Bharat Ratna Awardees List in Telugu – భారత రత్న అవార్డు పొందిన వారి జాబితా
భారత దేశం లో అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ . ఈ అవార్డులను మొదటిసారిగా 2 జనవరి , 1954 న ఏర్పాటు చేసారు. దేశం లో విశిష్ట సేవలు అందించిన వారికి ప్రభుత్వం ప్రకటించే అత్యున్నత పురస్కారం ఇది. ఇప్పటివరకూ ఈ అవార్డులు పొందిన వారి జాబితా మరియు వివరాలు ఈ వ్యాసం లో ఇవ్వబడ్డాయి.
భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న – అవార్డులు పొందిన వారి యొక్క వివరాలు : Bharat Ratna Awardees List
భారత దేశం లో అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ . ఈ అవార్డులను మొదటిసారిగా 2 జనవరి , 1954 న ఏర్పాటు చేసారు. దేశం లో విశిష్ట సేవలు అందించిన వారికి ప్రభుత్వం ప్రకటించే అత్యున్నత పురస్కారం ఇది. ఇప్పటివరకూ ఈ అవార్డులు పొందిన వారి జాబితా మరియు వివరాలు ఈ వ్యాసం లో ఇవ్వబడ్డాయి. Bharat Ratna Awardees List
దాదాపు ప్రతి సంవత్సరం ఈ అవార్డులను ప్రకటించేవారు. కానీ జనతా పార్టీ అధికారం లో ఉన్నపుడు ఈ అవార్డులను రద్దు చేసారు. సుభాష్ చంద్రబోస్ కు ప్రకటించిన భారత రత్న అవార్డు ను మాత్రం ప్రకటించిన తర్వాత తిరిగి వెనక్కి తీసుకున్నారు. ఆయన మరణం ఇప్పటికీ వివాదం లో ఉన్నందువలన ఈ అవార్డును వెనక్కి తీసుకున్నారు.
ఇద్దరు విదేశీయులకు కూడా ఈ అవార్డును ప్రకటించారు. సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1987లో ఈ అవార్డు పొందారు. అలాగే నెల్సన్ మండేలా 1990 లో ఈ అవార్డును పొందారు. అతి తక్కువ వయసు లో ఈ అవార్డును పొందిన వారు సచిన్ టెండూల్కర్, అతి ఎక్కువ వయసులో ఈ అవార్డును పొందిన వారు దొండో కేశవ కార్వే 100 ఏళ్ళ వయసు లో ఈ అవార్డు అందుకున్నారు.
భారత రత్న అవార్డు పొందిన వారు రాజ్యాంగ పరం గా 7 వ స్థాయి గౌరవం పొందిన వారు అవుతారు. ఈ అవార్డు పొందిన వారికి ఒక సనద్ (సర్టిఫికేట్) మరియు ప్రెసిడెంట్ మెడల్ ప్రధానం చేస్తారు. డబ్బు రూపం లో ఎటువంటి బహుమతి ప్రధానం చెయ్యరు.
ఇప్పటివరకు భారత రత్న అవార్డు పొందిన వారి యొక్క వివరాలు:Bharat Ratna Awardees List
భారత రత్న 1954:
- సి. రాజగోపాలాచారి : స్వాతంత్ర సమరం లో చురుగ్గా పాల్గొన్న వారు , ప్రముఖ లాయర్
- సర్వేపల్లి రాధాకృష్ణన్ : భారత దేశపు మొదటి ఉప రాష్ట్రపతి గా (1952-62)వరకు పనిచేసారు. భారత దేశపు రెండవ రాష్ట్రపతి గా (1962-67) పని చేసారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టిన రోజును (సెప్టెంబర్ -5) భారత దేశమంతటా ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపు కుంటారు.
- సర్ సి.వి. రామన్ : రామన్ ఎఫెక్ట్ అనే ప్రక్రియను కనుగొన్నారు. 1930 వ సంవత్సరం లో ప్రఖ్యాత నోబెల్ పురస్కారాన్ని పొందారు. ఈయన ప్రఖ్యాత అణు భౌతిక శాస్త్రవేత్త . ఎలెక్ట్రో మాగ్నేటిజం పై కూడా పరిశోధనలు చేసారు.
భారత రత్న అవార్డులు – 1955
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య : ప్రఖ్యాత సివిల్ ఇంజనీర్. అయన జన్మదినమైన సెప్టెంబర్ 15 వ తేదీని భారత దేశమంతటా ‘ఇంజనీర్స్ డే’ గా జరుపు కుంటారు. దివాన్ ఆఫ్ మైసూర్ (1912 -18) గా ఉన్నారు.
