January 10, 2025

TATA IPL 2024 Match 07 CSK VS GT| చెన్నై సూపర్ కింగ్స్ ‘సూపర్ విక్టరీ’|Match Report

చెన్నై సూపర్ కింగ్స్ తన రెండవ విజయాన్ని నమోదు చేసింది. పాయింట్స్ టేబుల్ లో టాప్ పొజిషన్ లో కంటిన్యూ అవుతోంది. ఏకపక్షం గా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ పై 63 పరుగుల తేడా తో సూపర్ విక్టరీ సాధించింది.

Tata IPL 2024 CSK VS GT Match 07

Tata IPL 2024 CSK VS GT Match 07 pic credit: chennaisuperkings.com

TATA IPL 2024 Match 07 CSK VS GT| చెన్నై సూపర్ కింగ్స్ ‘సూపర్ విక్టరీ’|Match Report

చెన్నై సూపర్ కింగ్స్ తన రెండవ విజయాన్ని నమోదు చేసింది. పాయింట్స్ టేబుల్ లో టాప్ పొజిషన్ లో కంటిన్యూ అవుతోంది. ఏకపక్షం గా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ పై 63 పరుగుల తేడా తో సూపర్ విక్టరీ సాధించింది.(TATA IPL 2024 Match 07 CSK VS GT)

ధాటి గా బ్యాటింగ్ ప్రారంభించిన CSK

చెన్నై లోని చిదంబరం స్టేడియం లో ఈ రోజు (మార్చి 26, 2024) జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించిన CSK బ్యాటర్లు గైక్వాడ్ మరియు రచిన్ రవీంద్ర ఆరంభం నుండే GT బౌలర్ల పని పట్టారు. రచిన్ రవీంద్ర 3 సిక్సర్లు, 6 ఫోర్లతో ఒక విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. కేవలం 20 బంతుల్లో 46 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో సాహా కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. అప్పటికి చెన్నై స్కోరు 5.2 ఓవర్ల లో 62 పరుగులు.

రచిన్ అవుట్ అయిన తర్వాత క్రీజు లోనికి వచ్చిన రహానే రుతురాజ్ కు మద్దతు నిస్తూ స్కోరు పెంచడానికి తోడ్పడ్డారు. కేవలం 12 బంతులు మాత్రమే ఆడిన రహానే 12 పరుగులు చేసి జట్టు స్కోరు 104 పరుగుల వద్ద అవుట్ అయ్యారు.

రహానే అవుట్ అయిన తర్వాత శివం దూబే క్రీజ్ లోనికి వచ్చారు. అప్పటికే రుతురాజ్ గైక్వాడ్ చెలరేగి ఆడుతున్నారు. 5 ఫోర్లు, 1 సిక్సర్ సహాయం తో 46 పరుగులు చేసిన రుతురాజ్ స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్ లో సాహా కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. అప్పటికి CSK జట్టు స్కోరు 127/3.

శివాలెత్తిన శివం దూబే (TATA IPL 2024 Match 07 CSK VS GT)

శివం దూబే శివాలెత్తి నట్టు ఆడారు. అతని విధ్వంసాన్ని ఆపడం GT బౌలర్ల తరం కాలేదు. దూబే సిక్సర్ల మోత మోగించారు. మొత్తం 5 సిక్సర్లు బాది GT బౌలర్ల వెన్ను లో చలి పుట్టించారు. కేవలం 23 బంతుల్లో 51 పరుగులు చేసిన దూబే రషీద్ ఖాన్ బౌలింగ్ లో విజయ్ శంకర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. దూబే స్కోరు లో 5 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. దూబే అవుట్ అయ్యే సమయానికి జట్టు స్కోరు 184/4. (TATA IPL 2024 Match 07 CSK VS GT)

దూబే అవుట్ అయిన తర్వాత క్రీజు లోనికి వచ్చిన సమీర్ రిజ్వీ కూడా రెండు సిక్సర్లు కొట్టి అవుట్ అయ్యారు. 6 బంతుల్లో 14 పరుగులు చేసిన రిజ్వీ మోహిత్ శర్మ బౌలింగ్ లో మిల్లర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడం తో జట్టు స్కోరు 199/5 కి చేరింది.

