January 10, 2025

Bifurcation of erstwhile AP-Congress Party చేసిన గాయం ఇంకా మానలేదు..

samaikhandhra movement- bifurcation of erstwhile ap

విద్యార్ధులు సైతం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసారు.

ఆ గాయం ఇంకా మానలేదు…

ఆ గాయం ఇంకా మానలేదు… పదేళ్ళ క్రితం అయిన గాయం ఇంకా తగ్గు ముఖం పట్టలేదు… రాజకీయాలలో ప్రజలకు మతి మరుపు ఎక్కువే.. రాజకీయ నాయకులు చెప్పింది చెయ్యకపోయినా ప్రజలు సులువు గా మర్చి పోతారు… లేదా క్షమించేస్తారు… కానీ ఈ గాయం మనసుకు సంబంధించినది… మనో భావాలకు సంబంధించినది… తమ అస్థిత్వానికి సంబంధించినది…తమ ఆనందాలకు సంబంధించినది…. తమ కన్నీళ్ళకు సంబంధించినది… తమ గుండెను రెండుగా చీల్చినంత గాయం… అందుకే ఆ గాయం ఇంకా మానలేదు..(Bifurcation of erstwhile AP)

విభజన కు వ్యతిరేకం గా  మిన్నంటిన నిరసనలు 

మమ్మల్ని సమైఖ్యం గా ఉంచండి అని దీనం గా వేడుకొన్న రోజులు… సమాజం లోని అన్ని వర్గాల ప్రజల నిరసనలు…. పేదవాడు లేదు.. ధనికుడు లేదు.. నిమ్న కులం లేదు… అగ్ర కులం లేదు.. నిరక్షరాస్యుల దగ్గర నుండి… గొప్ప చదువులు చదివిన వారి వరకు… రోడ్ల పైకి వచ్చారు.. . అంతులేని ఆవేదన తో  నినదించారు… మమ్మల్ని విడదియ్యకండి అని గొంతెత్తి అరిచారు.. ధర్నాలు చేసారు… రవాణా వ్యవస్థ మొత్తం స్థంబించి పోయింది.. ఎవ్వరికీ ఏం చెయ్యాలో తెలియడం లేదు.. ఈ ప్రాంత రాజకీయ నాయకుల పరిస్థితీ అంతే… ఎందుకు మమ్మల్ని విడదీస్తారు… సమైఖ్యం గా ఉంచండి అంటూ గుండెలు అవిసేలా చేసిన నినాదాలు ఇప్పటికీ… ఈ గడ్డ మీద ఉన్న అందరికీ … ఎప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటాయి..(Bifurcation of erstwhile AP)

bifurcation of erstwhile ap
విద్యార్ధులు సైతం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసారు.

పదేళ్ళయినా గాయం పచ్చి గానే ఉంది…

గుండె కు తగిలిన గాయం అటువంటిది … హైదరాబాద్ మాది అనే కదా అన్నీ అక్కడ పెట్టుకున్నాం… ఆశల్నీ, కోరికలనీ .. భవిష్యత్తు నీ… ఆ మహా నగరం చూట్టూ నే కదా అల్లుకున్నాం… సరిగ్గా అటువంటప్పుడే… ఇది నీది కాదు అంటూ… కనీసం ఇక్కడి వారి మనోభావాల్ని పట్టించు కోకుండా.. అడ్డగోలుగా…. పార్లమెంట్ తలుపులు వేసి మరీ చట్టాన్ని చేసి విభజించినప్పుడు … గుండె రగిలి పోని వారు ఎవ్వరు? ఎండిన కన్నీటి చారికల్ని అడిగితే చెబుతాయి.. గుండెకు ఎంత గాయం జరిగిందో.. నిండు కుండ లాంటి రాష్ట్రాన్ని రాజకీయ స్వార్ధం కోసం రెండు గా విడగొట్టి… మీ చావు మీరు చావండి అంటూ అప్పటి కాంగ్రెస్  ప్రభుత్వం చేసిన  ఆ గాయం ఇంకా మానలేదు… పదేళ్ళయినా ఆ గాయం పచ్చి పచ్చి గానే ఉంది..

