AP EAPCET 2024 మూడవ కౌన్సెలింగ్ ANGRAU| నవంబర్ 4, 2024 నుండి లాం ఫారం వద్ద
ప్రైవేటు కాలేజీలలో ఫీజులన్నీ ఒక సంవత్సరానికి (per annum) అంటే రెండు సెమిస్టర్ లకు అని గమనించాలి. G.O Ms No 56 dated 05-10-23 ప్రకారం కన్వీనర్ కోటా సీట్ల యొక్క ఫీజు స్ట్రక్చర్ మారింది అని గమనించగలరు.
ఈ విధం గా కన్వీనర్ కోటా లో జాయిన్ అయిన వారికి అర్హత కలిగిన వారికి ఫీజు రీయంబర్స్ మెంట్ వస్తుంది. కాబట్టి ప్రైవేటు కాలేజీలలో ఫీజులు ఎక్కువ ఉంటాయి అనుకోవడం సరైనది కాదు.
AP EAPCET 2024 3rd phase counseling మూడవ కౌన్సెలింగ్ ANGRAU| నవంబర్ 4, 2024 నుండి లాం ఫారం వద్ద
AP EAPCET 2024 లో ర్యాంకులు సాధించిన వారికి ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు మూడవ కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించారు .BSc (Hons) Agriculture, B. Tech (Food Technology) కోర్సులలో అడ్మిషన్లకు గానూ ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. మొదటి రెండు కౌన్సిలింగ్ సెషన్లు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించారు. మూడవ కౌన్సిలింగ్ ను నేరుగా మాన్యువల్ పధ్ధతి లో లాం ఫారం వద్ద నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ జరిగిన కౌన్సిలింగ్ లలో అనేక మంది విద్యార్దులు సీట్లు పొంది ఆయా కాలేజీలలో జాయిన్ అయ్యారు. (AP EAPCET 2024 3rd phase counseling)
యూనివర్సిటీ లోని వివిధ కాలేజీలలో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని లాం ఫారం వద్ద యూనివర్సిటీ ప్రాంగణం లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈ నెల 4 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు ర్యాంకుల ఆధారం గా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.
04-11-24 – సోమవారం
ఉదయం 08-30 AM – స్పెషల్ కేటగిరీ అభ్యర్ధులకు (PH, CAP, NCC, Sports and games, Scouts & Guides) – కృష్ణా ఆడిటోరియం, RARS, లాం ఫారం, గుంటూరు
మధ్యాహ్నం 02.00 PM – 208 నుండి 7998 ర్యాంకుల వరకు – అన్ని కేటగిరీల అభ్యర్ధులు – కృష్ణా ఆడిటోరియం, RARS, లాం ఫారం, గుంటూరు
05-11-24 – మంగళ వారం
ఉదయం 08.30 AM – 8008 నుండి 12000 ర్యాంకుల వరకు – అన్ని కేటగిరీల అభ్యర్ధులు – కృష్ణా ఆడిటోరియం, RARS, లాం ఫారం, గుంటూరు
మధ్యాహ్నం 02.00 PM – 12012 నుండి 14996 ర్యాంకుల వరకు – అన్ని కేటగిరీల అభ్యర్ధులు – కృష్ణా ఆడిటోరియం, RARS, లాం ఫారం, గుంటూరు
06-11-24 బుధవారం (AP EAPCET 2024 3rd phase counseling)
ఉదయం 08.30 AM – 15004 నుండి 18989 ర్యాంకుల వరకు – అన్ని కేటగిరీల అభ్యర్ధులు – కృష్ణా ఆడిటోరియం, RARS, లాం ఫారం, గుంటూరు
మధ్యాహ్నం 02.00 PM – 19003 నుండి 22987 ర్యాంకుల వరకు – అన్ని కేటగిరీల అభ్యర్ధులు – కృష్ణా ఆడిటోరియం, RARS, లాం ఫారం, గుంటూరు
07-11-24 గురువారం
ఉదయం 08.30 AM – 23011 నుండి 24260 ర్యాంకుల వరకు – అన్ని కేటగిరీల అభ్యర్ధులు – APGC Seminar hall, RARS, లాం ఫారం, గుంటూరు
మధ్యాహ్నం 02.00 PM – 24277 నుండి 25998 ర్యాంకుల వరకు – అన్ని కేటగిరీల అభ్యర్ధులు -APGC Seminar hall , RARS, లాం ఫారం, గుంటూరు
08-11-24 శుక్రవారం (AP EAPCET 2024 3rd phase counseling)
ఉదయం 08.30 AM – 26012 నుండి 29991 ర్యాంకుల వరకు – అన్ని కేటగిరీల అభ్యర్ధులు – కృష్ణా ఆడిటోరియం, RARS, లాం ఫారం, గుంటూరు
మధ్యాహ్నం 02.00 PM – 30010 నుండి 33976 ర్యాంకుల వరకు – అన్ని కేటగిరీల అభ్యర్ధులు – కృష్ణా ఆడిటోరియం, RARS, లాం ఫారం, గుంటూరు
గుర్తు ఉంచుకోవలసిన కొన్ని విషయాలు :
- 14-11-24 వ తేదీ వరకూ జరిగిన అడ్మిషన్ లను బట్టి అవసరం అయితే మరొక కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. మిగిలిన పోయిన సీట్ల కు 18-11-24 వ తేదీన గురువారం ఫైనల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.
