AP Mega DSC Notification – కీలక నిర్ణయాలు ఆమోదించిన కేబినెట్
AP Mega DSC Notification – కీలక నిర్ణయాలు ఆమోదించిన కేబినెట్
ఉపాధ్యాయ నిరుద్యోగ యువత కు ఇది నిజం గా శుభవార్తే…. రాష్ట్రం లో ఖాళీ గా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలన్న కీలక నిర్ణయానికి ఏపీ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశం లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పటినుండో ఉపాధ్యాయ నిరుద్యోగులు ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీ నిర్వహించడానికి రాష్ట్ర మంత్రి మండలి హర్షాతిరేకాల మధ్య ఆమోదం తెలియ జేశారు. ఈ సమావేశం లో పలు నిర్ణయాలు తీసుకున్నారు.AP Mega DSC
మెగా డిఎస్సీ ప్రకటన AP Mega DSC
- 2024 డి ఎస్సీ ద్వారా పాఠశాల విద్యా శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ పరిధి లోని పాఠశాలల్లో 6,100 పోస్టుల భర్తీ కి మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. అర్హత 42 ఏళ్ళు, SC, ST, BC మైనారిటీ లకు 5 ఏళ్ల పరిమితి ని సడలింపు ఇవ్వడం జరిగింది. 185 సెంటర్లల లో 15 రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తారు. 8 రోజులు TET నిర్వహిస్తారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 14219 పోస్టులు విద్యా రంగం లోనే ఈ ప్రభుత్వం నియామకం చేసింది. 2022 లో టెట్ నిర్వహించారు. 2 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు మరొకసారి TET పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సారి TET మరియు డి ఎస్సీ పరీక్షలు వేర్వేరు గా నిర్వహిస్తారు. దీని కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తారు.AP Mega DSC
- అటవీ శాఖలో 689 పోస్టులు (ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తో సహా వివిధ పోస్టులు APPSC ద్వారా ) భర్తీ చేయడానికి ఆమోదం తెలియజేసింది.
- ఇప్పటికి 2 లక్షల 13 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసారు . ప్రస్తుతం మరొక 7 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 లక్షల 20 వేల ప్రభుత్వ ఉద్యోగాల ఇంత వరకూ ఇవ్వడం జరిగింది.
- ప్రతి గ్రామ పంచాయతీ కి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది
చేయూత కార్యక్రమం
- చేయూత కార్యక్రమం ద్వారా 45 – 60 సంవత్సరాల మహిళలకు 18750/- రూపాయలు చొప్పున నాల్గవ విడత ఈ నెల 16 నుండి నెలాఖరు లోపు 26,98,931 మందికి 5 వేల అరవై కోట్ల రూపాయలు అందజేయ బోతున్నారు. ఇప్పటివరకు 14 లక్షల మంది స్వయం సమృద్ధి సాధించారు. నెలకు 7 – 10 వేల రూపాయలు సంపాదించే స్థాయి కి చేరుకున్నారు. చిరు వ్యాపారులు గా మారారు. స్వయం సమృద్ధి ని సాధించారు. ఈ పథకం మొదట ఆగస్టు 12, 2020 న ప్రారంభించారు. 24 లక్షల 11 మందికి 4500.2 కోట్ల రూపాయలు పంపిణీ చేసారు. మొత్తం మీద 19, 188 కోట్ల రూపాయలు ఇప్పటికే పంపిణీ చేసారు.
విద్యా విప్లవం
- విద్యా విప్లవం లో భాగం గా SCERT లోనికి ఐ.బీ భాగస్వామ్యం ఏర్పాటు కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.ఐ బీ విద్య అనేది కేవలం శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదవ గలిగే విద్య. జపాన్, దక్షిణ కొరియా లలో ఉన్న విద్యా విధానం. 7 లక్షల నుండి 36 లక్షల రూపాయలు చెల్లిస్తున్న విద్య. అందని ద్రాక్ష గా ఉన్న ఐ.బీ ని ప్రభుత్వ బడుల లోనికి అందుబాటు లోనికి తీసుకు వస్తున్నారు. దీనికి సంబంధించిన శిక్షణ కూడా ఏర్పాటు చేస్తారు. సామర్ధ్యం, నైపుణ్యాల పెంపు కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఏర్పాటు చేస్తారు.ఈ విధానం లో చదువు ప్రారంభించిన విద్యార్దులు 2035 నాటికి పదవ తరగతి, ప్లస్ టూ కి చేరుకుంటారు. అంతర్జాతీయ స్థాయి విద్య అందించడం ముఖ్య లక్ష్యం గా ఈ కార్యక్రమానికి మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది.