- భగవాన్ దాస్ : స్వాతంత్ర సమరం లో పాల్గొన్నారు. విద్యావేత్త, తత్వవేత్త , మహాత్మా గాంధి కాశి విద్యాపీటం వ్యవస్థాపకులలో ఒకరు.
- జవహర్ లాల్ నెహ్రూ : భారత దేశపు మొదటి ప్రధాన మంత్రి. దాదాపు 17 సంవత్సరాల పాటు ((1947 – 64) భారత దేశ ప్రధాన మంత్రి గా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తి . ఈ అవార్డు ప్రకటించ బడే నాటికి ప్రధాన మంత్రి గా ఉన్నారు.
భారత రత్న అవార్డులు – 1957
- గోవింద వల్లబ్ పంత్ : స్వాతంత్ర సమరం లో పనిచేసారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గా (1950 – 54) వరకు పనిచేసారు. అలాగే 1955 నుండి 1961 వరకు కేంద్ర హోం శాఖా మంత్రి గా పనిచేసారు.
భారత రత్న అవార్డులు – 1958
- దొండో కేశవ్ కార్వే : ఈయన ఒక విద్యావేత్త, సంఘ సంస్కర్త. హిందూ వితంతు పునర్వివాహం, మరియు మహిళా విద్య అనే అంశాలపై తీవ్రం గా కృషి చేసారు. శ్రీమతి నాతి బాయి దామోదర్ థాకరే మహిళా విశ్వ విద్యాలయాన్ని 1916 లోనే ఏర్పాటు చేసారు. ఎక్కువ వయసు లో ఈ అవార్డు అందుకున్న వారిగా గుర్తింపు పొందారు. (Bharat Ratna Awardees List)
భారత రత్న అవార్డులు – 1961
- బిదాన్ చంద్ర రాయ్ : ఈయన ఒక విద్యావేత్త, వైద్యుడు, సామాజిక కార్యకర్త, దాతృత్వం కలిగిన వారు మరియు రాజకీయ నాయకుడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క రెండవ ముఖ్యమంత్రి గా (1948 – 62) పనిచేసారు. ఆయన జన్మదినం అయిన జూలై 1 వ తేదీ ని జాతీయ వైద్యుల దినోత్సవం (National Doctors’ Day) గా దేశమంతటా జరుపుకొంటారు.
- పురుషోత్తం దాస్ టాండన్ -Purushottam Das Tandon: రాజర్షి గా పేరు పొందారు. యునైటెడ్ ప్రావిన్సెస్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కి ((1937 – 50) స్పీకర్ గా పనిచేసారు.
భారత రత్న అవార్డులు – 1962
- బాబూ రాజేంద్ర ప్రసాద్ : Babu Rajendra Prasad : భారత దేశ మొదటి రాష్ట్రపతి గా (1950 – 62) గా సేవలు అందించారు. సహాయ నిరాకరణోద్యమం లో మహాత్మా గాంధీ తో కలిసి పనిచేసారు. రాజనీతిజ్ఞుడు, లాయర్ , గొప్ప పండితుడు గా పేరు గాంచారు.
భారత రత్న అవార్డులు – 1963
- పాండురంగ వామన్ కానే : ప్రముఖ భారతీయ చరిత్ర కారుడు, సంస్కృత పండితుడు. మహారాష్ట్ర కు చెందిన వారు. హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర అనే గ్రంధాన్ని రచించారు. ఈయనకు మహోపాధ్యాయ అనే బిరుదు ఉంది.
- జాకీర్ హుస్సేన్ : భారత దేశపు మూడవ రాష్ట్రపతి (1967 – 69) గా పనిచేసారు. రెండవ ఉపరాష్ట్రపతి గా (1962 – 67) వరకు ఉన్నారు. 1957 నుండి 1962 వరకు బీహార్ గవర్నర్ గా ఉన్నారు. 1948 నుండి 1956 వరకు ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ కి వైస్ చాన్సలర్ గా పనిచేసారు. ఆర్దిక వేత్త, విద్యావేత్త మరియు తత్వవేత్త గా పేరు పొందారు. (Bharat Ratna Awardees List)
భారత రత్న అవార్డులు – 1966
- లాల్ బహదూర్ శాస్త్రి : భారత దేశపు రెండవ ప్రధాన మంత్రి గా (1964-66) పనిచేసారు. జై జవాన్, జై కిసాన్ నినాదాన్ని ఇచ్చారు. పాకిస్తాన్ తో జరిగిన యుద్ధం లో ముందుండి విజయపథం లో నడిపించారు.
