January 10, 2025

AP Elections Results 2024| మ్యాజిక్ ఫిగర్ కి అటు పది ఇటు పది – ఇదే ఏపీ ఎన్నికల ఫలితం

ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టడానికి కావలసిన సీట్ల సంఖ్య 88. ఈ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడానికే రాజకీయ పక్షాలు తీవ్రం గా కృషి చేసాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఫలితాలు ఏక పక్షం గా ఉండే అవకాశం కనిపించడం లేదు.

AP Elections Results 2024

AP Elections Results 2024

AP Elections Results 2024| మ్యాజిక్ ఫిగర్ కి అటు పది ఇటు పది – ఇదే ఏపీ ఎన్నికల ఫలితం

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఎప్పుడో జరిగాయి. చివరికి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి. ఇక రావలసింది ప్రజల యొక్క నిజమైన తీర్పు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ నమ్మశక్యం కాని ఫలితాలను ఇచ్చాయి. ఏదీ నమ్మలేని పరిస్థితి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసాక ఒక విషయం స్పష్టం గా అర్ధం అవుతోంది. అది ఏంటంటే… ఏపీ లో ఎన్నికలు హోరా హోరీ గా జరిగాయని తెలుస్తోంది. తెలుగుదేశం కూటమి ఊహించినంత బలహీనం గా లేదు. వైసీపీ కూడా ఊహించినంత బలం గానూ లేదని ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి చెప్పవచ్చు.AP Elections Results 2024

సిద్ధం సభలతో ప్రతిపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది వైసీపీ. కానీ ఆశను కోల్పోకుండా పవన్ సహాయం తో బీజేపీ తో కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల కదన రంగం లోనికి దూసుకు వచ్చింది టీడీపీ. ఇరు పక్షాలూ శక్తి వంచన లేకుండా కృషి చేసాయి. ఎటువంటి విమర్శలకూ వెనుకాడలేదు. డబ్బు ను లెక్క చేయలేదు. తాడో పేడో తేల్చుకోవాల్సిందే అంటూ ఒక యుద్ధమే చేసాయి. ఈ యుద్ధం యొక్క ఫలితమే జూన్ 4 వ తేదీన అంటే రేపు వెలువడ బోతోంది.

ఏపీ లో హోరాహోరీ గా జరిగిన పోరాటం, ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి ఫలితాలను అంచనా వేస్తే చాలా ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు లోనికి వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టడానికి కావలసిన సీట్ల సంఖ్య 88. ఈ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడానికే రాజకీయ పక్షాలు తీవ్రం గా కృషి చేసాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఫలితాలు ఏక పక్షం గా ఉండే అవకాశం కనిపించడం లేదు. ఎవరు అధికారం లోనికి వచ్చినా బొటాబొటీ ఆధిక్యత తోనే అనే విషయం మనకు అర్ధం అవుతుంది. మ్యాజిక్ ఫిగర్ 88 కి 10 సీట్లు తక్కువగా అంటే 78 సీట్లు పొంది తెదేపా కూటమి ప్రతి పక్షం లో కూర్చోవచ్చు. లేదా మ్యాజిక్ ఫిగర్ 88 కి 10 సీట్లు ఎక్కువగా తెచ్చుకొని అంటే 98 సీట్లు పొంది వైకాపా తిరిగి అధికారం చేపట్టవచ్చు. ఏమైనప్పటికీ పోటీ మాత్రం తీవ్రం గా ఉంటుంది అనడం లో ఎటువంటి సందేహం లేదు. AP Elections Results 2024

తెదేపా కూటమి 78 సీట్ల వరకూ సాధించే అవకాశం ఉంది. మ్యజిక్ ఫిగర్ చేరుకోవడానికి కేవలం 10 మంది ఎమ్మెల్యే ల మద్దతు అవసరం. బొటాబొటీ మెజార్టీ తో అధికారం లో కూర్చోవడం అంటే ముళ్ళపై కూర్చొన్నట్లే. పది కాకపోతే పాతిక మంది ఎమ్మెల్యే లను కొనుగోలు చేసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా జరగవచ్చు. అధికారం కోసం పోటీ తీవ్రం గా ఉంటుంది కాబట్టి బీజేపీ కీలక పాత్ర పోషించ బోతోంది. ప్రభుత్వాలను కూలదోయడం లో కావలసినంత నేర్పు ఆ పార్టీ కి ఉండటం ఒక అదనపు బలం కూడా…

-విజయ్ న్యూస్ డెస్క్