Current Affairs Telugu 010|అంతర్జాతీయ ఎనర్జీ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది| ఆపరేషన్ డెవిల్ హంట్ దేనికి సంబంధించినది|
ఆపరేషన్ డెవిల్ హంట్ దేనికి సంబంధించినది? భారత చిరు ధాన్యాల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? అంతర్జాతీయ ఎనర్జీ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఇటువంటి కరెంట్ అఫైర్స్ తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.

Current Affairs Telugu 010 - 10-02-2025
Current Affairs Telugu 010|అంతర్జాతీయ ఎనర్జీ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది| ఆపరేషన్ డెవిల్ హంట్ దేనికి సంబంధించినది|
అనిశ్చితి లో అమెరికా లోని విదేశీ విద్యార్ధులు
ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత తమ దేశంలో చదువుతున్న విదేశీ విద్యార్దుల పరిస్థితి దారుణం గా తయారయ్యింది. గణాంకాల ప్రకారం భారత దేశం నుండి 2022-23 సంవత్సరం లో అమెరికా వెళ్ళిన విద్యార్దుల సంఖ్య – 2,68,923 (రెండు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు). 2023-24 సంవత్సరం లో భారత్ నుండి అమెరికా వెళ్ళిన విద్యార్దుల సంఖ్య – 3,31,602 (మూడు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల రెండు). ప్రస్తుతం అమెరికా లో ఉన్న మొత్తం విదేశీ విద్యార్ధుల సంఖ్య 11.26 లక్షలు. ఈ మొత్తం విద్యార్దులలో భారత విద్యార్దుల శాతం 29. (Current Affairs Telugu 010)
భారత్ తర్వాత అత్యధికం గా చైనా నుండి విద్యార్దులు అమెరికా కు వెళ్తారు. లక్షల రూపాయలు అప్పులు చేసి అమెరికా వెళ్లి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న వారికి ట్రంప్ సర్కారు నుండి ఇబ్బందులు ఎదురౌతున్నాయి. తమ చదువులు పూర్తి చేసుకుని ఎంత త్వరగా ఇండియా వెళ్ళిపోదామనే ఆత్రుత ప్రస్తుతం మన విద్యార్దులలో కనిపిస్తోంది.
విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు పెరగాలి
ప్రతి ఏటా దేశం లో విద్యుత్ వాహనాలు (EV) వినియోగం పెరుగుతోంది. దీనికి అనుగుణం గా చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేవని ఇటీవల ఒక నివేదిక ప్రకారం తెలుస్తోంది. ‘గేమ్ చేంజర్ లా అడ్వైజర్స్ అండ్ స్పెషల్ ఇన్వెస్ట్’ (Game Changer Law Advisors and Special Invest) ఈ మధ్య విద్యుత్ వాహనాలకు సంబంధించి ఒక నివేదిక ను విడుదల చేసింది. చార్జింగ్ అహెడ్-2 నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశం లో ఉన్న చార్జింగ్ స్టేషన్ ల సంఖ్య 12,146 . అయితే 2030 నాటికి దేశం లో విద్యుత్ వాహనాల వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి కనీసం 39 లక్షల చార్జింగ్ స్టేషన్ లు అవసరం అవుతాయని ఈ నివేదిక పేర్కొంది.
అంతర్జాతీయ ఎనర్జీ ఫెస్టివల్ విశేషాలు (Current Affairs Telugu 010)
అంతర్జాతీయ ఎనర్జీ ఫెస్టివల్ కేరళ లో ప్రస్తుతం జరుగుతోంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (Bureau of Energy Efficiency-BEE) ఈ సందర్భం గా గృహోపకరణాల పై స్టార్ రేటింగ్ వలన 81.64 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేయగలిగామని పేర్కొంది. 2006 వ సంవత్సరం లో BEE స్టాండర్డ్ లెబెల్లింగ్ ప్రోగ్రాం (Standard Labelling Program) ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం తో విద్యుత్ తో పనిచేసే గృహోపకరణాలు అన్నిటికీ స్టార్ రేటింగ్ ఇవ్వడం ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకూ రూ 54,324 కోట్ల రూపాయలు ఆదా చేయగలిగామని BEE తెలిపింది.