భారత రత్న అవార్డులు – 1971 (Bharat Ratna Awardees List)
- ఇందిరా గాంధి : భారత దేశ ప్రధాన మంత్రి గా దాదాపు 15 సంవత్సరాల 350 రోజుల పాటు పనిచేసారు (1966-77) (1980-84). ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా గా పేరు పొందారు. భారత దేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి. ప్రధాని పదవిలో ఉండగానే హత్యకు గురయ్యారు.
భారత రత్న అవార్డులు – 1975
- వి.వి. గిరి : భారత దేశపు నాల్గవ రాష్ట్రపతి గా (1969 – 74) పనిచేసారు . స్వాతంత్ర పోరాటం లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్, కేరళ, మైసూర్ రాష్ట్రాల గవర్నర్ గా పనిచేసారు.
భారత రత్న అవార్డులు – 1976
- కుమారస్వామి కామరాజ్ (కే. కామరాజ్): భారత రాజకీయాలలో కింగ్ మేకర్ గా ప్రసిద్ది చెందారు. తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా మూడు పర్యాయాలు పనిచేసారు. 1954-57 వరకు మొదటి సారి, 1957-62 వరకు రెండవసారి, 1962 – 63 వరకు మూడవ సారి ముఖ్యమంత్రి గా ఉన్నారు.(Bharat Ratna Awardees List)
భారత రత్న అవార్డులు – 1980
- మథర్ థెరీసా : మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థను కలకత్తా లో స్థాపించారు. పేదలకు కుష్టు రోగులకు సేవలను అందించారు. మానవతావాది గా ఆమె అందించిన సేవలకు గుర్తింపు గా 1979 లో ఆమెకు నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. బ్లెస్సెడ్ తెరెసా ఆఫ్ కలకత్తా అనే బిరుదు పొందారు.
భారత రత్న అవార్డులు – 1983
- వినోభా భావే : భూ దాన ఉద్యమాన్ని నిర్వహించారు. మహాత్మా గాంధీ కి ముఖ్య అనుచరుడు గా స్వాతంత్ర పోరాటం లో పాల్గొన్నారు. ఆచార్య అనే బిరుదు పొందారు. మానవతావాదిగా ఆయన చేసిన సేవలకు గుర్తింపు గా రామన్ మెగసెసే అవార్డు (1958) పొందారు.
భారత రత్న అవార్డులు – 1987
- ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ : ఈయన సరిహద్దు గాంధీ గా గుర్తింపు పొందారు. పాకిస్తాన్ కు చెందిన నాయకుడు. ఖిలాఫత్ ఉద్యమం లో (1929) ఎర్ర చొక్కాల ఉద్యమం లో పాల్గొన్నారు. భారత రత్న అవార్డు పొందిన తొలి విదేశీయుడు ఈయనే.
భారత రత్న అవార్డులు – 1988
- ఎం.జి. రామచంద్రన్ : మూడు పర్యాయాలు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గా పనిచేసారు. 1977-80లో మొదటి విడత , 1980 – 84 లో రెండవ విడత , 1985 – 87 లో మూడవ విడత ముఖ్యమంత్రి గా సేవలు అందించారు. సినిమా నటుడి గా జీవితాన్ని ప్రారంభించి రాజకీయాలలోనికి వచ్చారు.
భారత రత్న అవార్డులు – 1990
- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ : భారత రాజ్యాంగ పితామహునిగా పేరు గాంచారు. భారత రాజ్యంగ రచన లో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. సాంఘిక సంస్కర్త , విద్యావేత్త. దేశం లోని అంటరాని వారి కోసం నిరంతరం పోరాటం చేసారు. మొదటి న్యాయ శాఖా మంత్రి గా సేవలు అందించారు.
- నెల్సన్ మండేలా : దక్షిణాఫ్రికా లో వర్ణ వివక్ష కు వ్యతిరేకం గా పోరాడిన నాయకుడు. దక్షిణాఫ్రికా అద్యక్షుడి గా (1994-99) మద్య పనిచేసారు. ప్రజాస్వామ్య బద్దం గా ఎన్నికైన అద్యక్షుడు. దక్షిణాఫ్రికా గాంధీ గా ప్రసిద్ది చెందారు . భారత రత్న అవార్డు అందుకున్న రెండవ విదేశీయుడు నెల్సన్ మండేలా.
