Odysseus American Private Moon Mission |చంద్రుని పై దిగిన అమెరికా మూన్ లాండర్
నాసా ప్రైవేటు భాగస్వామ్యం తో ప్రయోగించిన ఒడిస్సీయస్ వ్యోమ నౌక కూడా ప్రక్కకి ఒరిగిపోయింది. అంటే జపాన్, అమెరికాలు ప్రయోగించిన ల్యాండర్ లు ప్రక్కకి ఒరిగి పోయాయి. కేవలం భారత్ ప్రయోగించిన ‘చంద్రయాన్-3’ మాత్రమే నూటికి నూరు శాతం సత్ఫలితాలను ఇచ్చింది అని చెప్పవచ్చు.
Odysseus American Private Moon Mission |చంద్రుని పై దిగిన అమెరికా మూన్ లాండర్
యాభై ఏళ్ల తర్వాత అమెరికా పంపిన ప్రైవేట్ మూన్ లాండర్ ఒడిస్సీయస్ సురక్షితం గా చంద్రుని దక్షిణ ధృవం పై లాండ్ అయ్యింది. నిజం గా అమెరికా కు ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. అమెరికా కు చెందిన ఒక ప్రైవేటు సంస్థ ‘ఇంట్యూటివ్ మెషిన్స్’ ఈ మూన్ లాండర్ ను తయారు చేసింది. నోవా సి శ్రేణి కి చెందిన ఈ మూన్ లాండర్ కు ‘ఒడిస్సీయస్’ అనే పేరు పెట్టారు. ఈ మూన్ లాండర్ ఇటీవల చంద్రుని దక్షిణ ధృవం పై సురక్షితం గా దిగింది. (Odysseus American Private Moon Mission)
మూన్ ల్యాండర్ లను ప్రయోగిస్తున్న దేశాలు
మన దేశం చంద్రయాన్ ప్రయోగాన్ని దిగ్విజయం గా నిర్వహించడం తో మిగిలిన దేశాలు కూడా ఈ దిశ గా అడుగులు వేస్తున్నాయి. జపాన్ మూన్ ల్యాండర్ కూడా ఇటీవలే చంద్రుని పై విజయవంతం గా దిగింది. అంతకు ముందు రష్యా ఆదరా బాదరా గా చేసిన మూన్ లాండింగ్ ప్రయోగం విఫలం అయ్యింది. ఇప్పుడు అమెరికా ఒక ప్రైవేటు సంస్థ తో కలిసి ఈ ప్రయోగాన్ని చేసింది. మొట్టమొదటి ప్రైవేట్ మూన్ ల్యాండింగ్ ప్రయోగం గా దీనిని అభివర్ణించ వచ్చు.
రష్యా, జపాన్, అమెరికా ప్రయోగించిన మూన్ ల్యాండర్ ల కంటే చంద్రయాన్ – 3 నే అతి పెద్ద సక్సెస్
రష్యా మూన్ లాండింగ్ ప్రయోగం పూర్తిగా విఫలం అయ్యింది. జపాన్ ప్రయోగించిన SLIM మూన్ స్నైపర్ సురక్షితం గా దిగింది కానీ తిరగబడి పోవడం తో సోలార్ పలకలకు సూర్యరశ్మి అందక ప్రయోగం పెద్దగా సత్ఫలితాలను ఇవ్వలేదు. 15 రోజుల రాత్రి తర్వాత మరలా ఈ వ్యోమ నౌక లోని పరికరాలు పనిచేస్తున్నాయని సమాచారం అందుతోంది అని జాక్సా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పుడు నాసా ప్రైవేటు భాగస్వామ్యం తో ప్రయోగించిన ఒడిస్సీయస్ వ్యోమ నౌక కూడా ప్రక్కకి ఒరిగిపోయింది. అంటే జపాన్, అమెరికాలు ప్రయోగించిన ల్యాండర్ లు ప్రక్కకి ఒరిగి పోయాయి. కేవలం భారత్ ప్రయోగించిన ‘చంద్రయాన్-3’ మాత్రమే నూటికి నూరు శాతం సత్ఫలితాలను ఇచ్చింది అని చెప్పవచ్చు.