మనం సాధారణం గా ఇళ్ళలో ఉపయోగించే టీవీలు, ఫ్రిడ్జ్ లు,వాషింగ్ మెషీన్లు, ఏసీలు ఫ్యాన్ లు, కూలర్ లు వంటి అనేక గృహోపకరణాల పై విద్యుత్ ఆదా చేసే సామర్ధ్యాన్ని స్టార్ చిహ్నాల ద్వారా గుర్తిస్తారు. 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం ద్వారా వినియోగదారునికి ఒక అవగాహన ఉంటుంది. ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఉపకరణాల కొనుగోలు వలన ఎక్కువ విద్యుత్ ఆదా జరుగుతుంది. ఈ రేటింగ్ ను వివిధ ఉపకరణాల మీద ముద్రించడానికి ఆయా కంపెనీలకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషిఎన్సీ (BEE) అనుమతి ఇస్తుంది.
మణిపూర్ ముఖ్య మంత్రి రాజీనామా(Current Affairs Telugu 010)
మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేసారు. మణిపూర్ లో చాలా కాలం గా జరుగుతున్న అల్లర్లను అదుపు చేయలేకపోవడం తో దేశ వ్యాప్తం గా ఆయన తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఈ సందర్బం గా మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ను కలిసి తాను, తమ మంత్రివర్గం మొత్తం రాజీనామా చేస్తున్నట్టు లేఖను అందజేశారు. (Current Affairs Telugu 010)
ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ ఘడ్ – మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపం లో ఉన్న మద్దేడు – పర్సేగూడ ప్రాంతం లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన 31 మందిలో మహిళలు 11 మంది ఉన్నారు.
పొగాకు బోర్డు కు త్రిపుర కేడర్ అధికారి నియామకం
ఏపీ లో ఉన్న పొగాకు బోర్డు ఈడీ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ) గా త్రిపుర కేడర్ కు చెందిన బి. విశ్వశ్రీ నియమితులయ్యారు. ఆమె త్రిపుర కేడర్ కు చెందిన ఐ.ఏ ఎస్ అధికారి. ప్రస్తుతం ఈ పదవి లో అద్దంకి దయాకర్ బాబు ఉన్నారు. త్వరలో ఆయన పదవీ కాలం ముగిసిపోవడం తో కొత్త కొత్త అధికారిని నియమించారు. ఈ పదవి లో విశ్వశ్రీ నాలుగేళ్ల పాటు కొనసాగుతారు.
భారత చిరు ధాన్యాల పరిశోధనా సంస్థ (IIMR) పదవ వ్యవస్థాపక దినోత్సవం
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిలెట్స్ రీసెర్చ్ -Indian Institute of Millets Research (IIMR) సంస్థ యొక్క పదవ వ్యవస్థాపక దినోత్సవం రాజేంద్రనగర్ లో జరిగింది. ఐఐఎమ్ఆర్ సంస్థ ప్రధాన కార్యాలయం రాజేంద్రనగర్ (హైదరాబాద్) లో ఉంది. ఈ సందర్భం గా ఈ సంస్థ డైరక్టర్ సి. తారాసత్యవతి మాట్లాడుతూ రైతులు చిరుదాన్యాలను విరివి గా పండించాలని కోరారు. భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ ఇతర రాష్ట్రాలలో కూడా చిరుధాన్యాల సాగు పై ప్రత్యేక పరిశోధనలు చేస్తోందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం లో భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) డిప్యూటీ డైరక్టర్ జనరల్ ఆర్.సి. అగర్వాల్ కూడా పాల్గొన్నారు. (Current Affairs Telugu 010)
ఆపరేషన్ డెవిల్ హంట్ దేనికి సంబంధించినది
బంగ్లాదేశ్ లో ఇటీవల మరలా చెలరేగిన అల్లర్లను అరికట్టడానికి ప్రభుత్వం ‘ఆపరేషన్ డెవిల్ హంట్’ అనే ప్రత్యేకమైన ఆపరేషన్ ను ప్రారంభించింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి, అవామీ లీగ్ పార్టీ అధ్యక్షురాలు షేక్ హసీనా ఇటీవల ఆన్ లైన్ లో తన మద్దతు దారులను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత బంగ్లాదేశ్ లో అల్లర్లు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భం గా ఆపరేషన్ హంట్ ను ప్రారంభించిన యూనుస్ ప్రభుత్వం అల్లర్ల తో సంబంధం ఉన్న నలభై మందిని ఇప్పటికే అరెస్టు చేసింది.