March 7, 2026
Home » Entertainment » Cinema News - సినిమా వార్తలు

Cinema News – సినిమా వార్తలు

Sankranthi Winner 2025| సంక్రాంతి 2025 సినిమాల రివ్యూ-విజేత గా నిలిచిన చిత్రం ఏదో తెలుసా ?

పాత చింతకాయ పచ్చడి కథ అయినప్పటికీ కథనం ఆకట్టుకుంది. అనవసరమైన ఎలివేషన్ లు లేవు. చాంతాడంత భారీ డైలాగులు లేవు. పక్కా మాస్ ఫార్ములా స్క్రిప్ట్ ని చాలా క్లాస్ గా చూపించిన ఘనత దర్శకునిదే. అనుభవజ్ఞుడైన శంకర్ ఎక్కడైతే ఫెయిల్ అయ్యాడో యువ దర్శకుడు బాబీ కొల్లి అక్కడే విజయం సాధించాడు.

Pushpa-2 Box Office Collections Day-15 |బాహుబలి రికార్డులపై కన్నేసిన పుష్ప రాజ్

ఏది ఏమైనప్పటికీ పుష్ప -2 సినిమా గత 15 రోజులుగా భారత సినీ పరిశ్రమ లో అనేక రికార్డులను తిరగరాస్తూ ముందుకు దూసుకు వెళ్తోంది. ఈ మధ్యలో సినిమాలు ఏమీ లేకపోవడం క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవు దినాలలో కూడా కలెక్షన్ లు భారీగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్ లతో దంగల్ సరసన చేరే అవకాశం ఉంటుంది అని ఆశించడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. 

Pushpa 2 The Rule Collections| ఆరు రోజుల్లో ఎంత కొల్లగొట్టిందో తెలుసా| 6 days Collections of Pushpa 2

తెలుగు రాష్ట్రాల కంటే హిందీ లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. బీహార్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఈ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సగటు హిందీ చిత్రాల మూస ధోరణి కి భిన్నం గా ఈ చిత్రం ఉండటం తో ఉత్తరాది ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు.

పుష్ప – 2 ఘన విజయానికి దోహదపడిన అంశాలు ఇవే |Pushpa 2 review in Telugu

మెగా కుటుంబం అనే ఒక పెద్ద ఛత్రం క్రింద ఇమిడిపోవడం బన్నీ కి నచ్చలేదు. అయితే తను ఏం చెప్పాలనుకున్నా అది తన టాలెంట్ తోనే , తన కృషి తోనే చెప్పాలనుకుని అది నిరూపించు కున్నాడు అల్లు అర్జున్. చిరంజీవి గారి అండ తోనే తను సినిమాలలోనికి వచ్చినప్పటికీ తనేంటో ప్రతిసారీ నిరూపించు కోవడం పైన శ్రద్ద పెట్టాడు అర్జున్
ఏమైనప్పటికీ 'కెప్టెన్ ఆఫ్ ద షిప్' గా సుకుమార్ ఈ చిత్ర విజయాన్ని శాసిస్తే 'సీజ్ ద షిప్' అంటూ ఆ నౌక ను 'బ్లాక్ బస్టర్ ' తీరాలకు చేర్చింది  మాత్రం అల్లు అర్జున్ అని ఘంటాపథంగా చెప్పవచ్చు

Ambajipeta Marriage Band review- అంబాజీపేట మ్యారేజీ బ్యాండు విశ్లేషణ

అంబాజీపేట మ్యారేజీ బ్యాండు – ఒక విశ్లేషణ-Ambajipeta Marriage Band review వైవిధ్యమైన పాత్రలు ఎంచుకొనే హీరో సుహాస్ ప్రధాన...