AGRICET- అగ్రిసెట్ ప్రవేశ పరీక్ష యొక్క పూర్తి వివరాలు
AGRICET- అగ్రి డిప్లొమా వారు BSc Ag లో చేరడానికి రాసే ప్రవేశ పరీక్ష:
మెడిసిన్ లాంటి కోర్సుల తర్వాత మన దేశం లో ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న కోర్సు బిఎస్సీ అగ్రికల్చర్ (BSc Agriculture). ఇంటర్ చదివిన వారు ఎంసెట్, ICAR-CUET లాంటి పరీక్షలు రాసి BSc Ag లో సీట్లు పొందుతారు. వ్యవసాయ డిప్లొమా చదివిన వారు అగ్రికల్చర్ బిఎస్సీ చదవాలంటే మాత్రం అగ్రిసెట్ (AGRICET) ప్రవేశ పరీక్ష రాయడం తప్పనిసరి.(AGRICET for BSc Agriculture)
మన తెలుగు రాష్ట్రాలలోని వ్యవసాయ విశ్వ విద్యాలయాలు పదవ తరగతి చదివిన వారికి వ్యవసాయ డిప్లొమా కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. రెండేళ్ళ డిప్లొమా పూర్తి చేసిన వారు అగ్రికల్చర్ బిఎస్సీ కోర్సు చేయడానికి రాయవలసిన ప్రవేశ పరీక్ష ‘అగ్రిసెట్”.
అగ్రిసెట్ పరీక్షను తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వేర్వేరు గా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం (ANGRAU) వారు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణా లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం (PJTSAU) వారు ఈ పరీక్ష ను నిర్వహిస్తున్నారు.
అగ్రిసెట్ పరీక్షలో ఉత్తీర్ణులై మంచి రాంక్ సాధించిన వారికి అగ్రికల్చర్ బిఎస్సీ లో సీటు లభిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ పరీక్ష ను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో వ్యవసాయ డిప్లొమా పూర్తి చేసిన వారు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. అగ్రిసెట్ పరీక్ష కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వ్యాసం లో తెలుసుకుందాం. (AGRICET for BSc Agriculture)
ఏ డిప్లొమా కోర్సులు చేసిన వారు అర్హులు అంటే…
- డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ DA (వ్యవసాయ డిప్లొమా)
- డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ DST (విత్తన సాంకేతిక పరిజ్ఞాన డిప్లొమా)
- డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ -DOF (సేంద్రియ వ్యవసాయ డిప్లొమా )
పై డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారికి ఈ ప్రవేశ పరీక్ష ను నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రం ఏ డిప్లొమా కి సంబంధించి ఆ డిప్లొమా కోర్సు కు వేర్వేరు గా ఉంటుంది. ఈ పరీక్ష కు సంబంధించి కొన్ని వివరాలు …
- ఇది ఒక ఆన్ లైన్ పరీక్ష… కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- ప్రశ్నాపత్రం లో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి.
- ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహా లోనే (మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు) ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు (గంటన్నర)
- ప్రతి ప్రశ్న కు ఒక మార్కు చొప్పున ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉండవు.
- ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు వివిధ పాలిటెక్నిక్ కోర్సులకు నిర్దేశించిన సిలబస్ ఆధారం గా ప్రశ్నాపత్రం ఉంటుంది.
- ప్రశ్నాపత్రం లో ప్రశ్నలు తెలుగు లోనూ, ఇంగ్లీష్ లోనూ ఉంటాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వారు రాయడానికి అనువు గా రెండు భాషలలోనూ ప్రశ్నలు ఇస్తారు. ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం లో బోధన జరుగుతోంది కాబట్టి ఏదైనా ప్రశ్నల విషయం లో వివాదం వచ్చినప్పుడు ఇంగ్లీష్ సిలబస్ ను బట్టి నిర్ణయం తీసుకుంటారు.
పరీక్ష రాయడానికి అర్హతలు ఏంటంటే…(AGRICET for BSc Agriculture)
- ANGRAU / PJTSAU యూనివర్సిటీ లలో DA, DST, DOF డిప్లొమా కోర్సులు చదివి ఉత్తీర్ణులై ఉండాలి. ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. ఇతర ఏ యూనివర్సిటీలలో , ప్రైవేటు గా చదివిన వారు అర్హులు కారు.
- 17 సంవత్సరాల వయసు పూర్తి అయి ఉండాలి. గరిష్ట వయో పరిమితి 22 సంవత్సరాలు. SC, ST, అభ్యర్దులకు 25 సంవత్సరాలు, PH అభ్యర్ధులకు 27 సంవత్సరాలు గా ఉంటుంది.
ఈ పరీక్ష ఏ నెలలో నిర్వహిస్తారు..?