అమెరికా ఒడిస్సీయస్ మూన్ ల్యాండర్ ప్రయోగం జరిగింది ఇలా…
ఈ మూన్ లాండర్ ను ఫిబ్రవరి 15 , 2024 న స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ సహాయం తో చంద్రుని పైకి పంపించారు. దీనిలో నాసా రూపొందించిన 6 శాస్త్రీయ పరికరాలు, మరియు 6 ప్రైవేట్ పే లోడ్స్ ను పంపించారు. చంద్రుని కక్ష్య లోనికి చేరడానికి దాదాపు 6 రోజుల సమయం పట్టింది. చంద్రుని దక్షిణ ధృవానికి 190 మైళ్ళు లేదా 300 కిలోమీటర్ల దూరం లో సురక్షితం గా ఇది దిగింది.(Odysseus American Private Moon Mission)
ఫిబ్రవరి 22, 2024 న మాలాపెర్ట్ A అనే ఒక క్రేటర్ (బిలం) లో ఈ మూన్ లాండర్ దిగింది. ఈ క్రేటర్ చంద్రుని దక్షిణ ధృవానికి 85 డిగ్రీల దక్షిణ అక్షాంశానికి దగ్గరగా ఉంటుంది. చంద్రుని దక్షిణ ధృవానికి అత్యంత దగ్గరగా దిగిన లాండర్ గా ఇది చరిత్ర సృష్టించింది. చంద్రుని పైకి ఇలా మానవ రహిత మూన్ మిషన్ ను పంపడాన్ని IM-1 (ఐ. ఎం- 1) అనే మిషన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యోమ నౌక 14 అడుగులు లేదా 4.3 మీటర్ల పొడవు ఉంటుంది. 2 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది.
ఇది ఒక ప్రైవేటు మిషన్ – నాసా (NASA) (Odysseus American Private Moon Mission)
ఈ మూన్ మిషన్ ని అమెరికా ఒక ప్రైవేటు సంస్థ కు అప్పగించింది. అంతే కాకుండా దానికి కావలసిన నిధులను సమకూర్చింది నాసా (NASA).
చంద్రుని పైకి అపోలో యాత్రలు 1972 సంవత్సరం నుండి ఆగిపోయిన తర్వాత అంటే దాదాపు యాభై ఏళ్ల తర్వాత అమెరికా కు చెందిన ఒక మూన్ మిషన్ చంద్రుని చేరడం ఇదే ప్రధమం అని చెప్పవచ్చు.
ల్యాండింగ్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి
ఈ లాండర్ చంద్రుని పై దిగే సమయం లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ల్యాండర్ యొక్క లేజర్ రేంజ్ ఫైండర్స్ సరిగ్గా పనిచేయలేదు. దానితో లాండర్ లోని NDL అనే పరికరం సహాయం తో సమస్యను పరిష్కరించారు. ఈ సమస్య ఏర్పడటం వలన నిర్దేశిత సమయం కంటే ల్యాండర్ ల్యాండ్ కావడం దాదాపు రెండు గంటలు ఆలస్యం అయ్యింది. హ్యూస్టన్ లోని మిషన్ కంట్రోల్ చాకచక్యం గా ఈ సమస్యను పరిష్కరించి ల్యాండింగ్ చేసారు. (Odysseus American Private Moon Mission)
చివరికి చంద్రుని ఉపరితలాన్ని తాకే సమయం లో ల్యాండర్ ఒడిదుడుకులకు గురైంది. చంద్రుని పై దిగే సమయం లో దీని యొక్క లంబ వేగము గంటకు 2 మైళ్ళ వేగము , సమాంతర వేగము సున్నా గా ఉండాలి. కాని ఇది గంటకు 6 మైళ్ళ లంబ వేగం తోనూ , గంటకు 2 మైళ్ళ సమాంతర వేగము తోనూ ప్రయాణించి నట్లు చూపిస్తోంది అని ఇంట్యూటివ్ మెషీన్స్ కో ఫౌండర్ ఆల్టిమాస్ చెప్పారు.
