KKR VS RR-TATA IPL 2024- Match 31 సంచలన విజయం సాధించిన రాయల్స్
జస్ట్ మిగిలిన 8 ఓవర్ల లో 100 కు పైగా పరుగులు చేయవలసిన పరిస్థితి. చేతిలో వికెట్లు లేవు.. RR పరాజయం ఖాయం అనుకున్నారంతా....సరిగ్గా అదే సమయం లో అస్తవ్యస్తమైన ఇన్నింగ్స్ ను చక్కపెట్టుకుంటూ .. అడపా దడపా ఫోర్లూ సిక్సర్లూ కొట్టుకుంటూ వస్తున్నాడొక బహుదూరపు బాటసారి.. ఆయన పేరే జోస్ బట్లర్... ఎవరికీ ఎటువంటి నమ్మకాలు లేవు... ఈ సమయం లో ఈడెన్ గార్డెన్ లోని ఏ ఒక్కరూ కూడా RR జట్టు గెలుస్తుంది అని అనుకొని ఉండరు..
కానీ ఒకే ఒక్కడు నమ్మాడు... గెలిచి తీరాల్సిందే అని గట్టిగా అనుకున్నాడు.. స్టేడియం ను సైలెన్స్ చెయ్యాలని అనుకున్నాడు.. ఒక్కొక్క పరుగూ కూడబెట్టుకుంటూ... ఆడుతున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో KKR జట్టు ను ఓడించి ఒక 'రాయల్ విక్టరీ' సాధించింది. అశేష క్రికెట్ అభిమానులకు ఈ మ్యాచ్ ఎప్పటికీ గుర్తు ఉండిపోతుంది. కాదు కాదు మ్యాచ్ తో పాటు జోస్ బట్లర్ అనే 'పోరాట సింహం' ఎప్పటికీ గుర్తు ఉండిపోతాడు.