Agricet 2024 Registration Notification| అగ్రిసెట్ వారికి భారీగా పెరిగిన సీట్లు
అగ్రిసెట్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసేనాటికి ఉన్న సీట్ల సంఖ్య 268 కాగా ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ లో మొత్తం సీట్ల సంఖ్య 298 గా ఉంది. అంటే మొత్తం 30 సీట్లు పెరిగాయి.
Agricet 2024 Registration Notification| అగ్రిసెట్ వారికి భారీగా పెరిగిన సీట్లు
అగ్రిసెట్ 2024 పరీక్ష రాసిన వారికి రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అగ్రి డిప్లొమా కోర్సులు చదివిన వారికి అగ్రి బిఎస్సీ లో ప్రవేశానికి గాను ఈ పరీక్షను నిర్వహించారు.
ఇంతకు ముందు కేవలం ర్యాంకు కార్డులు మాత్రమే విడుదల చేసారు. ఇతర వివరాలు అనగా మార్కులు, కేటగిరీ వంటి వివరాలు విడుదల చేయలేదు. కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవలసింది గా యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీ వెబ్ సైట్ నుండి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో ఇచ్చిన ఇతర వివరాల గురించి చూద్దాం.(Agricet 2024 Registration Notification)
భారీగా పెరిగిన సీట్లు
అగ్రిసెట్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసేనాటికి ఉన్న సీట్ల సంఖ్య 268 కాగా ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ లో మొత్తం సీట్ల సంఖ్య 298 గా ఉంది. అంటే మొత్తం 30 సీట్లు పెరిగాయి. ప్రైవేటు అఫిలియేటెడ్ కాలేజీలలో సీట్ల సంఖ్య పెరగడం తో అగ్రిసెట్ విద్యార్దులకు కూడా 30 సీట్లు పెరిగాయి. ఈ విధం గా Agricet లో ర్యాంకు లో పొందిన వారికి ప్రైవేటు అఫిలియేటెడ్ కాలేజీలలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 102.
ప్రభుత్వ కళాశాలలలో అగ్రి డిప్లొమా వారికి 161, సీడ్ టెక్నాలజీ వారికి 27, ఆర్గానిక్ ఫార్మింగ్ వారికి 08 సీట్లు అందుబాటు లో ఉన్నాయి. ప్రైవేటు అఫిలియేటెడ్ కళాశాలలలో అగ్రి డిప్లొమా వారికి 84, సీడ్ టెక్నాలజీ వారికి 14, ఆర్గానిక్ ఫార్మింగ్ వారికి 04 సీట్లు అందుబాటు లో ఉన్నాయి. ఒకవైపు వ్యవసాయ డిప్లొమా కోర్సులలో ప్రతి సంవత్సరం అడ్మిషన్లు అనుకున్నంత గా జరగడం లేదు గాని అగ్రి బిఎస్సీ లో సీట్ల సంఖ్య మాత్రం గణనీయం గా పెరుగుతోంది.(Agricet 2024 Registration Notification)
ఏడు ప్రభుత్వ కాలేజీలలో, ఆరు ప్రైవేటు కాలేజీలలో అగ్రిసెట్ ర్యాంక్ ఆధారం గా అడ్మిషన్లు జరుగుతాయి. బాపట్ల, నైరా (శ్రీకాకుళం), రాజమహేంద్ర వరం, తిరుపతి, మహానంది, ఉదయగిరి (SPSR నెల్లూరు జిల్లా), పులివెందుల (YSR జిల్లా) లో ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా), CSపురం (ప్రకాశం జిల్లా), మార్కాపురం (ప్రకాశం జిల్లా), బద్వేల్ (YSR జిల్లా), అనంతపురము, తాడిపత్రి లో ప్రైవేటు అఫిలియేటెడ్ కాలేజీలు ఉన్నాయి.
వయో పరిమితి ఎంత ఉండాలి అంటే
జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 31డిసెంబర్ 2024 నాటికి కనిష్ట వయో పరిమితి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 22 సంవత్సరాలు నిండి ఉండకూడదు.
SC, ST, అభ్యర్ధులకు 31 డిసెంబర్ 2024 నాటికి కనిష్ట వయో పరిమితి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయో పరిమితి 25 సంవత్సరాలు ఉండాలి.
Physically Challenged అభ్యర్ధులకు కనిష్ట వయో పరిమితి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయో పరిమితి 27 సంవత్సరాలు నిండరాదు
రిజర్వేషన్ల వారీగా సీట్ల ఎంపిక
మొత్తం సీట్ల లో 15 % సీట్లు అన్ రిజర్వుడు గా ఉంటాయి. దీనినే ఓపెన్ కేటగిరీ అంటారు. దీనికి అన్ని యూనివర్సిటీల వారు (AU, SVU, OU), మరియు AP, TS విద్యార్దులు అర్హులు. టాప్ రాంకులు వచ్చిన వారు ఈ సీట్ల కోసం పోటీ పడతారు. మిగిలిన 85% సీట్లు రిజర్వేషన వారీగా భర్తీ చేస్తారు. BC వారికి 29%, SC వారికి 15%, ST వారికి 6%, CAP వారికి 2%, NCC వారికి 1%, PH వారికి 5% , games & sports వారికి 0.5%, స్కౌట్స్ & గైడ్స్ వారికి 0.5% చొప్పున సీట్లు కేటాయిస్తారు. ప్రతి కేటగిరీ లోనూ 33 1/2 శాతం స్త్రీలకు కేటాయిస్తారు.(Agricet 2024 Registration Notification)
EWS కోటా ఇవ్వలేదు ఎందుకని…?
