Butterfly Butterfly Where are you going – పాట వెనుక విస్తుపోయే నిజాలు..
ప్రభుత్వ పాఠశాల కు చెందిన విద్యార్ధినులు అభినయిస్తూ పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియా సంచలనం.. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశం మొత్తం మీద ఈ పాట ఇప్పుడు ఒక సంచలనం… సోషల్ మీడియా లో YouTube, Instagram, Facebook ఎక్కడ చూసినా ఇదే పాట… ఎక్కడ చూసినా కోట్లాది వ్యూస్….. కొన్ని లక్షల మంది ఈ పాట కు రీల్స్ చేస్తున్నారు… ఇప్పుడు ఈ పాటే సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్ యొక్క ట్రెండ్…
Butterfly Butterfly Song- సోషల్ మీడియా ని ఊపేస్తున్న పాట..
ప్రభుత్వ పాఠశాల కు చెందిన విద్యార్ధినులు అభినయిస్తూ పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియా సంచలనం.. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశం మొత్తం మీద ఈ పాట ఇప్పుడు ఒక సంచలనం… సోషల్ మీడియా లో YouTube, Instagram, Facebook ఎక్కడ చూసినా ఇదే పాట… ఎక్కడ చూసినా కోట్లాది వ్యూస్….. కొన్ని లక్షల మంది ఈ పాట కు రీల్స్ చేస్తున్నారు… ఇప్పుడు ఈ పాటే సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్ యొక్క ట్రెండ్… చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు, చిన్నా పెద్దా అనే బేధం లేకుండా ఈ పాటకు రీల్స్, షార్ట్ వీడియో చేసి సోషల్ మీడియో లో అప్ లోడ్ చెయ్యడం ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపొయింది. ముఖ్యం గా యువతీ యువకులు గ్రూపులు గా ఏర్పడి వీడియో లోని చిన్న పిల్లలు వేసిన డాన్స్ స్టెప్స్ అనుకరించడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అయ్యింది అంటే… ఆ చిన్ని విద్యార్ధినులు పాడిన పాట, వారు వేసిన స్టెప్స్ ఎంతగా ఆకట్టు కున్నాయో అర్ధం చేసుకోవచ్చు…( Butterfly Butterfly Song)
ఏముందీ పాటలో…
అంతగా ఆకట్టుకొనే విషయం ఏముంది ఈ పాటలో అంటే.. చాలా సంగతులే ఉన్నాయి చెప్పుకోవడానికి… ఈ వీడియో గాని ఒకసారి చూసామంటే .. ఒక్కసారితో దానిని ఆపెయ్యలేము.. లూప్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది… అలా మనకు తెలియకుండానే అలా చూస్తూ ఉండిపోతాం. ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు.. చూడటం ఆపేద్దాం అంటే మనసొప్పదు… అలాంటి పాట ఇది.. ఒకసారి ఎక్కింది అంటే… రోజంతా ఆ పాట అలా మైండ్ లో తిరుగుతూనే ఉంటుంది… ఆ గ్రూప్ లో మెయిన్ లీడ్ గా చేసిన పాప స్వరం లో ఏదో మ్యాజిక్ మనల్ని కట్టి పడేస్తుంది. ఆమె వేసిన చిన్న చిన్న స్టెప్స్ ఎన్ని సార్లు చూసినా చూడాలని అనిపించేటట్లు ఉంటాయి… మిగిలిన పిల్లలు కూడా చాలా బాగా చేసారు.. అన్నిటికి మించి వెనుక బ్యాక్ గ్రౌండ్ లో లయబద్దం గా సాగే డ్రం (drum) బీట్ ఆ ఒక్క నిమిషం లోనే మనల్ని మాయ చేసేస్తుంది. ఇక అంతే … లూప్ (loop) స్టార్ట్ అవుతుంది… వింటూనే ఉంటాం.. చూస్తూనే ఉంటాం.. తెలియని మ్యాజిక్ ఉంటుంది ఈ పాటలో.. ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఈ పాటకు అలవాటు పడిపోయారు..
