April 18, 2025

Agri Jobs in Govt Sector| వ్యవసాయ డిగ్రీ, డిప్లొమా వారికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు

ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అనే లక్ష్యం గాని నిర్దేశించు కొంటే ప్రస్తుత పరిస్థితిని బట్టి రెండు మూడేళ్ళ లో తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించే పరిస్థితులు  ఉన్నాయి. అధికారులను, ప్రభుత్వాలను నిరంతరం నిందిస్తూ , తాము చెయ్యవలసిన పని మర్చిపోయి, సబ్జెక్టు అయితే పూర్తిగా మర్చిపోయి, ఉద్యోగాలు లేవు అని గొడవ పడే వారే ఎక్కువ ఉన్నారు

Agri Jobs in Govt Sector - govt jobs for agri diploma holders

Govt jobs for Agri diploma holders pic credit: VK Agri Academy Salur

బిఎస్సీ ఏజీ, అగ్రికల్చర్ డిప్లొమా వారికి గల ప్రభుత్వ ఉద్యోగావకాశాలు Agri Jobs in Govt Sector  

బిఎస్సీ ఏజీ, వ్యవసాయ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్దులకు ప్రభుత్వ రంగం లో గల ఉద్యోగావకాశాలు గురించి ఈ వ్యాసం లో తెలుసుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వ్యవసాయ విశ్వ విద్యాలయాలు వ్యవసాయ డిప్లొమా కోర్సులను, వ్యవసాయ డిగ్రీ కోర్సులను  ఆఫర్ చేస్తున్నాయి. గతం లో ఈ పాలిటెక్నిక్ కోర్సులకు చాలా డిమాండ్ ఉండేది. ప్రస్తుతం ఈ కోర్సులలో చేరే వారి సంఖ్య కొంచం తగ్గింది. దీనికి ప్రధాన కారణం విద్యార్దులకు, వారి తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకపోవడం. ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులు చదివిన వారికి సరిగ్గా ఉద్యోగ అవకాశాలు లేవనేది వారి వాదన. Agri Jobs in Govt Sector – for Agri Diploma Holders

Agri Diploma students-1
Agri Diploma Students in field works pic credits: VK Agri Academy

ఈ వ్యాసం లో వ్యవసాయ పాలిటెక్నిక్ చదివిన విద్యార్దులకు ఉన్న ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు గురించి, వారు ఎవరిని సంప్రదించాలి అనే విషయాలు చర్చిద్దాం.

వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సు వ్యవసాయ విభాగం వారికి రెండు సంవత్సరాలు, వ్యవసాయ ఇంజనీరింగ్ చదివిన వారికి మూడు సంవత్సరాల వ్యవధి కలిగి ఉంటాయి. డిప్లొమా కోర్సు పూర్తి చేసేసరికి విద్యార్దుల వయస్సు 18 – 19 సంవత్సరాలు ఉంటుంది. ఇంత చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగం పొందగలిగే గొప్ప అవకాశం ఉన్న కోర్సులు ఇవే. 

ప్రభుత్వ రంగం లో ఎటువంటి అవకాశాలు ఉంటాయి అంటే…

వ్యవసాయ డిప్లొమా చదివిన వారికి ప్రభుత్వ రంగం లో ఉన్న ఉద్యోగావకాశాలు ఇవి.

  1. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (VAA)
  2. అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (AEO)
  3. ఇతర ప్రభుత్వ సంస్థలలో సహాయకులు (Agri Assistants) 

విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (VAA) Village Agriculture Assistant

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారం లోనికి వచ్చిన వెంటనే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసారు.  ఈ సచివాలయాల్లో మిగిలిన సహాయకులతో పాటు వ్యవసాయ సహాయకుల పోస్టులను కూడా ప్రకటించారు. దీనికి ప్రధాన అర్హత వ్యవసాయ డిప్లొమా గా ప్రకటించారు. దాదాపు ఆరువేలకు పైగా VAA పోస్టులను రెండు విడతలు గా భర్తీ చేసారు. ఇవి ప్రభుత్వ ఉద్యోగాలే ప్రభుత్వం ప్రకటించినప్పటికీ చాలా మంది నమ్మలేదు. రెండేళ్ళ ప్రొబేషన్ పూర్తి అయిన తర్వాత వారిని అందరినీ పర్మినెంట్ చేసారు. ఈ విధం గా అనేక మంది వ్యవసాయ డిప్లొమా కోర్సులు చదివిన వారు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు గా ప్రస్తుతం సచివాలయాలలో పనిచేస్తున్నారు. 