- కౌన్సిలింగ్ కి పిలిచినంత మాత్రాన సీట్ గ్యారంటీ అని కాదు.
- నిర్దేశించిన సమయానికే కౌన్సిలింగ్ సెంటర్ కు హాజరు కావాలి. ర్యాంకు పిలిచిన సమయానికి హాజరు కాకపోతే తర్వాత సీటు కేటాయింపు చెయ్యరు.
- అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్ల ను సమర్పించాలి.
- కౌన్సిలింగ్ లో సీటు పొందిన అభ్యర్ధులు నిర్దేశించిన ఫీజు మొత్తాన్ని వెంటనే ఆయా కాలేజీల కౌంటర్ ల వద్ద చెల్లించాలి. ఆన్ లైన్ లేదా యూపీ ఐ పెమెంట్ల ను అంగీకరించరు. క్యాష్ రూపం లో మాత్రమే డబ్బు పేమెంట్ చేయాలి.
ఫీజుల వివరాలు
ప్రభుత్వ కళాశాలలలో సీటు పొందిన విద్యార్ధులు BSc (Hons) Agriculture కోసం 46,429/- రూపాయలు చెల్లించాలి. B.Tech(Food Technology) కోర్సు కోసం 49,879/- రూపాయలు చెల్లించాలి. (సెమిస్టర్ కు)
ప్రైవేటు కాలేజీలలో సీటు పొందిన విద్యార్దులు ఆయా కాలేజీలకు నిర్దేశించిన ఫీజులను చెల్లించాలి. ఎందుకంటే ఒక్కో కాలేజీ కి ఒక్కొక్క రకం గా ఫీజులు నిర్ణయించారు కాబట్టి వాటిని బట్టి ఫీజు చెల్లించాలి. ఆయా కాలేజీలకు చెల్లించవలసిన ఫీజుల వివరాలు ఈ విధం గా ఉన్నాయి.
- SBVR వ్యవసాయ కళాశాల, బద్వేలు – Rs 85,000/-
- NS వ్యవసాయ కళాశాల , మార్కాపురం – Rs 1,26,000/-
- శ్రీ కృష్ణదేవరాయ వ్యవసాయ కళాశాల, అనంతపురము -Rs 1,00,600/-
పై మూడు కళాశాలలకు ICAR గుర్తింపు ఉంది. ఈ కాలేజీలకు 2029 వరకూ ICAR గుర్తింపు ఉంది.
- కదిరి బాబూరావు వ్యవసాయ కళాశాల, CS పురం – Rs 88,600/-
- JC దివాకర్ రెడ్డి వ్యవసాయ కళాశాల, తాడిపత్రి – Rs 87,300/-
- కింజరాపు ఎర్రన్నాయుడు వ్యవసాయ కళాశాల, ఎచ్చెర్ల – Rs 1,28,700/-
పైన ఇవ్వబడిన ఫీజులు అన్నీ ఒక సంవత్సరానికి అని గుర్తించాలి. చాలా మంది ప్రతి సెమిస్టర్ కు ఇంత చెల్లించాలి అనుకుంటున్నారు. అది నిజం కాదు. ప్రైవేటు కాలేజీలలో ఫీజులన్నీ ఒక సంవత్సరానికి (per annum) అంటే రెండు సెమిస్టర్ లకు అని గమనించాలి. G.O Ms No 56 dated 05-10-23 ప్రకారం కన్వీనర్ కోటా సీట్ల యొక్క ఫీజు స్ట్రక్చర్ మారింది అని గమనించగలరు.
ఈ విధం గా కన్వీనర్ కోటా లో జాయిన్ అయిన వారికి అర్హత కలిగిన వారికి ఫీజు రీయంబర్స్ మెంట్ వస్తుంది. కాబట్టి ప్రైవేటు కాలేజీలలో ఫీజులు ఎక్కువ ఉంటాయి అనుకోవడం సరైనది కాదు. హాస్టల్, మెస్, ట్రాన్స్ పోర్ట్ వంటి అదనపు ఫీజులు ఎంత ఉంటాయో జాయినింగ్ రోజునే కాలేజీల యాజమాన్యాలను అడిగి తెలుసుకోవడం మంచిది. AP EAPCET 2024 3rd phase counseling
ఈ కౌన్సిలింగ్ కి ఎవరు హాజరు కావచ్చు అంటే…
ఇంతకుముందే వేరే కాలేజీలో సీటు పొంది వేరే కాలేజీకి మారాలి అనుకొనేవారు, ఇంతకుముందు కౌన్సిలింగ్ లలో పాల్గొని సీటు రానివారు, ఇంతకుముందు జరిగిన కౌన్సిలింగ్ లలో పాల్గొనని వారు, ఇంతకు ముందు కౌన్సిలింగ్ లో సీటు పొంది జాయిన్ కాని వారు, ఇంతకు ముందు కౌన్సిలింగ్ లో సీటు పొంది దానిని కేన్సిల్ చేసుకున్నవారు, రిజిస్టర్ అయిన స్పెషల్ కేటగిరీ అభ్యర్ధులు ఈ కౌన్సిలింగ్ లో హాజరు కావచ్చు
సీట్ల కు సంబంధించిన మిగిలిన వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ ను సందర్శించ గలరు.
– విజయ్ కుమార్ బోమిడి, డైరెక్టర్, VK అగ్రి అకాడమీ, సాలూరు, విజయనగరం, 8125443163