విదేశాల్లో కూడా ఫుల్ క్రేజ్ ఈ పాట కి..(Butterfly Butterfly Song)
తెలుగు రాష్ట్రాలు దాటి, దేశ సరిహద్దులు దాటిపోయి విశ్వ వ్యాప్తం అయిపోయింది ఈ పాట… భారతీయ పాటలకు రెగ్యులర్ గా రీల్స్ చేసి పెట్టే సోషల్ మీడియా సంచలనం టాంజానియా దేశస్థుడు ప్రఖ్యాత ” కిలి పాల్” కూడా రీల్ చేసి పెట్టాడంటే ఆ చిన్నారుల పాట ఎంత ఆదరణ పొందిందో మనం అర్ధం చేసుకోవచ్చు.
ఈ పాట లిరిక్స్ కోసం ఇంటర్ నెట్ లో వెదకటం ప్రారంభించారు జనం… ఎక్కడా ఏమీ కనిపించలేదు… ఈ పాటను ఒరిజినల్ వీడియో ను అనేక మంది కాపీ చేసి మరీ తమ సోషల్ మీడియా ఎకౌంట్స్ లో షేర్ చేసారు.. ఈ పాట ఎవరు ఎక్కడ షేర్ చేసినా లక్షల కొద్దీ వ్యూస్.. కొన్ని చోట్ల బిలియన్ల వరకూ వ్యూస్ ఉన్నాయంటే … ఈ పాట ఏ స్థాయిలో అందరినీ ఆకట్టు కుందో మనం గ్రహించ వచ్చు..
అసలు ఈ పాట ఎక్కడ పుట్టింది..? ఆ విద్యార్దినులు ఎవరు? వారు ఏ రాష్ట్రానికి చెందిన వారు? వారిది ఏ ఊరు? ఈ పాట వెనుక ఉన్నది ఎవరు ? ఈ విషయాలన్నీ తెలుసు కొనవలసిన అవసరం ఎంతైనా ఉంది…
ఎక్కడ పుట్టింది ఈ పాట … పాట వెనుక కధ ఏంటంటే…
ప్రపంచ వ్యాప్తం గా సోషల్ మీడియా లో కోట్లాది వ్యూస్ సంపాదిస్తున్న ఈ పాట మన అనంత పురం జిల్లా లో రూపు దిద్దుకొంది. ఈ పాట ను రూపొందించడం లో ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని కష్టం ఉంది. అనంత పురం జిల్లా లోని కళ్యాణ దుర్గం మండలం లోని నుసి కొత్తల గ్రామానికి చెందిన విద్యార్ధినులు వీరంతా… ఈ గ్రామం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తున్న శ్రీ బిక్కి శ్రీనివాసులు ఈ పాటను రూపొందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధినులకు పాడటం లోనూ, అభినయించడం లోనూ శిక్షణ ఇచ్చారు..
ఏ యూట్యూబ్ ఛానల్ అప్ లోడ్ చేసారంటే….