భారత రత్న అవార్డులు – 1991
- రాజీవ్ గాంధీ : భారత దేశ తొమ్మిదవ ప్రధాన మంత్రి గా సేవలు అందించారు. 1984 – 89 మధ్య ప్రధాన మంత్రి గా ఉన్నారు. 1991 లో ఆత్మాహుతి దళాల దాడి లో ప్రాణాలు కోల్పోయారు.
- సర్దార్ వల్లభాయ్ పటేల్ : భారత దేశపు మొదటి ఉప ప్రధాన మంత్రి ((1947 – 50) . ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా ప్రసిద్ధి చెందారు. స్వదేశీ సంస్థానాలను విలీనం చేయడం లో కీలక పాత్ర పోషించారు.
- మొరార్జీ దేశాయ్ : భారత దేశపు ఆరవ ప్రధాన మంత్రి గా (1977-79) సేవలు అందించారు. పాకిస్తాన్ ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర పురస్కారం నిషాన్ – ఏ – పాకిస్తాన్ పొందిన ఏకైన భారతీయుడు.
భారత రత్న అవార్డులు – 1992
- అబుల్ కలాం ఆజాద్ : భారత దేశపు మొదటి విద్యా శాఖా మంత్రి గా పనిచేసారు. ఉచిత ప్రాధమిక విద్య కోసం పనిచేసారు. ఆయన జన్మ దినం అయిన నవంబర్ 11 వ తేదీ ని జాతీయ విద్యా దినోత్సవం గా జరుపు తున్నారు.
- జే.ఆర్.డి టాటా : పారిశ్రామిక వేత్త, ఎయిర్ ఇండియా వ్యవస్తాపకుడు. టాటా మోటార్స్, టి సి ఎస్ వంటి అనేక సంస్థలను ఏర్పాటు చేసారు. భారత దేశం లో మొదటి పైలట్ లైసెన్స్ పొందిన వ్యక్తి .
- సత్యజిత్ రే: భారతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకు వచ్చిన దర్శకుడు. 1984 వ సంవత్సరం లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది.
భారత రత్న అవార్డులు – 1997
- గుల్జారీ లాల్ నందా : రెండు పర్యాయాలు తాత్కాలిక ప్రధాన మంత్రి గా బాధ్యతలు చేపట్టిన అరుదైన ఘనత ఈయన సొంతం . 1964, 1966 లో రెండు సార్లు తాత్కాలిక ప్రధాని గా ఉన్నారు.
- అరుణా ఆసఫ్ అలీ : క్విట్ ఇండియా ఉద్యమం లో ముంబయ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 1958 డిల్లీ కి మొదటి మేయర్ గా బాధ్యతలు చేపట్టారు.
- ఏ.పీ.జే. అబ్దుల్ కలాం : భారత దేశపు 11 వ రాష్ట్రపతి గా సేవలు అందించారు. రక్షణ రంగం లో గొప్ప శాస్త్ర వేత్త. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైళ్ళ తయారీ లో కీలక పాత్ర పోషించారు. ఇండియన్ మిస్సైల్ మ్యాన్ గా ప్రసిద్ధి చెందారు. పోఖ్రాన్ అణు పరీక్షలలో కీలక పాత్ర పోషించారు.
భారత రత్న అవార్డులు – 1998
- ఎమ్మెస్ సుబ్బు లక్ష్మి : కర్నాటక సంగీత విద్వాంసురాలు . దేశం లో రామన్ మెగసెసే అవార్డు అందుకున్న మొదటి సంగీత విద్వాంసురాలు .
- చిదంబరం సుబ్రమణియం: 1964-66 మధ్య భారత వ్యవసాయ మంత్రి గా హరిత విప్లవం లో కీలక పాత్ర పోషించారు.
భారత రత్న అవార్డులు – 1999
- అమర్త్యా సేన్ : ఆర్ధిక శాస్త్రం లో నోబెల్ బహుమతి పొందిన ప్రపంచ ప్రసిద్ద ఆర్దిక శాస్త్రవేత్త . ఆర్దిక పరమైన అనేక అంశాలపై కీలక పరిశోధనలు చేసారు.
