January 10, 2025

AP TET 2024 Notification – Important Dates – ముఖ్యమైన తేదీలు ఇవే

ఎట్టకేలకు AP TET 2024 నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ పరీక్షల నిర్వహణ కు సంబందించిన ముఖ్యమైన తేదీలను (షెడ్యూల్) విడుదల చేసారు.

AP TET 2024 Notification

AP TET DSC Notification

AP TET 2024 Notification విడుదల – ముఖ్యమైన తేదీలు ఇవే…

ఎట్టకేలకు AP TET 2024 నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ పరీక్షల నిర్వహణ కు సంబందించిన ముఖ్యమైన తేదీలను (షెడ్యూల్) విడుదల చేసారు. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పరీక్ష నోటిఫికేషన్ విడుదల, ఆన్ లైన్ లో ఎప్పుడు అప్లయి చేసుకోవాలి, పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు, కీ ఎప్పుడు విడుదల చేస్తారు, ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు అనే వివరాలు ఇలా ఉన్నాయి.(AP TET 2024 Notification)

TET నోటిఫికేషన్ విడుదల  – 08 – 02 – 2024

పేమెంట్ గేట్ వే ద్వారా ఫీజు చెల్లించే సమయం – 08-02-2024 నుండి 17-02-2024 వరకు 

అప్లికేషన్ ఆన్ లైన్ లో సమర్పించడానికి సమయం  08-02-2024 నుండి 18-02-2024 వరకు 

ఆన్ లైన్ లో మాక్ టెస్టు అందుబాటులో ఉండే తేదీ : 19-02-2024 నుండి 

హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకొనే తేదీ : 23-02-2024 నుండి 

పరీక్షలు జరిగే తేదీలు :(Paper I-A, Paper I-B మరియు Paper II-A, Paper II-B) : 27-02-2024 నుండి 09-03-2024 వరకు జరుగుతాయి. రెండు సెషన్లు గా ఈ పరీక్షలు జరుగుతాయి. సెషన్ -1 ఉదయం 09-30 AM నుండి  మద్యాహ్నం 12-00 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 02-30 PM నుండి సాయంత్రం 5PM గంటల వరకు 

ప్రాధమిక కీ విడుదల చేసే తేదీ : 10-03-2024

ఏవైనా అభ్యంతరాలు తెలియజేసే తేదీ : 11-03-2024

ఫైనల్ కీ విడుదల చేసే తేదీ : 13-03-2024

ఫలితాలు ప్రకటించే తేదీ : 14-03-2024

పైన ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలను నిర్వహిస్తారు. అంటే దాదాపు నెల రోజులలో పరీక్షల నిర్వహణ పూర్తి అవుతుంది.

DSC పరీక్షల షెడ్యూల్ వివరాలు :

AP TET 2024 Notification
AP TET 2024 Notification released

DSC నోటిఫికేషన్ ఫిబ్రవరి 12 నుండి అందుబాటు లో ఉంటుంది. అప్పటినుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

అప్లయి చేసుకోవడానికి చివరి తేదీ : ఫిబ్రవరి 22

హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకొనే తేదీ : మార్చి 5

DSC పరీక్షలు నిర్వహించే తేదీలు : మార్చి 15 నుండి మార్చి 30 వ తేదీ వరకు 

ఈ పరీక్షలు TET పరీక్షల మాదిరి గానే రెండు సెషన్ల లో జరుగుతాయి. 

ప్రాధమిక కీ విడుదల చేసే తేదీ : మార్చి 31

అభ్యంతరాలు ఉంటే తెలియ జేసే తేదీ : ఏప్రిల్ – 1

ఫైనల్ కీ విడుదల చేసే తేదీ : ఏప్రిల్ 2

ఫలితాలు ప్రకటించే తేదీ : ఏప్రిల్ 7

ఈ వివరాలు అన్నింటిని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖా మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ విడుదల చేసారు. ఈ మెగా డిఎస్సీ లో భర్తీ చేయబోతున్న పోస్టుల వివరాలు కూడా ప్రకటించారు. 2269 స్కూల్ అసిస్టెంట్ లు, 2280 SGT పోస్టులు, 1264 TTG పోస్టులు, 215 PGT పోస్టులు, 42 Principal పోస్టులు మొత్తం కలిపి 6100 పోస్టులను భర్తీ చేస్తారు.