ఇలా వారు పాడి , అభినయించిన పాటను శ్రీనివాసులు గారు రికార్డు చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ పాట ను ఆయన నాలుగేళ్ల క్రితం అంటే.. మార్చి 21, 2019 వ సంవత్సరం లో అప్ లోడ్ చేసారు. Bikki Srinivasulu అనే పేరుతో యూ ట్యూబ్ చానల్ అప్పటికే ఆయన రన్ చేస్తున్నారు.. ప్రభుత్వ పాఠశాల లో చదువు కొనే పిల్లలకు అండగా ఉండేందుకు state board of elementary education, Andhra pradesh వారి కరికులం మేరకు రూపొందించిన పిల్లల పాటలు, నృత్య రూపకాలు పిల్లలతో పాడించి ఆ వీడియోలు యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసే వారు. బటర్ ఫ్లై పాట లో ఉన్న చిన్నారులు ఇదే చానల్ లోని ఇతర పాటల్లో కూడా ఉండటం మనం గమనించవచ్చు…
ఈ వీడియో నాలుగేళ్ల క్రితం ది…(Butterfly Butterfly Song)
అవును నాలుగేళ్ల క్రితం యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది… అనేక మంది ఈ వీడియో ను డౌన్ లోడ్ చేసుకున్నారు.. కొన్ని లక్షల మంది ఈ పాట తో రీల్స్ చేసారు.. శ్రీనివాసులు గారి ఛానల్ లో ఈ పాటకు 7 మిలియన్ల కి పైగా వ్యూస్ ఉన్నాయి.. అయితే ఇతరులు సోషల్ మీడియా లో అప్ లోడ్ చేస్తే వాటికి ఇంకా ఎక్కువ వ్యూస్ ఉండటం గమనార్హం. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం పిల్లల కోసం యూ ట్యూబ్ లో పెట్టిన వీడియో యావత్ సోషల్ మీడియా ను ఒక ఊపు ఊపేస్తోంది… Butterfly Butterfly Song
పిల్లల యూనిఫాం పై కూడా చర్చలు…
ఇది కొత్త వీడియో గా భావించి ఆ వీడియో లోని చిన్నారులు ధరించిన స్కూల్ డ్రెస్ పై కూడా చాలా మంది చర్చించు కొంటున్నారు. ఈ యూనిఫాం నాలుగేళ్ల క్రితం ది అప్పటికి జగన్ సర్కార్ అధికారం లోనికి రాలేదు… చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత యూనిఫాం రంగు కూడా మార్చారు.. షూస్ ఇచ్చారు.. ఏ ఇతర ప్రైవేట్ స్కూల్ పిల్లల కంటే మంచి డ్రెస్ ఉండాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. వీడియో లోని చిన్నారులు చాలా పేద కుటుంబాల పిల్లలు అని తెలుస్తూనే ఉంది..
వారి సామాజిక పరిస్థితి ఏమైనప్పటికీ… పిల్లలు అదరగొట్టేసారు.. గవర్నమెంట్ స్కూల్ సత్తా ఏంటో చూపెట్టారు.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంటే ఇలా ఉండాలి అనే విధం గా ఆదర్శం గా నిలిచారు బిక్కి శ్రీనివాసులు గారు… ఒక్క ముక్క లో చెప్పాలంటే… butterfly song వేరే లెవెల్… అంతే.. హాట్సాఫ్ చిన్నారి పిల్లలు… హాట్సాఫ్ శ్రీనివాసులు గారు… Butterfly Butterfly Song
PS: ఎప్పుడో మనం కోల్పోయిన బాల్యం మనసు లో మెదులు తుంది.. స్కూల్ లో పాడిన పాటలు గుర్తొస్తాయి.. అంతే.. మనకు తెలియ కుండానే పాట వింటూ… బాల్యాన్ని వెతుక్కుంటాం.. ఏది ఏమైనా… ఆ చిన్నారి పాప వాయిస్ లోనే ఏదో మ్యాజిక్ ఉంటుంది.., ఆ పిల్లలు అందరూ వేసిన స్టెప్స్ మన మనసు లోనే రిపీట్ అవుతూ ఉంటాయి… ఇంత వరకూ ఆ పాట వినలేదా.. Butterfly Butterfly అని టైప్ చెయ్యండి చాలు… తెలియని ఆ మాయ లో పడి ఆ పాటను అలా … అలా రోజంతా వింటూనే ఉంటారు…. ఇది నిజం… ప్రయత్నించండి…
పాట లిరిక్స్ ఇలా ఉంటాయి..
Butterfly Butterfly…(2)
Where are you going..(2)
Out in a Garden (2)
Dancing Dancing ..(2)
Pretty Pretty Butterfly (2)
Lovely Lovely Butterfly (2)