ప్రస్తుతం అన్ని కళాశాలలలో సీట్ల కేటాయింపులు చేసేటప్పుడు తప్పనిసరిగా EWS కోటా క్రింద సీట్లు భర్తీ చేస్తున్నారు. అయితే అగ్రిసెట్ విద్యార్దులకు మాత్రం EWS కోటా వర్తించదని యూనివర్సిటీ వారు చెప్తున్నారు. సూపర్ న్యూమరరీ కోటా క్రింద రాష్ట్రం లోని అగ్రి బిఎస్సీ సీట్లలో 20 శాతం సీట్లు డిప్లొమా చదివిన వారికి కేటాయిస్తున్నారు. ఈ సీట్లకు EWS కోటా వర్తించదని యూనివర్సిటీ వారు చెప్పడం సమంజసం గా లేదు. తెలంగాణా రాష్ట్రం లోని కాలేజీలకు కౌన్సిలింగ్ జరిపేటప్పుడు EWS కోటా ప్రకారం సీట్లు కేటాయించడం గమనించాలిసిన విషయం. ఈ విషయం పై యూనివర్సిటీ అధికారులు తక్షణమే స్పందించవలసిన అవసరం ఉంది.
కట్టవలసిన ఫీజుల వివరాలు :
ప్రభుత్వ కళాశాలలలో సీట్లు పొందినవారు జాయిన్ అయ్యేటప్పుడు మొదటి సెమిస్టర్ కు 46,429/- రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. నాలుగేళ్ల కోర్సు పూర్తి అయిన తర్వాత విద్యార్ధి కి తిరిగి ఇచ్చే ఫీజులు (refundable) మొదట కట్టాలి కాబట్టి ఈ మొత్తాన్ని కట్టవలసి ఉంటుంది. ఈ ఫీజులో దాదాపు 20 వేల రూపాయలు కోర్సు పూర్తి అయిన తర్వాత విద్యార్ధికి తిరిగి చెల్లిస్తారు. రెండవ సెమిస్టర్ లో ఫీజు తగ్గుతుంది.
ప్రైవేటు అఫిలియేటెడ్ కాలేజీ లలో ఒక్కొక్క కాలేజీ కి ఒక్కొక్క రకం గా ఫీజు స్ట్రక్చర్ ఉంది. అన్ని కాలేజీల కంటే ఎక్కువగా ఎచ్చెర్ల లో (కింజరాపు ఎర్రన్నాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ) లో సంవత్సరానికి 1,28,700/- రూపాయలు కట్టాలి. NS అగ్రికల్చరల్ కాలేజీ, మార్కాపురం లో సంవత్సరానికి 1,26,000 రూపాయలు, శ్రీ కృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, అనంత పురం లో సంవత్సరానికి 1,00,600/- చొప్పున కట్టాలి.
KBR కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, CS పురం లో సంవత్సరానికి 88,600/- రూపాయలు, జేసీ దివాకర్ రెడ్డి అగ్రికల్చరల్ కాలేజీ లో సంవత్సరానికి 87,300/- రూపాయలు, SBVR అగ్రికల్చరల్ కాలేజ్, బద్వేలు లో సంవత్సరానికి 85,000/- రూపాయల చొప్పున ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఇది కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే. హాస్టల్, మెస్ చార్జీలు, ట్రాన్స్ పోర్టు ఫీజులు దీనికి అదనం గా చెల్లించాలి.(Agricet 2024 Registration Notification)
సీటు వచ్చి జాయిన్ అయ్యేటప్పుడు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికేట్ లు ఇవే..
- పాస్ సర్టిఫికేట్ / మార్క్స్ మెమో (డిప్లొమా)
- హాల్ టికెట్ మరియు రాంక్ కార్డ్ (అగ్రిసెట్ 2024)
- SSC సర్టిఫికేట్
- కమ్యూనిటీ సర్టిఫికేట్ (caste certificate)
- Study certificates (6th to Diploma)
- రెసిడెన్స్ సర్టిఫికేట్ (అవసరమైన వారికి మాత్రమే)
- TC (ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్) చివర ఎక్కడ చదివారో అక్కడ నుండి
- స్పెషల్ కేటగిరీ అయితే ఆ సర్టిఫికేట్
ఇతర వివరాల కోసం యూనివర్సిటీ వారిని సంప్రదించడానికి నోటిఫికేషన్ లో ఫోన్ నంబర్లు ఇచ్చారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5.30 లోపు వారిని సంప్రదించాలి.
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఫోన్ నంబర్లు : 0863-23470005, 7331148417, 8008987458, 7893520988
– Vijay Kumar Bomidi, Director, VK Agri Academy Salur 81254 43163