California Wildfires| దేవుడికి కోపం వచ్చిందా? కాలిఫోర్నియా కార్చిచ్చు పై సోషల్ మీడియా కథనాలు
ఈ కార్చిచ్చు రేగడానికి కొద్ది రోజుల ముందు హాలీవుడ్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం లో అనేకసార్లు దైవ దూషణ జరిగింది అని వాటి క్లిప్పింగ్స్ తో రీల్స్ చేస్తున్నారు. ఈ క్లిప్పింగ్స్ లో ఆ కార్యక్రమానికి యాంకర్ గా పని చేసిన యాంకర్ పదే పదే దైవ దూషణ కు పాల్పడింది.

California Wildfires in Social Media
California Wildfires| దేవుడికి కోపం వచ్చిందా? కాలిఫోర్నియా కార్చిచ్చు పై సోషల్ మీడియా కథనాలు
అమెరికా లాంటి అగ్రదేశం ఆరని కార్చిచ్చు తో అతలాకుతలం అవుతోంది. గత వారం రోజులుగా ఎగసిపడ్డ అగ్ని కీలలు కాలిఫోర్నియా లో విధ్వంసం సృష్టించాయి. లాస్ ఏంజెల్స్ లాంటి ధనిక నగరాలు భస్మీపటలం అయిపోయాయి. హాలివుడ్ ప్రాంతం అంతా బూడిద అయిపొయింది. కాలిఫోర్నియా లోని పాలిసేడ్స్ ప్రాంతం మరుభూమి ని తలపిస్తోంది. (California Wildfires)
కాలం కాని కాలం లో ఇటువంటి ఉపద్రవం వచ్చి పడటం తో అమెరికా లోని చాలా ఇన్స్యూరెన్స్ కంపెనీలు బోర్డులు తిప్పేసాయి. దానితో ఆయా ప్రాంతాలలోని సామాన్య ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు.
దేవుడికి కోపం రావడమే ఈ కార్చిచ్చు కి కారణమా ? (California Wildfires)
ఇదిలా ఉంటే ఈ ఉపద్రవానికి ప్రధాన కారణం దేవుడికి కోపం రావడమే అంటూ అనేక మంది రీల్స్, షార్ట్స్ చేస్తూ సోషల్ మీడియా లో అప్ లోడ్ చేస్తున్నారు.
ఈ కార్చిచ్చు రేగడానికి కొద్ది రోజుల ముందు హాలీవుడ్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం లో అనేకసార్లు దైవ దూషణ జరిగింది అని వాటి క్లిప్పింగ్స్ తో రీల్స్ చేస్తున్నారు. ఈ క్లిప్పింగ్స్ లో ఆ కార్యక్రమానికి యాంకర్ గా పని చేసిన యాంకర్ పదే పదే దైవ దూషణ కు పాల్పడింది. దానితో పాటు ఆ కార్యక్రమానికి హాజరైన అందరూ కూడా ఆమె మాటలకు హర్షాతిరేకాలు తెలియ జేశారు. అంతే కాకుండా లాస్ ఏంజెల్స్ నగరాన్ని ‘గాడ్ లెస్ టౌన్’ అంటూ మాట్లాడటం కూడా జరిగింది.
ఈ విధం గా ‘దేవుడు లేని నగరం’ అంటూ రకరకాలుగా దైవ దూషణ కు పాల్పడటం వల్లనే ఈ ఉపద్రవం వచ్చి పడింది అని రీల్స్ చేస్తున్నారు. దేవుడు వెక్కిరింప బడడు, దేవుడిని మోసం చేయడం కుదరదు అంటూ క్రైస్తవ దైవ జనులు అనేక మంది సోషల్ మీడియా లో వీడియో లు విడుదల చేస్తున్నారు.
కాలిఫోర్నియా ప్రజలు దేవుడిని విస్మరించి నందువల్లనే దేవుని ఉగ్రత ఈ నగరాల మీదకు వచ్చింది అని విశ్లేషిస్తున్నారు. ఇటువంటి రీల్స్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తం గా సోషల్ మీడియా లో హాల్ చల్ చేయడం తో అనేక మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అల్లా న్యాయం చేసాడు అంటూ రీల్స్ (California Wildfires)
ఈ కార్చిచ్చు ని రగిలించి అమెరికా కు అల్లా బుద్ది చెప్పాడంటూ సోషల్ మీడియా లో అనేక వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇజ్రాయెల్, గాజా మధ్య జరుగుతున్న పోరు లో దాదాపు ముప్పై వేల మందికి పైగా గాజా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ప్రతిరోజూ అనేక మంది గాజా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ యుద్ధం లో ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు గా నిలిచింది. యుద్ధోన్మాదం తో ముందుకు పోతున్న ఇజ్రాయెల్ వెనుక ఉండి నడిపించినందుకు అమెరికా కు తగిన శాస్తి జరిగింది అంటూ అనేక రీల్స్ షార్ట్స్ సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. అల్లా తమకు న్యాయం చేసాడని గాజా లో విద్వంసం యొక్క వీడియో లను చిత్రాలను జత చేస్తూ అనేక వీడియోలు చేస్తున్నారు. (California Wildfires)
కార్చిచ్చు వీడియోలు చాలా వరకూ ఫేక్
సోషల్ మీడియా ను ముంచెత్తుతున్న కాలిఫోర్నియా కార్చిచ్చు వీడియోలలో తొంభై శాతం వరకూ ఫేక్ వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) సహాయం తో నగరం మొత్తం భస్మీపటలం అయిపోతున్నట్టు వీడియోలు సృష్టించి మరింత గందరగోళానికి గురిచేస్తున్నారు. లేటెస్టు టెక్నాలజీ ఉపయోగించి మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
వాతావరణ మార్పుల వల్లనే ఇదంతా
సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కధనాలు కేవలం మూఢ నమ్మకం మాత్రమే అని ప్రపంచ వ్యాప్తం గా వాతావరణ పరిస్థితులలో వచ్చిన మార్పుల వల్లనే ఈ కార్చిచ్చు వ్యాపించింది అని హేతువాదులు వాదిస్తున్నారు.