ఏపీ లో పుట్టగతులు లేకుండా పోయిన కాంగ్రెస్…(Bifurcation of erstwhile AP)

సమైఖ్య భావాన్ని కాలరాసి… తెలుగు సమాజాన్ని రెండుగా విడదీసి చేసిన తప్పు కు కాంగ్రెస్ పార్టీ కి తగిన బుద్ది చెప్పారు ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా… పార్టీ నామ రూపాలు లేకుండా కొట్టుకు పోయింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఆ పార్టీ కి పుట్టగతులు లేకుండా పోయాయి.. తమ స్వశక్తి నే నమ్ముకున్న ఆంధ్ర ప్రజలు మరింత కష్టపడ్డారు.. తమ తమ రంగాలలో మళ్ళీ అత్యున్నత విజయాలు సాధించడం మొదలు పెట్టారు..

రాష్ట్రానికి రాజధాని లేకపోయినా  గానీ… మేమంతా రగిలే నిప్పు కణికలం అని నిరూపించారు… విభజిత రాష్ట్రం అయినప్పటికీ… అనేక రాష్ట్రాల కంటే ముందు వరుసలోనే నిలబెట్టారు రాష్ట్రాన్ని… నిలబడ్డారు రాష్ట్రం కోసం… ఐదేళ్ళ తెలుగు దేశం పాలన , మరొక ఐదేళ్ళ వైఎస్సార్ పార్టీ పాలన… అధికారం లో ఎవరు ఉన్నా… రాష్ట్రం కోసం పని చేసారు.. తన స్వంత కాళ్ళ మీద రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టారు…

పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ రీ ఎంట్రీ ..

సరిగ్గా.. ఇటువంటి సందర్భం లోనే .. మళ్ళీ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది… వెంటిలేటర్ స్థాయి కూడా దాటిపోయిన స్థితి లో ఉన్న పార్టీ ని బలోపేతం చెయ్యడానికి ప్రయత్నం చేస్తోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ ని సమైఖ్యాంద్ర ప్రదేశ్ అక్కున చేర్చుకుంది. ఎమర్జెన్సీ సమయం లో అత్యధిక స్థానాలు గెలిచింది తెలుగు రాష్ట్రం లోనే… తెలుగు రాష్ట్రం లో గెలిచిన స్థానాలతోనే కేంద్రం లో అధికారం చేపట్టింది చాలా సార్లు.. దళిత బహుజనులు ఎంతగానో ఆదరించారు కాంగ్రెస్ పార్టీ ని… అలాంటి పార్టీ ఇంతటి అన్యాయం చేస్తుంది అని ఎవరూ ఊహించ లేదు.. అ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసిన గాయం ఇప్పటికీ కలుక్కు మంటూనే ఉంటుంది…

షర్మిల కాంగ్రెస్ పార్టీని ఒడ్డుకు చేరుస్తుందా….(Bifurcation of erstwhile AP) 

ఇప్పుడు షర్మిల గారిని తీసుకు వచ్చి పార్టీ ని పునరుజ్జీవింప చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా పైనే మొదటి సంతకం అంటున్నారు.. తెలంగాణా లో ఇచ్చిన ఎన్నికల హామీ లే ఇక్కడ కూడా ఇస్తామని అంటున్నారు.. పార్టీ అధ్యక్షురాలిగా పదవి చేపట్టిన మొదటి ప్రసంగం లోనే షర్మిల తన అన్న జగన్ ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. ప్రస్తుత రాష్ట్ర సమస్యలు అన్నిటికీ పరిష్కారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోనికి రావడమే అంటున్నారు… షర్మిల వలన కాంగ్రెస్  పార్టీ కి కొద్దిగా మైలేజ్ రావచ్చునేమో గాని.. కాంగ్రెస్ అభ్యర్దులను గెలిపించే టంత అభిమానాన్ని అయితే చూపెట్టరు అనేది సగటు ఓటరు మాట. ఎందుకంటే… ఆ విభజన గాయం ఇంకా మాననే లేదు…

Vijay News Telugu