Brightest Object in the Universe Quasar Telugu- విశ్వం లో అతి ప్రకాశవంతమైన వస్తువు
ఈ విశాల విశ్వం లోనే అత్యంత ప్రకాశవంతమైన , దేదీప్యమానమైన ఒక వెలుగు ను గుర్తించారు శాస్త్రవేత్తలు. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ విశ్వం లోనే అత్యంత ప్రకాశవంతమైన ఈ పదార్దం యొక్క లక్షణాలను గురించి వివరించింది. సూర్యునికంటే కొన్ని లక్షల కోట్ల రెట్ల ప్రకాశవంతమైన వెలుగును మనం ఊహించ గలమా… ప్రస్తుతం మన శాస్త్రవేత్తలు అటువంటి దేదీప్యమానమైన వెలుగును కనుగొన్నారు.
విశ్వం లో అతి ప్రకాశవంతమైన వస్తువు ను కనుగొన్న శాస్త్రవేత్తలు-Brightest Object in the Universe
ఈ భూమి మీద మనిషి అత్యంత తెలివైన జీవి. కాని విశ్వం తో పోలిస్తే భౌతికం గా అతి చిన్న జీవి మనిషి. భౌతికం గా సూక్ష్మం అయినప్పటికీ తన తెలివితేటలతో విశ్వాంతరాళాన్ని తన స్వంతం చేసుకొంటున్న జిజ్ఞాస మనిషి స్వంతం. విశ్వం లోని అద్భుతాలు అన్నిటిని ఎప్పటికప్పుడు ఆవిష్కరిస్తూ పోతున్నాడు. ఆ పరంపర లోనే ఎన్నో కాంతి సంవత్సరాల దూరం లో ఉన్న ఒక అద్భుతాన్ని కనుగొన్నారు మన శాస్త్రవేత్తలు. Brightest Object in the Universe
విశ్వం లోనే అతి ప్రకాశవంతమైన వస్తువు
ఈ విశాల విశ్వం లోనే అత్యంత ప్రకాశవంతమైన , దేదీప్యమానమైన ఒక వెలుగు ను గుర్తించారు శాస్త్రవేత్తలు. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ విశ్వం లోనే అత్యంత ప్రకాశవంతమైన ఈ పదార్దం యొక్క లక్షణాలను గురించి వివరించింది. సూర్యునికంటే కొన్ని లక్షల కోట్ల రెట్ల ప్రకాశవంతమైన వెలుగును మనం ఊహించ గలమా… ప్రస్తుతం మన శాస్త్రవేత్తలు అటువంటి దేదీప్యమానమైన వెలుగును కనుగొన్నారు. ఇటువంటి వెలుగును క్వాసార్ అని పిలుస్తున్నారు. ఇప్పటివరకు ఈ విశ్వం లో కనుగొనబడిన అతి కాంతివంతమైన పదార్దం ఇదే.
రోజూ ఒక సూర్యుణ్ణి తినేసే అంత పెద్ద బ్లాక్ హోల్ (Brightest Object in the Universe)
ఈ క్వాసార్ లో అతి పెద్ద కృష్ణ బిలాన్ని (బ్లాక్ హోల్) కూడా కనుగొన్నారు. విశేషం ఏమిటంటే.. ఈ బ్లాక్ హోల్ ప్రతి రోజూ మన సూర్యుని పరిమాణం లో ఉన్న పదార్ధాన్ని తనలో కలుపుకొంటూ పోతోంది. అంటే రోజుకొక సూర్యుణ్ణి తినేస్తోంది అన్నమాట. సాధారణం గా బ్లాక్ హోల్స్ తమ చుట్టూ ఉన్న పదార్ధాన్ని తమలో కలిపేసు కొంటాయి. ప్రస్తుతం ఈ క్వాసార్ లో ఉన్న బ్లాక్ హోల్ కూడా అతి పెద్దది. అది తనలో కలుపుకుకొనే పదార్దాల వల్లనే క్వాసార్ కు ప్రకాశం వస్తుంది.
క్వాసార్ పరిమాణం ఊహించలేనంత పెద్దది (Brightest Object in the Universe)
వీటి పరిమాణం విషయానికి వస్తే ఈ వెలుగు జిలుగుల క్వాసార్ భూమిపై మనకు కనిపించే సూర్యుని కంటే 5 వందల లక్షల కోట్ల రెట్లు (500 ట్రిలియన్ రెట్లు) ఎక్కువ ప్రకాశవంతమైనది గా లెక్కిస్తున్నారు. అలాగే ఈ క్వాసార్ మధ్యలో గల బ్లాక్ హోల్ మన సూర్యుని కంటే 17 వందల కోట్ల రెట్లు (17 బిలియన్ల ) పెద్దదిగా ఉందని చెప్తున్నారు. అంత పెద్దది గా ఉన్న ఈ బ్లాక్ హోల్ ప్రతి రోజూ మన సూర్యుని పరిమాణం లోని పదార్ధాన్ని తనలో కలుపుకు పోతోంది. ఈ విశాలమైన బ్లాక్ హోల్ చుట్టూ అనేక వాయువులు చేరి సుడులు తిరుగుతూ ఉన్నాయి. అంతరిక్షం లో ఏదైనా తుఫాను వస్తుందేమో అనేటట్లు ఈ మొత్తం చిత్రం అంతా కనిపిస్తోంది. Brightest Object in the Universe
అసలు భూమికి ఎంత దూరం లో ఉంది ఈ క్వాసార్?
ఈ క్వాసార్ ను J0529-4351 అని పిలుస్తున్నారు. ఇది భూమికి 12 బిలియన్ కాంతి సంవత్సరాల దూరం లో ఉన్నట్టు కనుగొన్నారు.
ఒక కాంతి సంవత్సరం అంటే ఎంత ?
ఒక కాంతి సంవత్సరం అనగా కాంతి ఒక సంవత్సర కాలం లో ప్రయాణించే దూరము – ఇది 9.5 ట్రిలియన్ కిలోమీటర్ల కు సమానము. భూమికి అన్ని కోట్ల కిలోమీటర్ల దూరం లో ఈ అద్భుతం కనిపిస్తోంది.
నిజానికి ఈ క్వాసార్ ను యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ లో చేసే స్కై సర్వే లో 1980 లోనే కనుగొన్నారు. అంతే కాకుండా అనేక చిన్న క్వాసార్ ల గురించి కూడా కనుగొన్నారు. ఈ అతిపెద్ద క్వాసార్ గురించి ప్రస్తుతం చేసిన పరిశోధనలో ఇటువంటి అనేక విషయాలు వెలుగు చూసాయి. దీనిపై మరింతగా పరిశోధనలు చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. Brightest Object in the Universe.