Chocolate Day Valentine Week – ప్యూర్ ప్రేమ చాక్లెట్ ఇదిగో తీసుకో.
“ఈ రోజు చాకొలెట్ డే అంట కదా ”
“అవును… చాక్లెట్ దినోత్సవం .. వాలెంటైన్ వీక్ లో రెండో రోజు ..”
“ప్రతీ సంవత్సరం జరుపు కుంటావా….”
Chocolate Day Valentine Week – ప్యూర్ ప్రేమ చాక్లెట్ ఇదిగో తీసుకో…
“ఈ రోజు చాకొలెట్ డే అంట కదా ” (Chocolate Day Valentine Week)
“అవును… చాక్లెట్ దినోత్సవం .. వాలెంటైన్ వీక్ లో రెండో రోజు ..”
“ప్రతీ సంవత్సరం జరుపు కుంటావా….”
“కుంటా… చాక్లెట్స్ ఎప్పుడైనా తింటాం.. కాని వాటికంటూ ఒక రోజు ఉంటే బాగుంటుంది కదా ..”
“నీకు ఏ చాక్లెట్ అంటే ఇష్టం ….”
“ప్రేమ నింపిన ఏ చాక్లెట్ అయినా ఇష్టమే…”
“అలాంటి చాక్లెట్ ఎప్పుడైనా తిన్నావా మరి….” (Chocolate Day Valentine Week)
“లేదు.. చాక్లెట్స్ లో ఎన్నో ఫ్లేవర్స్ తిన్నా .. కానీ ఈ ప్రేమ ఫ్లేవర్ దొరకట్లేదు..”
“నీకోసం రాత్రంతా కష్టపడి ఆ ఫ్లేవర్ తో ఒక చాక్లెట్ తయారు చేశా… తింటావా మరి…”
“తింటా… కాని నాకు ప్యూర్ ప్రేమ కావాలి… అదే ప్యూర్ ప్రేమ చాక్లెట్ కావాలి….”
“ఆ డౌట్ అవసరం లేదు… పక్కా ప్యూర్ ప్రేమ చాక్లెట్ ..”
“ఇంతకు ముందు ఎప్పుడైనా తయారుచేసావా ఇలాంటి చాక్లెట్లు …..”
“లేదు… నిజానికి నాకు ఎలాంటి చాక్లెట్ కంపెనీ లేదు…..”
“మరి నీకు ప్యూర్ ప్రేమ రుచి ఎలా తెలిసింది… ?”
“నీతో పరిచయం నాకు నేర్పింది ….”
“నాది నిజమైన ప్రేమ అని ఏంటి నమ్మకం…..”
“నీ కళ్ళలో నాకు ఆ ఫార్ములా దొరికింది… రాత్రంతా దాన్ని డీకోడ్ చేసాను… అది నిజమైన ప్రేమ ఫ్లేవరే…”
“నువ్వు అంతలా చెప్తుంటే నాకూ ఆ చాక్లెట్ కావాలని అనిపిస్తోంది.. సరే… ఇవ్వు “
“ఇప్పుడు తీసుకు రాలేదు… “
“అయ్యో… ఇప్పుడు తెచ్చావేమో అనుకున్నా…”
“లేదు.. లేదు .. మర్చిపోయా…”
“సరే.. పోనీ నేను ఇస్తా తీసుకో.. ప్రేమ ఫ్లేవరే…. నీకు నచ్చుతుంది… రాత్రంతా నేనూ కష్టపడ్డా.. నీ బుగ్గ పై కన్నీటి చారిక లో ఫార్ములా దొరికింది.. నా గుండె తడి తో తయారుచేసా.. చాక్లెట్ కంపెనీ నాకు కూడా లేదు.. ఈ చాక్లెట్ ఆబగా నువ్వు తింటుంటే… నీ పెదవులకు అంటిన ఆ తీపి గురుతులకు ఒక ఫోటో తీసుకొని దాచుకొంటా… సరేనా… ఊ అనూ…”
(నా ప్రియమైన చాక్లెట్ కి ….. ప్రేమతో నీ ప్రియమైన చాక్లెట్ )