January 10, 2025

AP AGRICET Results 2024| వ్యవసాయ కళాశాలలు – సీట్ల వివరాలు | Vijay News Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఆచార్య ఎన్. జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం (ANGRAU) వారి ఆధ్వర్యం లో మొత్తం 7 ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఐదు కళాశాలలు ఏళ్ళ క్రితం స్థాపించినవి కాగా ఉదయగిరి, పులివెందుల కళాశాలలు కొత్తగా స్థాపించారు. ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే…

AP AGRICET Results 2024

AP AGRICET Results 2024 Pic credits: VK Agri Academy Salur

AP AGRICET Results 2024| వ్యవసాయ కళాశాలలు – సీట్ల వివరాలు  | Vijay News Telugu

ఆంధ్రప్రదేశ్  అగ్రిసెట్ 2024 ఫలితాలు ఎట్టకేలకు విడుదల అయ్యాయి. ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం  (ANGRAU) వారు గత ఆగస్టు 27 వ తేదీన ఈ పరీక్షను నిర్వహించారు. ఆన్ లైన్ విధానం లో ఈ పరీక్ష జరిగింది. వ్యవసాయ డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్దులకు బిఎస్సీ అగ్రికల్చర్ కోర్సు లోనికి ప్రవేశానికి గానూ అగ్రిసెట్ ప్రవేశ పరీక్షను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు.AP AGRICET Results 2024

రాష్ట్రం లోని పాత జిల్లాల కేంద్రాలలోనే ఈ పరీక్ష ను నిర్వహించారు. అయితే ఫలితాలను విడుదల చేయడానికి మాత్రం చాలా సమయం తీసుకున్నారు. పరీక్ష యొక్క ‘కీ’ విడుదల చేయడానికే చాలా సమయం పట్టింది. ఈ పరీక్షకు తక్కువ సంఖ్యలో విద్యార్దులు హాజరు అయినప్పటికీ యూనివర్సిటీ నుండి ఎటువంటి సమాచారం లేకపోవడం తో గందరగోళానికి గురయ్యారు.

ఫలితాలు ఆలస్యం అయ్యాయి 

ఫలితాలను చూసుకొని ఒకవేళ సీటు వచ్చే ర్యాంకు రాకపోతే సాధారణ డిగ్రీ లో జాయిన్ కావచ్చు అనేది విద్యార్దుల ఉద్దేశ్యం. అయితే ఫలితాల ప్రకటన బాగా ఆలస్యం కావడం తో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘నీట్’ పరీక్షా  పత్రాలు బయటకు రావడం వంటి కారణాలతో అక్కడ కూడా అడ్మిషన్లు ఆలస్యం కావడం తో దాని ప్రభావం ఎప్ సెట్ పైనా అలాగే అగ్రిసెట్ పైనా పడిందని చెప్పవచ్చు. ఏమైనప్పటికీ అగ్రిసెట్ ఫలితాలు విడుదల కావడం తో విద్యార్దులు ఊపిరి పీల్చుకున్నారు. AP AGRICET Results 2024

ఈ ఏడాది బాగా తగ్గిన విద్యార్ధుల సంఖ్య

వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గిపోవడం తో ఈ సారి అగ్రిసెట్ రాసిన విద్యార్దుల సంఖ్య కూడా బాగా తగ్గింది. అగ్రిసెట్ ప్రవేశ పరీక్ష ను అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్ అనే మూడు విభాగాలలో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అగ్రికల్చర్ పరీక్ష ను 1469 మంది, సీడ్ టెక్నాలజీ పరీక్ష ను 52 మంది, ఆర్గానిక్ ఫార్మింగ్ పరీక్ష ను 35 మంది విద్యార్దులు రాయడం జరిగింది. మొత్తం 1556 మంది విద్యార్దులు ఈ పరీక్ష కు హాజరు కాగా 1447 మంది ఉత్తీర్ణత సాధించారు.

AGRICET విద్యార్దులకు అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు:

అగ్రిసెట్ పరీక్ష లో ఉత్తీర్ణులైన విద్యార్దులకు ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో ఒకసారి చూద్దాం. వివిధ వ్యవసాయ కళాశాలలలో మూడు రకాల సీట్లు వీరికి అందుబాటులో ఉంటాయి.

  1. ప్రభుత్వ వ్యవసాయ  కళాశాలలలో సీట్లు (Govt seats)
  2. ప్రైవేటు  అఫిలియేటెడ్ వ్యవసాయ  కళాశాలలలో సీట్లు (Convener Quota Seats)
  3. ప్రైవేటు అఫిలియేటెడ్ వ్యవసాయ కళాశాలలలో మేనేజ్ మెంట్ కోటా సీట్లు (Management Quota Seats)

ప్రభుత్వ వ్యవసాయ  కళాశాలల వివరాలు:(Govt Agricultural Colleges)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఆచార్య ఎన్. జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం (ANGRAU) వారి ఆధ్వర్యం లో మొత్తం 7 ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఐదు కళాశాలలు ఏళ్ళ క్రితం స్థాపించినవి కాగా ఉదయగిరి, పులివెందుల కళాశాలలు కొత్తగా స్థాపించారు. ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే…