- ఈ పరీక్ష ను కరోనా కు ముందు కాలం లో జూన్ లేదా జూలై మాసాల్లో నిర్వహించేవారు. కరోనా వచ్చిన తర్వాత ఈ పరీక్ష ను అక్టోబర్, నవంబర్ లో నిర్వహిస్తున్నారు. నిజానికి ఈ పరీక్ష జూలై లేదా ఆగస్టు లో నిర్వహిస్తే సరిపోతుంది. నాల్గవ సెమిస్టర్ may నెలలో పూర్తి అయిపోయినట్లయితే జూన్ చివరి వారం లో గాని జూలై నెల లో గాని నిర్వహిస్తారు. (ఎంసెట్ పరీక్షలు వాటి కౌన్సిలింగ్, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, నీట్ పరీక్షలు కౌన్సిలింగ్ వంటి అంశాలు కూడా దీనిని ప్రభావితం చేస్తాయి.)
పరీక్ష సెంటర్లు ఎక్కడ ఉంటాయి..?
- ప్రస్తుతం పాత జిల్లా కేంద్రాలలో ఆన్ లైన్ విధానం లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
సీట్లు ఏ కాలేజీలలో కేటాయిస్తారు అంటే…(AGRICET for BSc Agriculture)
- సరైన రాంక్ పొందిన వారికి ముందుగా ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలలో సీట్లు కేటాయిస్తారు. ఆ సీట్లు నిండి పోయిన తర్వాత ప్రైవేటు లేదా అఫిలియేటెడ్ వ్యవసాయ కళాశాలలలో సీట్లు కేటాయిస్తారు. ప్రభుత్వ కాలేజీ లకు ఐకార్ (ICAR) గుర్తింపు ఉంటుంది. ప్రస్తుతం ప్రైవేట్ కాలేజీలు వారు కూడా ఐకార్ గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం కి అనుబంధం గా ఉన్న కాలేజీలలో సంకోచం లేకుండా జాయిన్ కావచ్చు.
పరీక్ష ఫీజు ఎంత ఉంటుంది?
- 2023 సంవత్సరం లో పరీక్ష ఫీజు 1400/- రూపాయలు ఉంది. SC, ST, PH అభ్యర్ధులు 700/- రూపాయలు చొప్పున చెల్లించడం జరిగింది. ఆన్ లైన్ లోనే పేమెంట్ చెయ్యవలసి ఉంటుంది. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత తిరిగి ఇవ్వడం జరగదు.
అగ్రిసెట్ అప్లికేషన్ (హార్డ్ కాపీ ) తో పాటు ఏ సర్టిఫికెట్స్ జత పరచి పోస్టు లో పంపాలంటే…..
- ఆన్ లైన్ అప్లికేషన్ యొక్క హార్డ్ కాపీ
- proof of Age (Birth Certificate/xerox of SSC certificate)
- SSC certificate
- Marks memorandum cum pass certificate of Diploma course or course completion certificate of diploma issued by the principal
- Latest conduct certificate
- Caste certificate (in case of SC/ST/BC) issued by MRO
- proof of local status
- one self attested passport size photograph
- Payment acknowledgement ( transaction ID/UTR) paid through Online
యూనివర్సిటీ వెబ్ సైట్ లో హాల్ టికెట్స్ ఉంచుతారు. ఈ పరీక్ష లో క్వాలిఫై కావడానికి కనీసం 25% మార్కులు అనగా (120 కి 30) సంపాదించాలి. SC, ST అభ్యర్ధులకు కనీస మార్కులు లేవు. ఈ పరీక్ష లో వచ్చిన మార్కులను బట్టి రాంకులు ప్రకటిస్తారు.
పరీక్ష లో ఒకే మార్కులు వచ్చినపుడు ఏం చేస్తారంటే….
ఒకవేళ మార్కులు సమానం గా వస్తే వారి డిప్లొమా గ్రేడ్ పాయింట్ చూస్తారు. ఒకవేళ ఈ రెండూ కూడా సమానం గా ఉంటే పదవ తరగతి గ్రేడు పాయింట్ చూస్తారు. ఒకవేళ పై మూడూ సమానం గా ఉంటే ఎవరి వయసు ఎక్కువ ఉంటే వారికి తక్కువ ర్యాంకు ఇస్తారు.
ఈ విధం గా ఈ పరీక్ష లో వచ్చిన మార్కులను బట్టి రాంకులు ఇస్తారు. రాంకులు వచ్చిన వారికి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా గాని, యూనివర్సిటీ లో నేరుగా గాని కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తారు. కౌన్సిలింగ్ లో వివిధ వ్యవసాయ కళాశాలలలో సీట్లు కేటాయిస్తారు.
వ్యవసాయ శాస్త్రం లో పట్టభద్రులై ‘ప్లాంట్ డాక్టర్’ అని అనిపించుకోవాలి అంటే మాత్రం చాలా కష్టపడాలి… కాబట్టి మీకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని కష్టపడితే తప్పకుండా మంచి రాంక్ వస్తుంది. ఇది చాలా విలువైన కోర్సు కాబట్టి ఒక సంవత్సరం లో సరైన రాంక్ రాలేదని వదిలి వేయకుండా.. తిరిగి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. తమ నాలుగవ ప్రయత్నం లో సీట్లు పొందిన వారు ఎంతో మంది ఉన్నారు కాబట్టి.. సీట్ వచ్చేంత వరకు శ్రమించండి. ప్లాంట్ డాక్టర్ అనిపించు కొని మీ కలలను సాకారం చేసుకోండి.
Vijay Kumar Bomidi, Director, Vijay Kumar Agri Academy Salur
8125443163