April 19, 2025

Champions Trophy 2025 Indian Squad| చాంపియన్స్ ట్రోఫీ కి భారత జట్టు ప్రకటన

దేశవాళీ క్రికెట్ లో సంచలనాలు సృష్టించి సెలెక్టర్లకు సవాలు విసిరిన కరుణ్ నాయర్ ను ఎంపిక చేయలేదు. విజయ్ హజారే ట్రోఫీ లో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ ను జాతీయ జట్టుకు ఎంపిక చేస్తారని అందరూ భావించారు. ఐదు సెంచరీలతో నాటౌట్ గా ప్రపంచ రికార్డు సాధించిన కరుణ్ నాయర్ జట్టుకు కొత్త వాడేం కాదు.

Champions Trophy 2025 Indian Team

Champions Trophy 2025 Indian Team

Champions Trophy 2025 Indian Squad| చాంపియన్స్ ట్రోఫీ కి భారత జట్టు ప్రకటన

ఈ సంవత్సరం ఫిబ్రవరి లో ప్రారంభం కానున్న చాంపియన్స్ ట్రోఫీ కి భారత జట్టును ప్రకటించారు. చాలా కాలం గా జట్టుకు దూరమైన స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ కి జట్టులో స్థానం లభించింది. అలాగే గాయం తో బాధ పడుతున్న జస్ప్రీత్ బుమ్రా కి కూడా జట్టులో స్థానం లభించింది. వీరితో పాటు యువ సంచలనం యశస్వీ జైస్వాల్ జట్టులో చోటు సంపాదించారు. అయితే ఆస్ట్రేలియా లో సంచలన రీతి లో బ్యాటింగ్ ప్రదర్శన చేసిన నితీష్ కుమార్ రెడ్డి కి జట్టులో స్థానం లభించలేదు. (Champions Trophy 2025 Indian Squad)

వివరాలలోనికి వెళ్తే దుబాయ్ లో వచ్చే ఫిబ్రవరి లో ప్రారంభం అయ్యే చాంపియన్స్ ట్రోఫీ కి భారత జట్టును ప్రకటించారు. ఈ రోజు జట్టు సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ వివరాలను వెల్లడించారు. జట్టుకు ఎంపిక అయిన 15 మంది ఆటగాళ్ళ పేర్లను ఆయన ప్రకటించారు. కేవలం 15 మంది ని మాత్రమే ఎంపిక చేయడం గమనార్హం.

రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తారు. శుభ్ మన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఎంపిక అయ్యారు. జట్టు కూర్పు ఇలా ఉంది.

ఎంపిక అయిన జట్టు ఇదే 

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కే.ఎల్. రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్, యశస్వీ జైస్వాల్.

బుమ్రా మొదటి మ్యాచ్ లకు అనుమానమే 

బుమ్రా మొదటి రెండు మ్యాచ్ లకు అందుబాటులో లేకపోతే ఆయన స్థానాన్ని హర్షిత్ రాణా భర్తీ చేస్తారు. అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, షమీ పేసర్లు గా ఉంటారు. అయితే సిరాజ్ కు స్థానం లభించలేదు. బాల్ పాతబడినప్పుడు అధికం గా పరుగులు ఇస్తూ ఉండటం, మరొక ప్రక్క షమీ అందుబాటులోనికి రావడం తో సిరాజ్ కు మొండి చెయ్యే ఎదురైంది. ప్రపంచ కప్ 2023 మధ్యలోనే గాయం తో వైదొలగిన పాండ్యా ప్రస్తుతం అందుబాటులో ఉండటం తో ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్ మెంట్ కూడా పటిష్టం గానే కనిపిస్తోంది.

సంజూ కి దక్కని చోటు  (Champions Trophy 2025 Indian Squad)

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కు ప్రస్తుతం పోటీ తీవ్రం గా ఉంది అనే చెప్పాలి. కే.ఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా బ్యాట్స్ మన్ గా చోటు సంపాదించగా రిషబ్ పంత్ కి కూడా కీపర్ గా, బ్యాట్స్ మన్ గా  అవకాశం లభించింది. అయితే సంజూ సామ్సన్ ని మాత్రం అసలు పరిగణన లోనికే తీసుకోలేదు. విజయ్ హజారే ట్రోఫీ లో ఆడలేకపోవడం వంటి కారణాలతో సంజూ కి అవకాశం దక్కలేదు.

నలుగురు స్పిన్నర్ల తో అటాక్ 

ప్రస్తుతం ఎంపిక చేయబడిన జట్టులో స్పిన్నర్ల పై సెలక్టర్లు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. దుబాయ్ పిచ్ లు పేసర్ల కంటే స్పిన్నర్ల కే అనుకూలం గా ఉండటం కారణం కావచ్చు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ స్పిన్నర్లు గా ఎంపిక అయ్యారు. అవసరమైన సందర్భాలలో జడేజా, సుందర్ బ్యాటింగ్ లో కూడా రాణించే అవకాశం ఉంది. (Champions Trophy 2025 Indian Squad)

కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి కి దక్కని చోటు 

దేశవాళీ క్రికెట్ లో సంచలనాలు సృష్టించి సెలెక్టర్లకు సవాలు విసిరిన కరుణ్ నాయర్ ను ఎంపిక చేయలేదు. విజయ్ హజారే ట్రోఫీ లో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ ను జాతీయ జట్టుకు ఎంపిక చేస్తారని అందరూ భావించారు. ఐదు సెంచరీలతో నాటౌట్ గా ప్రపంచ రికార్డు సాధించిన కరుణ్ నాయర్ జట్టుకు కొత్త వాడేం కాదు. 2016 లో  భారత జట్టు తరపున టెస్టులలో ట్రిపుల్ సెంచరీ సాధించిన చరిత్ర అతనికి ఉంది. భీభత్సమైన ఫాం లో ఉన్న నాయర్ ను ఎంపిక చేసి ఉండాల్సింది అని అభిమానులు అంటున్నారు.

ఆస్ట్రేలియా లో తన ప్రతిభ చాటిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కి కూడా జట్టులో చోటు లభించలేదు. యశస్వీ జైస్వాల్ కు మాత్రం అవకాశం దక్కింది.

champions trophy india squad 2025,
champions trophy,
india squad for champions trophy,
champions trophy squad,
champions trophy 2025 india squad,
india champions trophy squad 2025,
champions trophy 2025,
champions trophy 2025 schedule,
india squad for champions trophy 2025,
icc champions trophy,
india champions trophy squad announcement,
india champions trophy squad,
indian team for champions trophy,