agri diploma students
Agri diploma students in Entomology practicals pic credits: VK Agri Academy

అన్ని పోస్టులు నింపేశారు .. ఇంకా ఖాళీలు ఉన్నాయా….(Agri Jobs in Govt Sector)

అన్ని పోస్టులు భర్తీ చేసారు.. కానీ ఖాళీలు ఉంటాయి.. అర్హతలు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలు సంపాదించారు. PhD, MSc, BSc చదివిన వారు వారి అర్హత కి సరిపడా ఉద్యోగాలు దొరికినప్పుడు VAAపోస్టులకు రాజీనామా చేసి వెళ్ళిపోయారు.. కొంతమంది దురదృష్టవశాత్తూ చనిపోయిన వారు ఉన్నారు.. ఇలా ఈ ఉద్యోగాలలో ఖాళీలు ఏర్పడుతూనే ఉన్నాయి. అలాగే వీరికి ప్రమోషన్లు కూడా ఇస్తున్నారు. ఆ విధం గా కూడా ఖాళీలు ఏర్పడవచ్చు.. కాబట్టి అగ్రి పాలిటెక్నిక్ చదివిన వారి కోసమే ఈ ఉద్యోగాలు ఉన్నాయి. 20ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగం పొందారు అనేక మంది వ్యవసాయ  పాలిటెక్నిక్ చదివిన వారు. ఇలా ఏ రంగం లోనూ జరగలేదు. 

అంతే కాకుండా భవిష్యత్తు లో కూడా ఈ రైతు భరోసా కేంద్రాల్లో మరొక సహాయకుడి పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశాలు లేకపోలేదు.

ఈ ఉద్యోగాలను ఎపిపిఎస్సి తరహా విధానం లో పరీక్ష నిర్వహించి భర్తీ చేస్తారు . కాబట్టి ఈ పరీక్షల కోసం తగినంత ప్రిపరేషన్ చేసుకొని పరీక్ష కోసం ఎదురు చూడటం మంచిది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెయ్యడానికి ఏమీ ఉండదు. అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ , ఇండియన్ పాలిటీ, హిస్టరీ, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టులపై అవగాహన పెంచుకోవడానికి ఎంతైనా అవసరం. 

agri diploma students
Agri Diploma students practical work in Rice Fields pic credits: VK Agri Academy Salur

అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (AEO) Agriculture Extension Officer

ప్రభుత్వం లో చాలా కాలం నుండి భర్తీ చెయ్యని పోస్టులు ఇవి. కేవలం బ్యాక్ లాగ్ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు.  VAA ఉద్యోగాలు వచ్చిన తర్వాత AEO పోస్టుల భర్తీ పై అంతగా దృష్టి పెట్టలేదు ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం. తెలంగాణా లో మాత్రం ఈ పోస్టులు చాలా వరకూ భర్తీ చేసారు. ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా త్వరలో భర్తీ చేయవచ్చు. 

ఈ పోస్టులు కూడా పరీక్ష నిర్వహించడం ద్వారా భర్తీ చేస్తారు కాబట్టి వెంటనే పరీక్షల కోసం ప్రిపరేషన్ ప్రారంభించాలి. రెండు రాష్ట్రాలలోనూ ఈ ఉద్యోగాలు ఉన్నాయి. వీలును బట్టి ప్రభుత్వాలు వీటిని భర్తీ చేస్తాయి. పరీక్షల కోసం బాగా ప్రిపేర్ అవ్వాలి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా రాయడానికి సిద్ధం గా ఉండాలి. తమ ప్రిపరేషన్ కొనసాగించక చాలా మంది తాము చదివిన సబ్జెక్టు పూర్తిగా మర్చి పోతారు. ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే మాత్రం ఎప్పుడూ అన్ని విధాలా సిద్ధం గా ఉండాలి.