వేగం లో మార్పు తో ప్రయాణించిన ఈ లాండర్ యొక్క కాళ్ళు (లాండింగ్ లెగ్స్) ఏదైనా పగుళ్ళ మధ్య చిక్కు కోవడం గాని, చంద్రుని ఉపరితం పై ఎత్తు గా ఉన్న గుట్టలను గుద్దుకొని గాని ఉండొచ్చు అని ఆయన చెప్పారు.
ప్రక్కకి ఒరిగి పోయిన ఒడిస్సీయస్ – లాండింగ్ ఫోటోలు అందుకే లేవు
ఇలా జరగడం వలన నిలువుగా ఉపరితం పైన దిగవలసిన ల్యాండర్ ప్రక్కకు ఒరిగిపోయింది. చంద్రుని ఉపరితలం పై లాండ్ అయ్యే దృశ్యాలను చిత్రీకరించడానికి ఈ ల్యాండర్ లో ఈగిల్ క్యాం (Eaglecam)అనే ఒక పే లోడ్ ను ఉంచారు. ఇది లాండ్ కావడానికి ముందే లాండర్ నుండి విడివడి ఆ దృశ్యాలను చిత్రీకరించాలి. కాని లాండింగ్ లో ఏర్పడిన సమస్యల వలన ఈ కెమెరాను బయటకు పంపకుండా లోపలే ఉంచారు. వీలైనంత త్వరగా ఈ కెమెరాను బయటకు పంపి ల్యాండర్ యొక్క పరిస్థితి ని ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఫోటోలను బట్టి ల్యాండర్ ఎంత మేరకు ఒరిగిపోయింది అనేది అంచనా వేసి దానిని సరి చేయడానికి ప్రయత్నిస్తారు.
ఒడిస్సీయస్ ను ఫోటో తీసిన అమెరికా ఆర్బిటర్(Odysseus American Private Moon Mission)
చంద్రుని పై ప్రస్తుతం పగలు కాబట్టి సూర్యరశ్మి ఈ వ్యోమ నౌక యొక్క సౌర పలకలపై పడి బ్యాటరీలు అన్నీ చార్జింగ్ అవుతున్నందువలన సమాచార సేకరణ పై దృష్టి కేంద్రీకరిస్తారు. ఇప్పటికే చంద్రుని చుట్టూ తిరుగుతున్న అమెరికా కు చెందిన ల్యూనార్ రీ కనైసెన్స్ ఆర్బిటార్ ఈ ఒడిస్సీయస్ వ్యోమ నౌక ను ఫోటో తీసి పంపింది. చంద్రుని పై ఉండే అతి శీతల వాతావరణాన్ని తట్టుకొనే విధం గా వ్యోమ నౌక లోని భాగాలు తయారు చేయనందున దీని యొక్క వ్యవధి కేవలం 9 నుండి 10 రోజులు మాత్రమే అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు.
అమెరికా మానవ సహిత యాత్రలకు ఈ సమాచారం కీలకం
అన్ని పే లోడ్స్ సురక్షితం గా ఉన్నాయి కాబట్టి ఉన్న కొద్ది పాటి సమయం లో చంద్రుని పై అవసరమైన సమాచారాన్ని సేకరించి పంపించాలని ఆశిద్దాం. చంద్రుని పైకి మానవ సహిత యాత్రలకు అమెరికా మరలా సిద్ధమౌతున్న ప్రస్తుత తరుణం లో ఒడిస్సీయస్ పంపించే సమాచారం చాలా కీలకం కాబోతోంది.
-Vijay Space News Desk