AGRICET 2024 Final Counseling|జనవరి 7, 2025 న ఫైనల్ మాప్ అప్ కౌన్సిలింగ్
AGRICET 2024 Final Counseling|జనవరి 7, 2025 న ఫైనల్ మాప్ అప్ కౌన్సిలింగ్
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధి లో అగ్రిసెట్ 2024 పరీక్ష రాసిన వారికి ఫైనల్ కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించారు. ఈ కౌన్సిలింగ్ లో స్పోర్ట్స్ కోటా తో పాటు, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ వారికి కూడా సీట్ల కేటాయింపు చేస్తారు. గత కౌన్సిలింగ్ నవంబర్ నెలలో జరగగా ప్రస్తుతం రెండు నెలల తర్వాత మిగిలిన సీట్ల కు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.
కౌన్సిలింగ్ ఎప్పుడు ?AGRICET 2024 Final Counseling
జనవరి 7, 2025 మంగళ వారం ఉదయం 11 గంటల నుండి లాం ఫారం లోని కృష్ణా ఆడిటోరియం లో ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.
ఈ కౌన్సిలింగ్ లో స్పోర్ట్స్ కోటా లో రెండు సీట్లను భర్తీ చేస్తారు. అలాగే సీడ్ టెక్నాలజీ లో మిగిలిపోయిన 5 సీట్లను భర్తీ చేస్తారు. అగ్రికల్చర్ విభాగం లో మిగిలిపోయిన 3 సీట్లను భర్తీ చేస్తారు.
ఎవరెవరు కౌన్సిలింగ్ కి వెళ్ళాలి ?
- స్పోర్ట్స్ కోటా కు సంబంధించి కౌన్సిలింగ్ కి రావలసిన వారి లిస్టు వెబ్ సైట్ లో పెట్టారు కాబట్టి ఆ లిస్టు ప్రకారం వారు హాజరు కావాలి
- సీడ్ టెక్నాలజీ విద్యార్దులకు 05 సీట్లు ఖాళీ ఉన్నాయి కాబట్టి ఆయా రిజర్వేషన్ ల బట్టి వారు హాజరు కావాలి.
- అగ్రికల్చర్ విద్యార్దులకు 03 సీట్లు ఖాళీ గా ఉన్నాయి కాబట్టి ఆయా రిజర్వేషన్ లను బట్టి వారు హాజరు కావాలి.
- ఆర్గానిక్ ఫార్మింగ్ వారు కూడా 01 సీటు కోసం హాజరు కావచ్చు. ఒకవేళ సీడ్ టెక్నాలజీ లో ఎవరూ జాయిన్ కాకపోతే ఆ సీట్లను అగ్రికల్చర్, మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ వారికి కేటాయిస్తారు కాబట్టి DOF వారు కూడా హాజరు కావచ్చు.
ఏ విభాగం లో ఏ కేటగిరీ కి ఎన్ని సీట్లు ఉన్నాయో చూద్దాం
- స్పోర్ట్స్ కోటా లో Unreserved OC మరియు Andhra University OC విద్యార్దులకు సీట్లు ఉన్నాయి.
- సీడ్ టెక్నాలజీ విభాగం లో మొత్తం 05 సీట్లు ఉన్నాయి.
అగ్రికల్చర్ విభాగం లో ఖాళీలు
ఇది కూడా చదవండి : ICAR గుర్తింపు కలిగిన ప్రైవేటు యూనివర్సిటీల లిస్టు