January 10, 2025

Day 2 Highlights of India vs England 3rd Test- 500 వికెట్ల క్లబ్ లో అశ్విన్

అశ్విన్ టెస్టుల్లో తన 500 వికెట్ ను తీసుకొని ఆ ఘనత సాధించిన రెండవ భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. గత టెస్టు లోనే సాధించవలసిన ఈ ఘనత ను రాజ్ కోట్ లో క్రాలే ను అవుట్ చెయ్యడం ద్వారా  తన స్వంతం చేసుకున్నాడు.ఈ రిక్దార్డు సాధించిన  రెండవ భారత బౌలర్ అశ్విన్. ఇంతకు ముందు కుంబ్లే ఈ ఘనత ను సాధించారు.

Ind vs Eng 3rd Test - Ashwin 500 wicket club

Ind vs Eng 3rd Test - Ashwin in 500 wicket club pic credit: X

Day 2 Highlights of India vs England 3rd Test- 500 వికెట్ల క్లబ్ లో అశ్విన్

భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టు రెండవరోజు రెండు జట్లూ తీవ్రం గా శ్రమించాయి. తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది.(Day 2 Highlights)

326 పరుగుల ఓవర్ నైట్ స్కోరు తో రెండవ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు కుల్దీప్ రూపం లో 331 పరుగుల వద్ద 6 వ వికెట్ ను కోల్పోయింది. అదే స్కోరు వద్ద రవీంద్ర జడేజా కూడా అవుట్ అయ్యాడు. 112 (225 బంతుల్లో 9ఫోర్లు, 2 సిక్సర్ల తో) చేసి రూట్ బౌలింగ్ లో రూట్ కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అశ్విన్ , జురేల్ మధ్య భారీ భాగస్వామ్యం 

మొదటి మ్యాచ్ ఆడుతున్న జ్యురేల్ ఎటువంటి తడబాటు కి గురి కాకుండా నిలకడ గా ఆడాడు. మరొక ప్రక్క అశ్విన్ కూడా ఇంగ్లాండ్ బౌలర్లను సమర్దవంతం గా ఎదుర్కోవడం తో 8 వ వికెట్ కు అభేద్యమైన 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 6 ఫోర్లు కొట్టి 37 పరుగులు చేసిన అశ్విన్ రెహాన్ బౌలింగ్ లో అండర్సన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీనితో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. (Day 2 Highlights)

మొదటి మ్యాచ్ లోనే  చెలరేగి ఆడిన జ్యురేల్ 

మొదటి మ్యాచ్ ఆడుతున్నప్పటికీ జ్యురేల్ కళ్ళు చెదిరే షాట్లు ఆడాడు. 3 సిక్సర్లు , 2 ఫోర్ల తో 46 పరుగులు చేసి దురదృష్టవ శాత్తూ అవుట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ చేసి ఉంటే మొదటి మ్యాచ్ లోనే అర్ధ సెంచరీ చేసిన కీపర్ బ్యాట్స్ మన్ గా చరిత్ర సృష్టించే వాడు. ఏమైనప్పటికీ మొదటి మ్యాచ్ లోనే తన అవసరం ఏంటో అందరికీ తెలియ జేశాడు.

బుమ్రా – సిరాజ్ 30 పరుగుల భాగస్వామ్యం(Day 2 Highlights)

మరొక ప్రక్క బుమ్రా కూడా చక్కగా ఆడుతూ అతి విలువైన 26 పరుగులు చేసి వుడ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా ఆవుట్ కావడం తో భారత ఇన్నింగ్స్ ముగిసింది. సిరాజ్, బుమ్రా మధ్య చివరి వికెట్ కు  30 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. మొదటి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. మార్క్ వుడ్ మాత్రమే రాణించి 4 వికెట్లు తీసుకున్నాడు. రెహాన్ అహ్మద్ 2 వికెట్లు, అండర్సన్, హర్ట్లీ, రూట్ ఒక్కొక్క వికెట్ చొప్పున తీసుకున్నారు.

ధాటి గా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ (Day 2 Highlights)

ఇంగ్లాండ్ తమ ఇన్నింగ్స్ ను ధాటి గా ప్రారంభించింది.. క్రాలీ, డకేట్ మొదటి వికెట్ కు 89 పరుగులు జోడించారు. దీనిలో  డకేట్ స్కోరే ఎక్కువ . క్రాలీ 28 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో  అవుట్ అయ్యాడు.

500 పరుగుల క్రికెట్ క్లబ్ లో అశ్విన్

అశ్విన్ టెస్టుల్లో తన 500 వికెట్ ను తీసుకొని ఆ ఘనత సాధించిన రెండవ భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. గత టెస్టు లోనే సాధించవలసిన ఈ ఘనత ను రాజ్ కోట్ లో క్రాలే ను అవుట్ చెయ్యడం ద్వారా  తన స్వంతం చేసుకున్నాడు.ఈ రిక్దార్డు సాధించిన  భారత్ కు చెందిన రెండవ బౌలర్ అశ్విన్. ఇంతకు ముందు కుంబ్లే ఈ ఘనత ను సాధించారు. ప్రపంచ టెస్ట్ క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్ళ లో ఈ ఘనత సాధించిన 9 వ బౌలర్ అశ్విన్. అలాగే తక్కువ టెస్టు లలో ఈ ఘనత సాధించిన రెండవ బౌలర్ అశ్విన్. మురళీధరన్  టెస్టు లలోనే ఈ వికెట్లు సాధిస్తే అశ్విన్ మాత్రం 98 టెస్టుల్లో ఈ రికార్డు స్థాపించాడు.

తర్వాత క్రీజ్ లోనికి వచ్చిన ఒలీ పోప్ మరియు డకేట్ జంటను విడదీయడం భారత్ బౌలర్ల సాధ్యం కాలేదు. రోహిత్ శర్మ అందరు బౌలర్లను ప్రయోగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. డకేట్ ఫోర్లు, సిక్సర్ల తోనే ఎక్కువ రన్స్ రాబట్టాడు. ఒలీ పోప్ 39 పరుగులకు సిరాజ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు.

డకేట్ విశ్వరూపం – రికార్డులు 

ఆట ముగిసే సమయానికి డకేట్ 21 ఫోర్లు, 2 సిక్సర్ల తో చెలరేగి ఆడి కేవలం 118 బంతుల్లో  133 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. ఒకే సెషన్ లో 100 పరుగులు మరియు  భారత గడ్డ పై టెస్టుల్లో వేగం గా సెంచరీ చేసిన  ఆటగాడిగా ఘనత సాధించాడు. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. కేవలం 35 ఓవర్ల లోనే ఈ స్కోరు సాధించడం విశేషం. దీనితో ఇంగ్లాండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్ లో ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది.

మూడవ రోజు వీలైనంత త్వరగా ఇంగ్లాండ్ జట్టును కట్టడి చేయాలి. ముందు డకేట్ ను అవుట్ చేస్తే మిగిలిన బ్యాట్స్ మన్ పై ఒత్తిడి పెరుగుతుంది. అయితే డకేట్ డబుల్ సెంచరీ వైపు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. కాబట్టి వీలైంత తక్కువ స్కోరు కు అవుట్ చేయడం ద్వారా  ప్రత్యర్ధి పై ఒత్తిడి పెంచవచ్చు.

రెండవరోజు స్టార్ ప్లేయర్స్ : జ్యురేల్, అశ్విన్, డకేట్