January 10, 2025

AP Exit Polls Review 2024|AP లో టెన్షన్ మరింత పెంచేసిన ఎగ్జిట్ పోల్స్|Vijay News Telugu

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి దేశం లోని వివిధ సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రజలను మరింత గందరగోళం లోనికి నెట్టివేసాయి. మీడియా ఛానళ్ళు కూడా పక్షపాతం గా వ్యవహరించాయి. తాము ఏ పార్టీలకు కొమ్ము కాస్తున్నాయో ఆ ఫలితాలను మాత్రం హైలెట్ చేసుకున్నాయి. దీనితో సామాన్య ప్రజలకు ఒక స్పష్టత లేకుండా పోయింది.

AP EXIT POLLS REVIEW 2024

AP EXIT POLLS REVIEW 2024

AP Exit Polls Review 2024|AP లో టెన్షన్ మరింత పెంచేసిన ఎగ్జిట్ పోల్స్|Vijay News Telugu

దేశవ్యాప్తం గా సార్వత్రిక ఎన్నికలు ముగియడం తో వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేసాయి. కేంద్రం లో ఎన్డీయే ప్రభుత్వం మళ్ళీ అధికారం లోనికి రానుందని దాదాపు అన్ని ఫలితాలు చెప్తున్నాయి. వివిధ రాష్ట్రాల శాసనసభ లకు జరిగిన ఎన్నికలలో మాత్రం మిశ్రమ ఫలితాలను ప్రకటించాయి ఈ మీడియా సంస్థలు. దాదాపు సగం సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారం లోనికి రానుందని చెప్పగా మిగిలిన సర్వే సంస్థలు తెలుగుదేశం కూటమి అధికారం లోనికి వస్తుందని ఫలితాలు ప్రకటించాయి. ఎన్నికలు జరిగిన ఇతర రాష్ట్రాలలో కూడా ఏక పక్షం గా ఏ పార్టీకి ఆధిక్యాన్ని ఇస్తున్నట్లు చెప్పలేక పోయాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఆయా రాష్ట్రాలలోని  అధికార పక్షం హవా కొనసాగినట్లు కనిపించినా లోక్ సభ ఎన్నికలలో మాత్రం ఎన్డీయే కి స్పష్టమైన ఆధిక్యత ను కట్టబెట్టాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలు.AP Exit Polls Review 2024

ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వైనాట్ 175 అంటూ వైసీపీ ముందుకు వచ్చింది. సిద్ధం సభలను నిర్వహించడం ద్వారా కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపింది. తెలుగు దేశం పార్టీ కూడా చాలా వ్యూహాత్మకం గా స్పందించింది. అవకాశం వచ్చిన ఏ సందర్బాన్ని వదలకుండా వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టింది. పవన్ కళ్యాణ్ చేరిక తో బలపడిన తెలుగుదేశం పార్టీ కేంద్రం లోని బీజేపీ తో పొత్తు  కు ప్రయత్నించి సఫలీకృతం అయ్యింది. దీనితో కూటమి గా ఏర్పడి జగన్ పై వ్యతిరేకతను బాగా ప్రజలలోనికి తీసుకు వెళ్ళింది.జూన్ అయితే  పథకాల లబ్దిదారులు ముఖ్యం గా మహిళలు జగన్ కే ఓటు వేసినట్లు స్పష్టం అవుతోంది. ఎగువ మధ్యతరగతి, ఉన్నత స్థాయి వర్గాల అభిమానం చూరగొనడం లో వైసీపీ విఫలం అయ్యిందని స్పష్టం అవుతోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి దేశం లోని వివిధ సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రజలను మరింత గందరగోళం లోనికి నెట్టివేసాయి. మీడియా ఛానళ్ళు కూడా పక్షపాతం గా వ్యవహరించాయి. తాము ఏ పార్టీలకు కొమ్ము కాస్తున్నాయో ఆ ఫలితాలను మాత్రం హైలెట్ చేసుకున్నాయి. దీనితో సామాన్య ప్రజలకు ఒక స్పష్టత లేకుండా పోయింది. ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంతగా నమ్మదగినవి కాదు అని తేలడం తో అసలు ఫలితాలు వచ్చే వరకు టెన్షన్ తో ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు మీడియా చానళ్ళ లో తటస్థం గా ఉండే ఛానల్ కనీసం ఒక్కటైనా లేకపోయిందే అని వాపోవడం సామాన్యుని వంతు అయ్యింది. ఏది ఏమైనప్పటికీ జూన్ 4 వ తేదీన ఫలితాలు రాకమానవు. ప్రజల తీర్పు ఏ విధం గా ఉంటుందో అని అన్ని రాజకీయ పక్షాలూ గుండెలు అరచేత పట్టుకొని అసలు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాయి.

