January 10, 2025

Allu Arjun Arrest| అల్లు అర్జున్ అరెస్ట్, మధ్యంతర బెయిల్ మంజూరు

0

అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన తర్వాత కోర్టు ఉత్తర్వుల తో చంచల్ గూడా జైలు కి తరలించారు. నాటకీయ పరిణామాల తర్వాత అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలు కు తరలించారు. తెలంగాణా హైకోర్టు లో చాలా సేపు వాదనలు జరిగిన తర్వాత ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ లభించింది. షారూక్ – వడోదరా కేసు, ఆర్నాబ్ కేసులను ఉదాహరణ గా చూపుతూ ఈ తీర్పు వెలువడింది. అల్లు అర్జున్ వద్ద వ్యక్తిగత బాండు తీసుకున్న అనంతరం చంచల్ గూడా జైలు నుండి విడుదల చేస్తారు.

Allu Arjun Arrest

Allu Arjun Arrest

Allu Arjun Arrest| అల్లు అర్జున్ అరెస్ట్, మధ్యంతర బెయిల్ మంజూరు 

ఈ రోజు మద్యాహ్నం 12 గంటలకు నాటకీయ పరిణామాల మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి  పోలీసులు అరెస్టు చేసారు. పుష్ప -2 ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భం గా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట లో రేవతి  ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.  ఆ మహిళ భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ ను పోలీసులు ఈ రోజు అరెస్టు చేసారు.Allu Arjun Arrest

అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన తర్వాత కోర్టు ఉత్తర్వుల తో చంచల్ గూడా జైలు కి తరలించారు. నాటకీయ పరిణామాల తర్వాత అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలు కు తరలించారు. తెలంగాణా హైకోర్టు లో చాలా సేపు వాదనలు జరిగిన తర్వాత ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ లభించింది. షారూక్ – వడోదరా కేసు, ఆర్నాబ్ కేసులను ఉదాహరణ గా చూపుతూ ఈ తీర్పు వెలువడింది. అల్లు అర్జున్ వద్ద వ్యక్తిగత బాండు తీసుకున్న అనంతరం చంచల్ గూడా జైలు నుండి విడుదల చేస్తారు.

ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అదుపు లోనికి తీసుకున్నారు. సంధ్య థియేటర్ యాజమాన్యం ప్రీమియర్ షో కి పోలీసు భద్రత అడిగారని, ఎటువంటి రాలీ కి అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. స్టార్ హీరో తన అనుచరులతో పాటు థియేటర్ కి రావడం తో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని ఫలితం గా రేవతి అనే మహిళ మృతి చెందారని పోలీసులు కోర్టుకు తెలిపారు.

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో దాదాపు రెండు గంటల పాటు పోలీసులు అల్లు అర్జున్ ను విచారించారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. Allu Arjun Arrest

గాంధీ  ఆసుపత్రిలో  వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్ ను నాంపల్లి క్రిమినల్  కోర్టు లో ప్రవేశ పెట్టారు. ఈ రోజు తన అరెస్టు ను నిలిపివేయాలని అర్జున్ వేసిన క్వాష్ పిటీషన్ ను హైకోర్టు  కోర్టు కొట్టి వేసింది. ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసినందున క్వాష్ అవసరం ఉండదు అని కోర్టు తెలిపింది. దీనితో అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇటువంటి కేసుల్లో గరిష్టం గా పదేళ్ళ వరకూ అవకాశం ఉంటుంది.

అల్లు అర్జున్ ను అరెస్టు చేసే సమయంలో  కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు అంటూ అల్లు అర్జున్ వ్యాఖ్యలు చేసారు. అరెస్టు సమయం లో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి   కూడా ప్రక్కనే ఉన్నారు. తన భార్య ధైర్యం గా ఉండాలని సూచిస్తూ అర్జున్ ఆమెను ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది

 

పలు రాజకీయ కోణాలు :Allu Arjun Arrest

అల్లు అర్జున్ నిన్న ప్రశాంత్ కిషోర్ ను కలిసారు. ఈ భేటీ జరిగిన మరుసటి రోజునే ఈ అరెస్టు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అల్లు అర్జున్ అరెస్టు అయిన వెంటనే పలు రాజకీయ పార్టీల నాయకులు పలు రకాలు గా స్పందించారు. చట్టం తన పని తాను చేసుకు పోతుంది అని తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అల్లు అర్జున్ అరెస్టు ను వైసీపీ అధినేత వై ఎస్ జగన్ తీవ్రం గా ఖండించారు. ఈ ఘటన దురదృష్టకరమని మృతి చెందిన మహిళ కుటుంబానికి అండగా ఉంటానని అల్లు అర్జున్ హామీ ఇచ్చినప్పటికీ ఇలా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయడం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించారు.

ఏపీ డిప్యూటీ సి ఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. కేటీఆర్ ఈ అరెస్టును తీవ్రం గా ఖండించారు. అధికారం లో ఉన్న వారి అభద్రత ను ఇది సూచిస్తుందని, సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. అల్లు అర్జున్ అరెస్టు ను ఖండిస్తున్నట్టు బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు.

అల్లు అర్జున్ నివాసానికి చిరంజీవి దంపతులు చేరుకున్నారు. అలాగే నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు.  అల్లు అర్జున్ అరెస్టును కేంద్రమంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు.

అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం అన్యాయం .. ఇలా చేయడం కరెక్టు కాదు. మేము అల్లు అర్జున్ కి ఎల్లపుడూ అండగా ఉంటాం అంటూ నందమూరి బాలకృష్ణ X లో ట్వీట్ చేసారు. Allu Arjun Arrest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *