RCB Wins WPL 2024| Ee Sala Cup Namdu| మహిళల WPL గెలిచిన RCB జట్టు
WPL రెండవ సీజన్ లోనే RCB మహిళల జట్టు టైటిల్ గెలుచుకుంది. స్మృతి మందన సారధ్యం లోని RCB జట్టు DC పై సంచలన విజయం సాధించి "Ee Sala Cup Namdu" ఈ సంవత్సరం కప్ మనది అంటూ చరిత్ర సృష్టించింది.
WPL రెండవ సీజన్ లోనే RCB మహిళల జట్టు టైటిల్ గెలుచుకుంది. స్మృతి మందన సారధ్యం లోని RCB జట్టు DC పై సంచలన విజయం సాధించి "Ee Sala Cup Namdu" ఈ సంవత్సరం కప్ మనది అంటూ చరిత్ర సృష్టించింది.
బజ్ బాల్ గేమ్ తో ఏ జట్టునైనా మట్టి కరిపిస్తాం అంటూ సీరీస్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు భారత యువ ఆటగాళ్ళ దెబ్బకు విలవిల లాడింది. ఉప్పల్ టెస్టు లో మాత్రమే విజయం సాధించిన ఇంగ్లాండ్ మిగిలిన నాలుగు టెస్టులలో దారుణం గా ఓడిపోయింది. వరుసగా నాలుగు టెస్టులలో ఘన విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో మొదటి స్థానానికి ఎగ బ్రాకింది భారత్. (White Wash to Buzz Ball)
ధర్మశాల టెస్ట్ లో భారత్ రెండవ రోజు బ్యాటింగ్ లో తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇంగ్లాండ్ విశ్వ ప్రయత్నం చేసినా భారత్ ను ఆలౌట్ చెయ్యలేకపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో అభేద్యమైన 255 పరుగుల ఆధిక్యత ను సంపాదించింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు స్కోరు 473 /8. రోహిత్, గిల్ సెంచరీలు చేసారు. పడిక్కల్, సర్ఫరాజ్ అర్ద సెంచరీలు చేసారు.(Ind vs Eng 5th Test)
ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య ధర్మశాల లో ప్రారంభమైన చివరి టెస్టు లో తొలిరోజు భారత్ పై చేయి సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టును ఆలౌట్ చేయడమే కాకుండా రెండవ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 210 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడింది. ఎత్తులకు పై ఎత్తులు వేసారు కెప్టెన్లు . ఒక సెషన్ లో ఆధిక్యత ఇంగ్లాండ్ ది అయితే మరొక సెషన్ లో భారత్ ఆధిక్యం లో దూసుకు పోయింది. వన్డేలు, టీ 20 లలో మాదిరి నరాలు తెగే ఉత్కంఠ..
అనుకున్నంతా అయ్యింది.. ఇంగ్లాండ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. రాంచీ లో జరుగుతున్న నాల్గవ టెస్టు లో విజయం తప్పనిసరి కావడం తో ఇంగ్లాండ్ తన శక్తి యుక్తులు అన్నీ ప్రదర్శిస్తూ ఆధిక్యత కోసం ప్రయత్నం చేస్తోంది.
భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య రాంచీ లో జరుగుతున్న నాల్గవ టెస్టు లో మొదటి రోజు ఇంగ్లాండ్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జో రూట్ శతకం సాధించడం తో భారీ స్కోరు దిశ గా అడుగులు వేస్తోంది.
IPL 2024 (17 సీజన్) లో జరగబోయే మ్యాచ్ ల యొక్క షెడ్యూల్ ను విడుదల చేసింది బీసీసీఐ. ఈ సారి మ్యాచ్ లు రెండు విడతలు గా జరుగబోతున్నాయి.
ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ టెస్టు లో ఇరు జట్ల ఆటగాళ్ళు అనేక రికార్డులు బద్దలు గొట్టారు. చిన్నవి పెద్దవి అన్నీ చూస్తే చాలా రికార్డులే ఉన్నాయి. బజ్ బాల్ గేమ్ తో ఎంతటి స్కోరు నైనా అవలీలగా చేధిస్తామన్న ధీమా లో ఉన్న ఇంగ్లాండ్ టీం కోరలు విరిచేశారు భారత ఆటగాళ్ళు.
నాల్గవ రోజునే ముగిసిన టెస్టు మ్యాచ్ లో ఒక చిరస్మరణీయ విజయాన్ని భారత జట్టు స్వంతం చేసుకోవడం తో క్రికెట్ ప్రపంచం లో హర్షాతిరేకాలు మిన్నంటాయి. అనేక రికార్డులకు సాక్షి గా నిలిచిన మూడవ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ అజేయం గా డబుల్ సెంచరీ చేయడం, రవీంద్ర జడేజా ఐదు వికెట్లు పడగొట్టడం తో భారత్ నాలుగవ రోజే ఈ టెస్టు మ్యాచ్ గెలిచింది.