ఇతర ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు….

అనేక ప్రభుత్వ సంస్థలలో కాంట్రాక్ట్ పద్దతిలో వ్యవసాయ డిప్లొమా వారికి ఉద్యోగాలు ప్రకటిస్తున్నారు. ఎపి సీడ్స్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రతి సంవత్సరం కొన్ని నెలల పాటు డిప్లొమా వారిని ఉద్యోగాల లోనికి తీసుకొంటున్నాయి. అలాగే వ్యవసాయ పరిశోధనా స్థానాలలో కూడా డిప్లొమా వారికి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ వర్సిటీ లలో కూడా డిప్లొమా విద్యార్ధుల కోసం ఉద్యోగావకాశాలు ఉంటాయి. 

competitive session
Competitive session for Agri Diploma Students pic credit: VK Agri Academy Salur

మనసు ఉండాలే కాని మార్గం ఉంటుంది.. (Agri Jobs in Govt Sector)

ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అనే లక్ష్యం గాని నిర్దేశించు కొంటే ప్రస్తుత పరిస్థితిని బట్టి రెండు మూడేళ్ళ లో తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించే పరిస్థితులు  ఉన్నాయి. అధికారులను, ప్రభుత్వాలను నిరంతరం నిందిస్తూ , తాము చెయ్యవలసిన పని మర్చిపోయి, సబ్జెక్టు అయితే పూర్తిగా మర్చిపోయి, ఉద్యోగాలు లేవు అని గొడవ పడే వారే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు… రెండేళ్ళ డిప్లొమా అయిపోగానే డిగ్రీ లో జాయిన్ అయినప్పటికీ డిప్లొమా కోర్సులలో చదివిన సబ్జెక్టు కూడా ఎప్పటికప్పుడు చదువుతూ ఉండటం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకొనే అవకాశాలు బాగా మెరుగుపడతాయి. Agri Jobs in Govt Sector for Agri Diploma Holders

ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు ఇవే…

  • అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ , జనరల్ నాలెడ్జ్ వంటి అంశాలపై మంచి పట్టు సంపాదించాలి.
  • వ్యవసాయ డిప్లొమా లో చదువుకున్న అన్ని సబ్జెక్టులు తరచూ చదువుతూ ఉండాలి.
  • పత్రికలు రోజూ చదువుతూ ఉండాలి.
  • ఏ ప్రభుత్వ రంగ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసినా అప్లయి చెయ్యాలి.
  • ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చెప్పలేం కాబట్టి .. అర్హత పరీక్ష కు సంబంధించి మొత్తం సిలబస్ మీద పూర్తి పట్టు సాధించాలి.
  • నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఉండదు కాబట్టి సిలబస్ ముందుగానే పూర్తి చేసుకొని సిద్ధం గా ఉండాలి.
  • టీచర్లు, కానిస్టేబుల్ వంటి ఇతర పోస్టుల కోసం నోటిఫికేషన్ రాకపోయినా సంవత్సరాలు గా చదువుతూనే ఉంటారు. వారికి ఉన్న నిబద్ధత , పట్టుదల వ్యవసాయ డిప్లొమా వారికి ఉండాలి. 
  • పట్టుదల ఉంటేఏదైనా ఒక  ప్రభుత్వోద్యోగం సాధించడం అంత కష్టమైన పని ఏమీ కాదు.
  • ప్రయత్నించండి…అనుకొంటే  సాధించలేనిది ఏదీ లేదు…. Wishing You All The Best

Vijay Kumar Bomidi, Director, VK Agri Academy SALUR 8125443163 

 

ఇది కూడా చదవండి : అగ్రికల్చర్ వారికి ప్రైవేటు రంగం లో ఉద్యోగావకాశాలు 

4 thoughts on “Agri Jobs in Govt Sector| వ్యవసాయ డిగ్రీ, డిప్లొమా వారికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు

Comments are closed.