January 10, 2025

Beware of SBI Reward Points Scam | SBI రివార్డ్ పాయింట్స్ స్కాం

సైబర్ నేరగాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలతో ప్రజలను బోల్తా కొట్టిస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ అప్రమత్తం గా ఉండటం అవసరం.

Beware of SBI Reward Points Scam

SBI Reward Points Scam - మోసపోకండి

Beware of SBI Reward Points Scam | SBI రివార్డ్ పాయింట్స్ స్కాం

సరిక్రొత్త స్కాం ఇప్పుడు వెలుగు లోనికి వచ్చింది. ఆన్ లైన్ లో ఇప్పటివరకు అనేక పద్దతులలో మోసాలు చేస్తున్నారు. పట్టణాలలోనే కాదు ఇప్పుడు పల్లెల్లోనూ స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. బాగా చదువుకున్న వారితో పాటు అంతగా చదువుకోని వారు కూడా చాలా సులువు గా స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తున్నారు. ఐదు పది రూపాయలు కూడా స్మార్ట్ ఫోన్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. రోడ్డు పక్కన ఉండే చిన్న దుకాణాల నుండి అతి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు డిజిటల్ చెల్లింపులు ద్వారానే లావాదేవీలు జరుపు కొంటున్నాయి.Beware of SBI Reward Points Scam

అనేక సైబర్ నేరాలు జరుగుతున్నాయి

సరిగ్గా ఇటువంటి పరిస్థితి నే ఉపయోగించుకొని సైబర్ నేరాలు కూడా బాగా పెరిగి పోతున్నాయి. ఈ సైబర్ మోసాలకు చదువుకున్న వారితో పాటు అందరూ బలి అవుతున్నారు. స్మార్ట్ ఫోన్ పై అవగాహన లేని వారు మోసపోయారంటే అర్ధం ఉంది… బాగా చదువుకున్న వారు, సమాజం లో ఉన్నత స్థితి లో ఉన్న వారు, కొందరు ప్రజా ప్రతినిధులు సైతం ఈ సైబర్ నేరగాళ్ళ మోసాలకు బలి పోతున్నారు. కష్టపడి సంపాదించిన లక్షలాది రూపాయలు దోపిడీ కి గురౌతుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి లో ఉండిపోతున్నారు. ఎప్పటికప్పుడు ఈ సైబర్ నేరగాళ్ళు తమ పంధా ను మార్చుకుంటున్నారు. కొత్త కొత్త పద్ధతులలో బురిడీ కొట్టిస్తున్నారు. తక్కువ ధరకు వస్తువులు లేదా దుస్తులు వస్తాయని లింకులు పంపడం, తద్వారా ఆ లింకు క్లిక్ చేసిన మరుక్షణం వాటి ఖాతా లో ఉన్న సొమ్ము మొత్తం ఖాళీ అయిపోవడం వంటి నేరాలు దాదాపు ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం.

SBI రివార్డు పాయింట్స్ స్కాం ఏమిటంటే….

ఇప్పుడు సరిక్రొత్తగా SBI రివార్డు పాయింట్స్ స్కాం వెలుగు చూ సింది. “మీ SBI బ్యాంకు లో మీకు కొన్ని రివార్డు పాయింట్స్ ఉన్నాయి. దాదాపు 7 వేల రూపాయలు మీరు విడిపించు కోవాలి అంటే క్రింది లింకు పైన క్లిక్ చేయండి. SBI రివార్డు అప్లికేషన్ మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని డబ్బు మీ అకౌంట్ లో జమ చేసుకోండి. ఈ రోజు మీరు విడిపించు కోక పోతే ఇక డబ్బు expire అవుతుంది కాబట్టి వెంటనే అప్లికేషన్ install చేసుకోండి  ” అంటూ ఒక APK తో కూడిన  మెసేజ్ పంపిస్తున్నారు. ఆ మెసేజ్ క్లిక్ చేసి దానిలో ఇచ్చిన app లింకు ని install చేసుకోగానే మన ఖాతా లో ఉన్న సొమ్ము మొత్తం ఖాళీ అయిపోతోంది. app ని install చేసుకొనేటప్పుడు dp పూర్తిగా SBI లోగో కి మారిపోవడం తో ఇది నిజమైన లింకే అని భ్రమ పడుతున్నారు.(Beware of SBI Reward Points Scam)

ఫోన్ లో app ని install చేసుకున్న వెంటనే మన ఫోన్ లో ఉన్న వివిధ గ్రూపులకు కూడా ఇటువంటి సందేశాలు మన ప్రమేయం లేకుండానే వెళ్ళిపోతున్నాయి. ఆ మెసేజ్ లు తెలిసిన వాళ్ళే పంపారు కదా అని క్లిక్ చేయడం తో వాళ్ళ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి.

పోలీసు శాఖ కూడా హెచ్చరిస్తోంది…(Beware of SBI Reward Points Scam)

కాబట్టి ఇటువంటి లింకుల పట్ల జాగ్రత్త గా ఉండాలని పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇటువంటి మెసేజ్ ల పట్ల జాగ్రత్త గా ఉండాలి అని ట్వీట్ చేసింది. స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని వచ్చిన ప్రతి లింకు క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇటువంటి స్కాం ల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంకులకు సంబంధించిన ఎటువంటి లావా దేవీలైనా నేరుగా బ్యాంకు కు వెళ్లి పరిష్కరించు కోవడం మంచిది. ఇలా వచ్చిన లింకులు క్లిక్ చేయకపోవడమే మంచిది. మెసేజ్ రూపం లో గాని, వాట్సాప్ మెసేజ్ రూపం లో గాని, మెయిల్ కి గాని వచ్చే ఎటువంటి లింక్ క్లిక్ చేయకుండా ఉంటే ఇటువంటి స్కాం ల బారిన పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది.

సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలి…

సైబర్ నేరగాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలతో ప్రజలను బోల్తా కొట్టిస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ అప్రమత్తం గా ఉండటం అవసరం. తమ ప్రధానమైన బ్యాంకు అకౌంట్ లను డిజిటల్ పేమెంట్ అప్లికేషన్ లకు అనుసంధానం చేసుకోక పోవడం కూడా ప్రస్తుతం అవసరం. వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల వారు ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏమైనప్పటికీ ప్రస్తుత డిజిటల్ కాలం లో అనుక్షణం అప్రమత్తం గా ఉండాలి.(Beware of SBI Reward Points Scam)

-విజయ్ న్యూస్ డెస్క్ తెలుగు