- అన్ని విశ్వ విద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుండి 62 ఏళ్ళకు పెంచడానికి ఆమోదం తెలియజేసింది.
- ఏపీ డిస్కం లకు 1500 కోట్ల రుణాలకు గ్యారంటీ ఇస్తూ మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది.
- మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇళ్ళకు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి 89.9 కోట్ల రూపాయల తో డిస్కం ప్రతిపాదనలకు ఆమోదం తెలియ జేసింది. 15 వందల మెగా వాట్ల సౌర విద్యుత్ తయారీ కి గ్రీన్ కో కంపెనీ కి అనుమతి ఇచ్చింది.
- నంద్యాల జిల్లా గుడివేముల మండలం 1272.7 ఎకరాలు, మిడ్తూరు మండలం మాసాపేట సాగలూటి గ్రామం లో 1011.4 ఎకరాలు , కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లో ఉయ్యాలవాడ లో భూములు గుర్తించి వారికి కేటాయిస్తారు. 3350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు లను ఏర్పాటు చేయాలన్న JSW నియో లిమిటెడ్
- వైఎస్సార్ జిల్లా చక్రాయ పేట వద్ద 400 ఎకరాలు, సత్యసాయి జిల్లలో 1150 మెగా వాట్లు, అనంత పురం జిల్లా కనగానపాడు రాప్తాడు వద్ద 1050 మెగావాట్లు, అనంత పురం జిల్లలో 850 మెగా వాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి 12, 065 కోట్లు పెట్టుబడి పెట్ట డానికి JSW నియో లిమిటెడ్ ముందుకు వచ్చింది. దీని ద్వారా ప్రత్యక్షం గా 3 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి.
- నంద్యాల జిల్లా అవుకు మండలం ,కర్నూలు జిల్లా జల దుర్గం దగ్గర రెండు విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని 171.6 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి JSW కి అనుమతి లభించింది.
- సత్యసాయి మండలం తలుపుల లో వెయ్యి మెగా వాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు కు ఆమోదం
- కర్నూలు జిల్లా ఆస్పరి వద్ద రెండు వందల మెగా వాట్ల సోలార్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి అనుమతులు మంజూరు చేసింది.
- 4 వ స్టేట్ ఫైనాన్స్ కమిటీ రిపోర్ట్ కి మంత్రి మండలి ఆమోదం
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లైఫ్ ఇన్స్యురెన్స్ ఫండ్ ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం
- చట్ట సభల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు అసెంబ్లీ ప్రాంగణం లో ఏపీ లెజిస్లేచర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేటివ్ స్టడీ సంస్థ ఏర్పాటు కు ఆమోదం.
- ఏపీ లో లెజిస్లేటివ్ పోస్టుల భర్తీ కి ఆమోదం
- ఏపీ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ 1987 సవరణ కు మంత్రి మండలి ఆమోదం
- పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టు పరిధి లో 5376 నిర్వాసిత కుటుంబాలకు ఆర్ ఆర్ ప్యాకేజీ క్రింద ఇళ్ళ పట్టాలకు సంబంధించిన స్టాంప్ డ్యూటి 52 కోట్ల ను మినహాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం.
- ప్రముఖ చెస్ క్రీడా కారిణి కుమారి కోలగట్ల మీనాక్షి కి పెందుర్తి మండలం చిన ముషిడివాడ లో 500 గజాల స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం
- టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని కి పెందుర్తి మండలం లోని చిన ముషిడి వాడ లో 1000 గజాల నివాస స్థలాన్ని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
వీటితో పాటు పలు నిర్ణయాలకు ఏపీ కాబినెట్ ఆమోదం తెలిపింది.