- జయప్రకాష్ నారాయణ్ : లోక్ నాయక్ గా ప్రసిద్ధి గాంచారు. కాంగ్రెస్ ప్రభుత్వ అస్థిర విధానాలపై పోరాటం చేసారు. ఆయన చేసిన పోరాటం జేపీ మూమెంట్ గా ప్రసిద్ది గాంచింది. సంపూర్ణ విప్లవానికి పిలుపు నిచ్చారు. స్వాతంత్ర సమర యోధుడు
- గోపీనాద్ బోర్దో లాయ్: అస్సాం రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి . పటేల్ తో కలిసి పనిచేసారు. అస్సాం లోని కొన్ని భాగాలు తూర్పు పాకిస్తాన్ లో కలిసిపోకుండా అస్సాం ను ఐక్యం గా ఉంచడం లో కీలక పాత్ర పోషించారు.
- రవి శంకర్ : నాలుగు గ్రామీ అవార్డులు గెలిచిన సితార్ విద్వాంసుడు. పాశ్చాత్య సంగీత కారులతో కలిసి సంగీతం సృష్టించారు.
భారత రత్న అవార్డులు – 2001
- లతా మంగేష్కర్ : 36 బాషలలో పాటలు పాడిన ప్రసిద్ధ గాయని. నైటింగేల్ ఆఫ్ ఇండియా గా ప్రసిద్ది చెందారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా పొందారు.
- బిస్మిల్లా ఖాన్ : హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం లో షెహనాయి విద్వాంసుడు. దాదాపు ఎనిమిది దశాబ్దాలు ఈ సంగీత పరికరం పై సంగీతాన్ని సృష్టించారు. భారత సంగీతం లో షెహనాయి కి గుర్తింపు తీసుకు వచ్చారు.
భారత రత్నఅవార్డులు – 2009
- భీం సేన్ జోషి : హిందుస్తానీ శాస్తీయ సంగీత కళాకారుడు , గాయకుడు. భక్తిరస ప్రధానమైన పాటలు, ఖయాల్ గానాలకు ప్రసిద్ధి.
భారత రత్న అవార్డులు – 2014
- సి.ఎన్.ఆర్ రావు : రసాయన శాస్త్రవేత్త . దాదాపు 63 యూనివర్సిటీ ల నుండి డాక్టరేట్ లు పొందారు. 48 పుస్తకాలు రచించారు. 1600 కు పైగా పరిశోధనా పత్రాలు సమర్పించారు.
- సచిన్ టెండూల్కర్ : రెండు దశాబ్దాల పాటు తన క్రికెట్ ఆట తో ఉర్రూత లూగించారు. చిన్న వయసు లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించి క్రికెట్ లో అనేక రికార్డులను నెలకొల్పారు. గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ గా అభిమానులకు సుపరిచితులు
భారత రత్నఅవార్డులు – 2015
- మదన్ మోహన్ మాలవీయ : అఖిల భారతీయ హిందూ మహా సభ వ్యవస్థాపకులు. బనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపకులు. విద్యా సంస్కరణలు అమలు చేసిన పండితుడు.
- అటల్ బిహారీ వాజ్ పేయి : మూడు విడతలు భారత దేశ ప్రధాన మంత్రి గా పనిచేసారు. బెస్ట్ పార్లమెంటేరియన్ గా అవార్డులు పొందారు. తొమ్మిది సార్లు లోక్ సభ కు ఎన్నికయ్యారు . రెండు సార్లు రాజ్య సభకు ఎన్నిక అయ్యారు.
భారత రత్న అవార్డులు – 2019
- ప్రణబ్ ముఖర్జీ : 13 వ భారత రాష్ట్రపతి గా సేవలు అందించారు.
- నానాజీ దేశ్ ముఖ్ : సాంఘిక సంస్కర్త. విద్య ఆరోగ్య రంగాలలో కృషి చేసారు. మొదటి సరస్వతి శిశు మందిర్ ను గోరక్ పూర్ లో ప్రారంభించారు. పద్మ విభూషణ్ అవార్డు లభించింది.
- భూపేన్ హజారికా : అస్సాం కు చెందిన గాయకుడు, పాటల రచయిత, సంగీత కారుడు, కవి, సినిమా ప్రపంచం లో గుర్తింపు పొందారు. అనేక అవార్డులు పొందారు. జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు (1975), పద్మశ్రీ (1977), సంగీత నాటక అకాడమీ అవార్డు (1987), దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు (1992) పద్మ భూషణ్ (2001), భారత రత్న (2019)
భారత రత్న అవార్డులు – 2024
- కర్పూరీ ఠాకూర్ :
- లాల్ కృష్ణ అద్వానీ :
- పీ.వీ నరసింహా రావు
- చౌదరీ చరణ్ సింగ్
- డాక్టర్ ఎం.ఎస్. స్వామి నాధన్