చివరి మూడు బంతుల్లో 7 పరుగులు లభించాయి. రవీంద్ర జడేజా ఒక ఫోర్ కొట్టి 7 పరుగులు చేసిన తర్వాత చివరి బంతి కి రనవుట్ అయ్యారు. ఓపిగ్గా ఆడిన డారెల్ మిచెల్ మాత్రం 20 బంతుల్లో 24 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నారు. దీనితో చెన్నై 20 ఓవర్ల లో 206 పరుగులు చేసి GTముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

GT బౌలింగ్ లో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు ఇచ్చారు. 4 ఓవర్ల లో ఏకం గా 49 పరుగులు ఇవ్వడం ఈ మధ్యకాలం లో ఎప్పుడూ జరగలేదు. ఉమేష్ యాదవ్ కూడా 2  ఓవర్ల లో  ధారాళం గా 27 పరుగులు ఇచ్చారు. అజ్మతుల్లా 3 ఓవర్ల లో 30 పరుగులు సమర్పించు కున్నారు. సాయి కిషోర్, జాన్సన్, మోహిత్ శర్మ లకు ఒక్కొక్క వికెట్ దక్కింది.

CSK పవర్ ప్లే లో ఏకం గా 69 పరుగులు చేయడం, శివం దూబే 5 సిక్సర్ల తో అర్ధ సెంచరీ చేయడం వంటి కారణాలతో 206 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.

పేక మేడ లా కూలిపోయిన GT బ్యాటింగ్

భారీ లక్ష్యం తో బరిలోనికి దిగిన గుజరాత్ కు మూడవ ఓవర్ లోనే గిల్ రూపం లో ఎదురు దెబ్బ తగిలింది. ఇక అప్పటి నుండి వరుసగా వికెట్లు పతనం అవుతూనే ఉన్నాయి. జట్టు స్కోరు 34 పరుగుల వద్ద సాహా, 55 పరుగుల వద్ద విజయ్ శంకర్, 96 పరుగుల వద్ద డేవిడ్ మిల్లర్, 114 పరుగుల వద్ద సాయి సుదర్శన్, 118 పరుగుల వద్ద ఓమర్జాయ్, 121 పరుగుల వద్ద రషీద్ ఖాన్, 129 పరుగుల వద్ద రాహుల్ తెవాటియా అవుట్ అయ్యారు.

GT నెట్ రన్ రేట్ పై తీవ్ర ప్రభావం

GT బ్యాటర్లు ఎవరూ ప్రభావం చూపలేక పోయారు. కేవలం సాయి సుదర్శన్ మాత్రం 3 ఫోర్ల సహాయం తో 37 పరుగులు చేసారు. జట్టు లో అత్యధిక స్కోరు అదే. మిగిలిన బ్యాటర్లు అందరూ విఫలం కావడం తో గుజరాత్ 143/8 పరుగులు మాత్రం చేయగలిగింది. దారుణం గా 63 పరుగుల తేడా తో ఓడిపోవడం తో నెట్ రన్ రేట్ పై ప్రభావం పడింది. -1.425 గా నెట్ రన్ రేట్ ఉండటం తో ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జరగబోయే మ్యాచ్ లలో భారీ విజయాలు సొంతం చేసుకుంటే తప్ప గుజరాత్ టైటన్స్ మళ్ళీ దారిలో పడదు.

చెన్నై అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసింది. ఫీల్డింగ్ కూడా ఆదరగొట్టింది. ధోనీ సంగతి సరేసరి. వికెట్ల వెనుక చురుగ్గా కదలడమే కాకుండా అద్భుతమైన ఒక క్యాచ్ అందుకున్నారు ధోనీ. దాదాపు రెండు మీటర్లు గాలిలో ఎగిరి ధోనీ పట్టిన క్యాచ్ ఇన్నింగ్స్ కే హైలెట్ గా నిలుస్తుంది. దీపక్ చాహర్, ముస్తాఫిజుర్, తుషార్ దేశ్ పాండే రెండేసి వికెట్లు తీసారు. డారెల్ మిచెల్, పతిరణ ఒక్కొక్క వికెట్ చొప్పున తీసారు. జడేజా కు వికెట్ దక్కలేదు.

చివరికి 63 పరుగుల తేడాతో CSK ఘన విజయం సాధించింది. దీనితో CSK పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచింది. నెట్ రన్ రేట్ కూడా భారీగా పెరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా శివం దూబే ఎంపిక అయ్యారు.

 

నేటి పాయింట్స్ టేబుల్ (26 మార్చి, 2024)

S.NoTeamMWLNRRPts
1CSK2201.9794
2RR1101.0002
3KKR1100.2002
4PBKS2110.0252
5RCB211-0.1802
6GT211-1.4252
7SRH101-0.2000
8MI101-0.3000
9DC101-0.4550
10LSG101-1.0000

(S.No – Serial Number, M-Match, W-Won, L-Loss, NRR-Net Run Rate, Pts-Points)