత్య ఎల్-1 మిషన్.(Aditya L1 of ISRO First Indian Solar Mission)

credits ISRO
Aditya L1 First Indian Solar Mission Pic credits: ISRO

ఆదిత్య ఎల్-1 ఎప్పుడు ప్రయోగించారంటే….

సూర్యుని గురించి అధ్యయనం చేయడానికి పంపబడ్డ మొట్టమొదటి భారతీయ అంతరిక్ష నౌక ఆదిత్య ఎల్ -1. ఇది ఒక సోలార్ అబ్జర్వేటరీ గా పనిచేస్తుంది. ఆదిత్య ఎల్-1 వ్యోమనౌక ను సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ , శ్రీహరికోట నుండి సెప్టెంబర్ 2 , 2023 న భారత కాలమానం ప్రకారం ఉదయం 11.50 నిమిషాలకు ప్రయోగించారు. ప్రయోగించిన 63 నిమిషాల తర్వాత  భూ దిగువ  కక్ష్య లో ప్రవేశ పెట్టారు.PSLV C57 దీనిని విజయవంతం గా అంతరిక్షం లోనికి తీసుకు వెళ్ళింది.

లగ్రాంజ్ పాయింట్ అంటే ఏమిటి ?

సూర్యుడి యొక్క మరియు భూమి యొక్క గురుత్వాకర్షణ లేని ఒక హాలో ఆర్బిట్  ప్రదేశాన్ని ఎంపిక చేసారు. ఈ ప్రదేశాన్ని లగ్రాంజ్ పాయింట్ (Lagrange Point) పిలుస్తున్నారు. ఈ పాయింట్ వద్ద పరిశోధనలు చేస్తున్న ఉపగ్రహం ఇది ఒక్కటే… ఈ లగ్రాంజ్ పాయింట్ భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరం లో ఉంది అంటే దాదాపు 15 లక్షల కిలో మీటర్ల దూరం లో ఉంది. ఈ Lagrange point వద్ద ఎటువంటి అంతరాయం లేకుండా సూర్యుడిని గమనించే వెసులుబాటు ఉంటుంది. అందుకే ఈ పాయింట్ ని ఎంచు కున్నారు.

ISRO image
Aditya L1 First Indian Solar Mission Pic credits: ISRO

ఈ సోలార్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి?

ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే.. భూమి పైకి వచ్చే సౌర తుఫాన్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటి యొక్క ప్రభావాన్ని అంచనా వెయ్యడం, సౌర అయస్కాంత తుఫానులను అంచనా వేయడం, భూమిపై పర్యావరణం పై వాటి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. క్రోమో స్పియర్, ఫోటో స్పియర్, కరోనా సౌర శక్తి కణాలు, సూర్యుని అయస్కాంత క్షేత్రాన్ని నిరంతరం అధ్యయనం చేస్తూ ఉంటుంది.

దానితో పాటు సౌర భౌతిక శాస్త్రం లో ఎప్పటినుండో పరిష్కారం కాని ప్రధాన సమస్యలలో ఒకటి సూర్యుని వాతావరణం లో ఉష్ణోగ్రత వ్యత్యాసాలు . సూర్యుని ఉపరితలం  ఫోటో స్పియర్  లో 6000 కెల్విన్ లు అంటే 5730 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, సూర్యుని పై భాగం (కరోనా) లో 10,000,000 కెల్విన్ లు అనగా 10,000,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ వ్యత్యాసాలను అధ్యయనం చేయడం ప్రధాన ఉద్దేశ్యాలలో ఒకటి.(Aditya L1 of ISRO First Indian Solar Mission)

ISRO Aditya L1 pic credits ISRO
Aditya L1 First Indian Solar Mission Pic credits: ISRO

ఈ మిషన్ యొక్క జీవిత కాలం ఎంత?

5.2 సంవత్సరాల పాటు ఇది సూర్యుని యొక్క సమగ్ర సమాచారాన్ని భూమి పైకి పంపగలదు. సూర్యుని నుండి 93 మిలియన్ మైళ్ళ దూరం లో ఇది పరిభ్రమిస్తూ ఉంటుంది.

ఈ సోలార్ మిషన్ ఆలోచన కు ఎప్పుడు పునాదులు పడ్డాయి అంటే..

