18-12-2024 Daily Short News Telugu| Daily Current Affairs|
18-12-2024 Daily Short News Telugu| Daily Current Affairs|
18-12-2024 Daily Short News Telugu| Daily Current Affairs|
అతి పిన్న వయసులో 1988 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను కూడా అందుకున్నారు. గ్రామీ అవార్డులకు ఎక్కువసార్లు నామినేట్ అయి మొత్తం నాలుగు సార్లు గ్రామీ అవార్డును అందుకున్న ఏకైక భారతీయ సంగీత కళాకారుడు జాకీర్ హుస్సేన్.
ప్రయోగ రాజ్ లో జనవరి 13 నుండి ప్రారంభమయ్యే కుంభ మేళా ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది. టెక్స్ట్ రూపం లోనూ వాయిస్ రూపం లోనూ భక్తులకు కావలసిన సమాచారాన్ని అంతా సులువుగా అందజేస్తుంది ఈ చాట్ బోట్.
ఆస్ట్రేలియా లోని క్వీన్స్ లాండ్ రాష్ట్రం లో తీవ్రమైన నేరాలు చేసే పదేళ్ళ పిల్లలకు కూడా కఠిన మైన జైలు శిక్ష విధించాలని చట్టం తీసుకు వచ్చారు. పిల్లలలో నేర ప్రవృత్తి వివరీతం గా పెరిగిపోవడం తో హత్యలు, దోపిడీలు చేసే బాల నేరస్తుల సంఖ్య విపరీతం గా పెరగడం తో క్వీన్స్ లాండ్ రాష్ట్రం ఈ చట్టాన్ని తీసుకు వచ్చింది.
అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన తర్వాత కోర్టు ఉత్తర్వుల తో చంచల్ గూడా జైలు కి తరలించారు. నాటకీయ పరిణామాల తర్వాత అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలు కు తరలించారు. తెలంగాణా హైకోర్టు లో చాలా సేపు వాదనలు జరిగిన తర్వాత ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ లభించింది. షారూక్ - వడోదరా కేసు, ఆర్నాబ్ కేసులను ఉదాహరణ గా చూపుతూ ఈ తీర్పు వెలువడింది. అల్లు అర్జున్ వద్ద వ్యక్తిగత బాండు తీసుకున్న అనంతరం చంచల్ గూడా జైలు నుండి విడుదల చేస్తారు.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప -2 దేశ వ్యాప్తం గా భారీ వసూళ్లను రాబట్టింది. విడుదలైన ఏడు రోజుల్లోనే వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టిన తొలి చిత్రం గా రికార్డు సృష్టించింది ఈ చిత్రం.
ఒకవేళ ఆ మ్యాచ్ లో నలభై ఎనిమిదవ ఓవర్ మూడవ బంతి కి హ్యూస్ గాని అవుట్ అయి ఉంటే.. ప్రస్తుత బ్యాటింగ్ సంచలనం ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ కు వచ్చేవాడు. ఫిల్ హ్యూస్ తో పాటు ట్రావిస్ హెడ్, ఆడం జంపా కూడా అదే మ్యాచ్ లో సౌత్ ఆస్ట్రేలియా కు ఆడుతున్నారు. అదే మ్యాచ్ లో న్యూ సౌత్ వేల్స్ తరపున ఆడుతున్న వారిలో డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్, నాథన్ లయన్, మిచెల్ స్టార్క్ ఉన్నారు.
కడపటి వార్తలు అందేసరికి(భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.40 PM) ట్రంప్ 277 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించారు. కమలా హారిస్ 224 ఓట్లు సాధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలుపుకు అవసరమైన 270 స్థానాలను ట్రంప్ ఇప్పటికే గెలుచుకున్నారు. దీనితో అమెరికా అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ రెండవసారి అధిరోహించ బోతున్నారు.
టాంకర్ బోల్తా పడగానే దగ్గర గ్రామాలలోని ప్రజలు వెంటనే అక్కడకు చేరి లీక్ అవుతున్న ఇంధనాన్ని తీసుకుపోవడానికి పోటీ పడ్డారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత స్థానిక పోలీసులు అక్కడకు చేరుకొని అక్కడ గుమికూడిన ప్రజలను హెచ్చరించినప్పటికీ లాభం లేక పోయింది.