  1. వ్యవసాయ కళాశాల, బాపట్ల 
  2. వ్యవసాయ కళాశాల, నైరా, శ్రీకాకుళం జిల్లా 
  3. వ్యవసాయ కళాశాల, రాజమహేంద్రవరం
  4. ఎస్.వి వ్యవసాయ కళాశాల, తిరుపతి 
  5. వ్యవసాయ కళాశాల, మహానంది, నంద్యాల జిల్లా 
  6. మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల, ఉదయగిరి, SPSR నెల్లూరు జిల్లా 
  7. వ్యవసాయ కళాశాల, పులివెందుల , YSR జిల్లా 

ఈ ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలలో అగ్రిసెట్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి మొత్తం 196 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వ్యవసాయ డిప్లొమా వారికి 161, సీడ్ టెక్నాలజీ వారికి 27, ఆర్గానిక్ ఫార్మింగ్ డిప్లొమా వారికి 8 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లను మెరిట్ ప్రాతిపదికన కౌన్సిలింగ్ ద్వారా కేటాయిస్తారు. మంచి ర్యాంకులు పొందిన వారికి ఈ కాలేజీలలో సీట్లు లభిస్తాయి.

మొత్తం సీట్ల లో  15 % సీట్లు అన్ రిజర్వుడ్ (ఓపెన్ కేటగిరీ) గా ఉంటాయి. ఈ 15% సీట్ల కోసం AP మరియు TG విద్యార్దులు కూడా పోటీ పడవచ్చు. AU, SVU తో పట్టు ఉస్మానియా యూనివర్సిటీ వారు కూడా ఈ సీట్ల కోసం పోటీ పడవచ్చు. మిగిలిన 85% సీట్లను ఆంధ్రా యూనివర్సిటీ (AU) మరియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (SVU) ల మధ్య 42:22 నిష్పత్తి లో సీట్లు కేటాయిస్తారు. AP AGRICET Results 2024

BSc Agriculture (Hons) - AP AGRICET results 2024
BSc Agriculture (Hons) – AP AGRICET results 2024

ప్రైవేటు అఫిలియేటెడ్ వ్యవసాయ  కళాశాలల వివరాలు :(Private Affiliated Agricultural Colleges)

ఆచార్య ఎన్. జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) వారికి అనుబంధం గా  పనిచేస్తున్న ప్రైవేటు వ్యవసాయ కళాశాలలను ప్రైవేటు అఫిలియేటెడ్ వ్యవసాయ  కళాశాలలు గా పేర్కొనవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 6 కాలేజీలు ఉన్నాయి. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే…

  1. శ్రీ కింజరాపు ఎర్రంనాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా 
  2. కదిరి బాబూరావు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, C.S పురం, ప్రకాశం జిల్లా 
  3. N.S అగ్రికల్చరల్ కాలేజ్, మార్కాపురం, ప్రకాశం జిల్లా 
  4. SVBR అగ్రికల్చరల్ కాలేజ్, బద్వేల్, YSR జిల్లా 
  5. శ్రీ కృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, అనంతపురము  
  6. J.C దివాకర్ రెడ్డి అగ్రికల్చరల్ కాలేజ్, తాడిపత్రి, అనంతపురము 

ప్రైవేటు అఫిలియేటెడ్ వ్యవసాయ  కళాశాలలలో మొత్తం 72 సీట్లు అగ్రిసెట్ ఉత్తీర్ణులకు అందుబాటులో ఉన్నాయి. అగ్రి డిప్లొమా వారికి 59, సీడ్ టెక్నాలజీ వారికి 10, ఆర్గానిక్ ఫార్మింగ్ వారికి 03 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ఈ కాలేజీలలో సీట్ల సంఖ్య భారీగా పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. అలా జరిగితే అగ్రిసెట్ విద్యార్ధులకు మరిన్ని సీట్లు అందుబాటులోనికి వస్తాయి. ఈ వివరాలు నోటిఫికేషన్ లో ఇస్తారు.

అగ్రిసెట్ రాసిన వారికి కేవలం ర్యాంక్ కార్డు మాత్రమే విడుదల చేసారు. ఎన్ని మార్కులు వచ్చాయి, కేటగిరీల వివరాలు, హాల్ టికెట్ నంబర్లు, విద్యార్దుల పేర్లు మరియు ర్యాంకుల తో కూడిన వివరాలు త్వరలోనే విడుదల చేస్తారు. అప్పుడు దానిని బట్టి ఆయా కళాశాలలలో సీట్లు వచ్చేదీ రానిదీ కొంతవరకు అవగాహనకు వస్తుంది. ఈ వివరాలతో పాటు నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేస్తారు. అక్టోబర్ చివరి వారం లోగాని , నవంబరు మొదటి వారం లో గాని అగ్రిసెట్ విద్యార్ధులకు కౌన్సెలింగ్ ఉండవచ్చు.AP AGRICET Results 2024

మీ విజయ్ కుమార్ బోమిడి, డైరక్టర్,

విజయ్ కుమార్ అగ్రి అకాడమీ, సాలూరు, విజయనగరం 

8125443163