ఆదిత్య ఎల్-1 మిషన్ వెనుక 15 సంవత్సరాల శాస్త్రవేత్తల కృషి ఉంది. జనవరి 2008 లో 400 కిలోల చిన్న ఉపగ్రహాన్ని తక్కువ భూ కక్ష్య లోనికి ప్రవేశ పెట్టాలని అనుకున్నారు. Advisory Committee for Space Sciences (ADCOS) ఈ ప్రతిపాదన చేసింది.దీనికి మొదట ఆదిత్య -1 అనే పేరును నిర్ణయించారు. ఆదిత్య-1 ను తక్కువ స్థాయి భూ కక్ష్య లో 800 కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే ప్రవేశ పెట్టాలని అనుకున్నారు. సూర్యుని యొక్క కరోనా (ప్రకాశం) ను మాత్రమే అధ్యయనం చెయ్యాలని అనుకున్నారు.ఆ తర్వాత ప్రణాళిక మార్చి హాలో ఆర్బిట్ లోని లగ్రాంజ్ పాయింట్ లో ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు దీని పేరును ఆదిత్య ఎల్-1 గా మార్చారు. 15 సంవత్సరాల పరిశోధనల అనంతరం  “ఆదిత్య ఎల్-1 ” రూపొందింది.  ఆదిత్య అనే పేరు ను కూడా సంస్కృతం నుండి తీసుకున్నారు. ISRO ప్రయోగాలలో ఒక గొప్ప ప్రయోగం గా దీనిని చెప్పవచ్చు.

ఈ అంతరిక్ష నౌక ప్రత్యేకతలు ఏమిటి అంటే…

ఆదిత్య ఎల్-1 ప్రయాణం లో దీనికి గల రెండు రెక్కలు విచ్చుకుంటాయి. ఇవి వ్యోమనౌక యొక్క లిథియం బ్యాటరీ కి సహాయపడుతూ వ్శక్తి ని అందిస్తాయి. దీనికి గల జిపిఎస్ ద్వారా నౌక వేగాన్ని, స్థానాన్ని, సమయాన్ని కచ్చితంగా తెలియజేస్తుంది. ఈ అంతరిక్ష పరిశీలనా కేంద్రం 7 శాస్త్రీయ పే లోడ్ లను తీసుకు వెళ్ళింది. వీటితో అక్కడ పరిశోధనలు చేస్తుంది. ఏడింటిలో 5 పే లోడ్ లను ఇస్రో అభివృద్ధి చేసింది. వ్యోమ నౌక యొక్క పైభాగం లో అమర్చబడిన ఈ పే లోడ్ ల యొక్క బరువు 244 కిలోలు. ఈ వ్యోమ నౌక బరువు 1475 కిలోగ్రాములు. ఇది క్యూబ్ (ఘనం)ఆకారం లో ఉంటుంది. Honeycomb sandwich నిర్మాణం లో ఉంటుంది. VELC pay load ప్రతి  రోజు దాదాపు 1440 ఫోటోలను పంపుతుంది. ఇది ఒక కీలకమైన పరికరం అని చెప్పవచ్చు

దీనిలో మొత్తం 7  payload పరికరాలు ఉంటాయి..

Magnetometer (MAG)

Visible Emission Line Coronagraph (VELC)

High Energy L1 Orbiting X-ray Spectrometer (HEL1OS)

Solar Ultraviolet Imaging Telescope (SUIT)

Solar Low Energy X-ray Spectrometer (SoLEXS)

Aditya Solar wind Particle Experiment (ASPEX)

Plasma Analyser Package for Aditya (PAPA)

అమెరికా సూర్యుని దగ్గరకి ఏమైనా ఉపగ్రహాలు పంపిందా..?

సూర్యుని అధ్యయనం చేయడానికి నాసా (NASA – National Aeronautics and Space Administration) కూడా కొన్ని ఉపగ్రహాలు తయారు చేసింది.అవి NASA’s Parker Solar Probe ను ఫ్లోరిడా లోని కేప్ కేనవరాల్ నుండి ప్రయోగించింది. ఇది మనిషి చేత తయారు చేయబడ్డ అత్యంత వేగం గా నడపబడే ప్రోబ్ ఇది. సూర్యుని యొక్క రహస్యాలను చేదించడానికి దీనిని రూపొందించారు . సౌర గాలులు గురించి పరిశోధనలు చేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త యూజీన్ పార్కర్ (Eugene Parker) పేరు మీదుగా ఈ ఉపగ్రహానికి Parker Solar Probe అని పేరు పెట్టారు. సూర్యుడిని చేరుకున్న మొట్టమొదటి వ్యోమనౌక గా ఇది ప్రసిద్ది గాంచింది. దీని తో పాటు NASA’s Living With a Star, NASA’s Helios 2 అనే ప్రయోగాలు ప్రస్తుతం జరుగుతున్నాయి.

ఈ ప్రయోగం విజయవంతం కావడం తో ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భం గా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.

Vijay Kumar Bomidi, Editor, Vijay News Telugu