ఏపీ అసెంబ్లీ కి సంబంధించి వివిధ  మీడియా సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈ విధం గా ఉన్నాయి…AP Exit Polls Review 2024

ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్

వైసీపీ  94 – 104

కూటమి 71 – 81

ఇతరులు – 0

భారత్ పొలిటికల్ రీసెర్చి మరియు అనాలసిస్ సెంటర్ 

వైసీపీ 112 – 143

కూటమి 32 – 63

ఇతరులు – 0

KK ఎగ్జిట్ పోల్స్ 

వైసీపీ 14

కూటమి – 161

ఇతరులు – 0

చాణక్య స్ట్రాటజీస్

వైసీపీ 39 – 49

కూటమి 114 – 125

ఇతరులు – 0

రైజ్ ఎగ్జిట్ పోల్ 

వైసీపీ 48 – 60

కూటమి 113 – 122

ఇతరులు – 0

స్మార్ట్ ఎగ్జిట్ పోల్ (AP Exit Polls Review 2024) 

వైసీపీ 93

కూటమి 82

ఇతరులు – 0

ప్రిజం ఎగ్జిట్ పోల్

వైసీపీ 60

కూటమి – 110

ఇతరులు – 0

జన్ మత్ పోల్స్

వైసీపీ 95 – 103

కూటమి 65 – 75

ఇతరులు – 0

SAN సర్వే

వైసీపీ – 48

కూటమి – 127

ఇతరులు – 0

పీపుల్స్ పల్స్ (AP Exit Polls Review 2024)

వైసీపీ 45 – 60

కూటమి 95 – 110

ఇతరులు – 0

పార్థ ఎగ్జిట్ పోల్స్ 

వైసీపీ 110 – 120

కూటమి 55 – 65

ఇతరులు – 0

పీటీఎస్ గ్రూప్ 

వైసీపీ 44 – 47

కూటమి 128 – 131

ఇతరులు – 0

పయనీర్ పోల్ స్ట్రాటజీస్

వైసీపీ 31

కూటమి – 144

ఇతరులు – 0

చాణక్య ఎక్స్ (AP Exit Polls Review 2024)

వైసీపీ – 47

కూటమి – 109

ఇతరులు – 0

AP లో లోక్ సభ ఎన్నికల యొక్క ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈ విధం గా ఉన్నాయి.AP Exit Polls Review 2024

TV9 పోల్ స్ట్రాట్ 

వైసీపీ – 13, కూటమి 12, ఇతరులు- 0

ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ 

వైసీపీ – 13 – 15, కూటమి 10 – 12, ఇతరులు – 0

CNN న్యూస్ 18

వైసీపీ 5 – 8, కూటమి 19 – 22, ఇతరులు – 0

ఇండియా టీవీ 

వైసీపీ 3 – 5, కూటమి 20 – 25 , ఇతరులు – 0

న్యూస్ ఎక్స్

వైసీపీ – 3, కూటమి – 22, ఇతరులు – 0

NDటీవీ ఎగ్జిట్ పోల్స్ 

వైసీపీ – 7, కూటమి – 18, ఇతరులు – 0

టుడేస్ చాణక్య 

వైసీపీ – 3, కూటమి – 22, ఇతరులు – 0

ఇండియా టుడే  – యాక్సిస్ మై ఇండియా (AP Exit Polls Review 2024) 

వైసీపీ 2 – 4, కూటమి 21 – 23, ఇతరులు – 0

ABP సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ 

వైసీపీ 0 – 4, కూటమి 21 – 25, ఇతరులు – 0

టైమ్స్ నౌ

వైసీపీ 13 – 15, కూటమి 10 – 12, ఇతరులు – 0

ఇండియా న్యూస్ – డీ డైనమిక్స్ 

వైసీపీ – 7, కూటమి – 24, ఇతరులు – 0

 

VIJAY NEWS DESK