January 10, 2025

cyber crime news password scam| పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే అంతే సంగతులు

0

ఈ ఆన్ లైన్ మోసగాళ్ళు ఎన్నో కొత్త కొత్త పద్ధతుల ద్వారా మన అకౌంట్ లోని సొమ్మును తస్కరించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తత తో వ్యవహరించడం అవసరం.

cyber crime news password scam

cyber crime news password scam

cyber crime news password scam| పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే అంతే సంగతులు

సరిక్రొత్త పద్దతులలో సైబర్ నేరాలు చేస్తున్నారు. ప్రతి రోజూ కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. చదువు లేని వారి దగ్గర నుండి సమాజం లో అత్యున్నత స్థానం లో ఉన్న మేధావుల వరకూ మోస పోతున్నారు. రోజుకో కొత్త పధ్ధతి లో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. ఇటువంటి సైబర్ నేరాల మోడస్ అపరాండి తెలియజేయడమే ఈ వార్తా కధనాల ముఖ్య ఉద్దేశ్యం.(cyber crime news password scam)

ఎప్పటికప్పుడు కొత్త పద్దతుల ద్వారా డబ్బు దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. ఇటీవల కాలం లో మరో కొత్త పద్ధతి వెలుగు లోనికి వచ్చింది. అదే పాస్ వర్డ్ స్కాం.

ప్రస్తుతం అందరూ ఆన్ లైన్ విధానం లోనే తమ ఆర్దిక లావాదేవీలు చేస్తున్నారు. తమ అకౌంట్ల కు గల  గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటికి తప్పకుండా పాస్ వర్డ్ సెట్ చేసుకుంటాం. ప్రస్తుతం ఈ పాస్ వర్డ్ ని టార్గెట్ చేసి డబ్బు దోచుకుంటున్నారు.

ఈ స్కాం ఎలా చేస్తారంటే.

ముందుగా మన అకౌంట్ లోనికి కొంత డబ్బు పంపిస్తారు. వంద నుండి ఐదు వేల రూపాయల వరకూ ఎంతో కొంత సొమ్మును మన అకౌంట్ లోనికి పంపిస్తారు. దానితో మన అకౌంట్ లో డబ్బు డిపాజిట్ అయినట్లు మనకు ఎలర్ట్ వస్తుంది. ఎవరు పంపించారో అని ఆప్ ని తెరచి చూస్తాం. ఒకవేళ  మనం చూడకపోతే వాళ్ళే మనకి ఫోన్ చేస్తారు. ఇలా మీ అకౌంట్ లో పొరపాటున డబ్బు డిపాజిట్ అయింది కావాలంటే ఒకసారి చెక్ చేయండి అని చెప్తారు. వెంటనే మనం మనం మన పాస్ వర్డ్ ఎంటర్ చేసి కొత్తగా ఏమైనా డబ్బు మన అకౌంట్ లో పడిందా అని చెక్ చేస్తాం.

అంతే… మన పాస్ వర్డ్ ఎంటర్ చేసిన మరుక్షణం మన ఎకౌంట్ లో ఉన్న డబ్బు ఖాళీ అయిపోతుంది. మనం ఎప్పుడు మన పాస్ వర్డ్ ఎంటర్ చేస్తామా అని సైబర్ నేరగాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే మన పాస్ వర్డ్ ఎంటర్ చేస్తామో మన అకౌంట్ మొత్తం ఖాళీ చేయడానికి అన్నీ రెడీ చేసుకొని ఎదురు చూస్తూ ఉంటారు. పాస్ వర్డ్ ఎంటర్ చేసిన మరుక్షణం మన అకౌంట్ లో నుండి డబ్బు మొత్తం తీసివేస్తారు.

దీనిని ఎలా ఎదుర్కోవాలి అంటే…

మొదటి సారి పాస్ వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు తప్పు గా ఎంటర్ చేయడం. ఇలా చేయడం వలన అవతలి వారిని మనమే బోల్తా కొట్టించి నట్లు అవుతుంది. ఇప్పటికి ఇదే విరుగుడు. ఆ తర్వాత మనం రెగ్యులర్ గా ఉపయోగించే పాస్ వర్డ్ ఉపయోగించి మన పని చేసుకోవచ్చు.

అయితే ఈ ఆన్ లైన్ మోసగాళ్ళు ఎన్నో కొత్త కొత్త పద్ధతుల ద్వారా మన అకౌంట్ లోని సొమ్మును తస్కరించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తత తో వ్యవహరించడం అవసరం. అతి విశ్వాసం (ఓవర్ కాన్ఫిడెన్స్) తో ఆర్దిక లావాదేవీలు నిర్వహిస్తే ఆన్ లైన్ లో ఏదో ఒక రూపం లో మనం డబ్బును కోల్పోవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్త అవసరం.

ఇది లేటెస్ట్ ఆన్ లైన్ మోసం. ఇటువంటి అనేక రూపాలలో ఆన్ లైన్ మోసాలు జరుగుతాయి. అప్రమత్తం గా ఉండండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *