DAY 3 Highlights Ind vs Eng 3rd Test- సిరాజ్ కి 4 వికెట్లు, జైస్వాల్ సెంచరీ
రాజ్ కోట్ టెస్టు లో మూడవ రోజు భారత్ బౌలింగ్ మరియు బ్యాటింగ్ రంగాలలో ప్రతిభ చూపింది. సిరాజ్ ఈ సీరీస్ లోనే మొదట గా 4 వికెట్లు సాధించి ఇంగ్లాండ్ ను తక్కువ స్కోరు కే ఆలౌట్ చేసాడు. రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టులో యశస్వీ జైస్వాల్ అద్భుతం గా రాణించి సెంచరీ చేసాడు
DAY 3 Highlights Ind vs Eng 3rd Test- సిరాజ్ కి 4 వికెట్లు, జైస్వాల్ సెంచరీ
రాజ్ కోట్ టెస్టు లో మూడవ రోజు భారత్ బౌలింగ్ మరియు బ్యాటింగ్ రంగాలలో ప్రతిభ చూపింది. సిరాజ్ ఈ సీరీస్ లోనే మొదట గా 4 వికెట్లు సాధించి ఇంగ్లాండ్ ను తక్కువ స్కోరు కే ఆలౌట్ చేసాడు. రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టులో యశస్వీ జైస్వాల్ అద్భుతం గా రాణించి సెంచరీ చేసాడు. కాలి కండరాలు పట్టేయడం తో రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. మరొక ప్రక్క గిల్ కూడా ఫాం లోనికి వచ్చి అర్ధ సెంచరీ చేసాడు. దీనితో ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఇంగ్లాండ్ జట్టు పై 322 పరుగుల ఆధిక్యం లో పటిష్టమైన స్థితి లో ఉంది. Highlights Ind vs Eng 3rd Test
సిరాజ్ దెబ్బకి త్వరగా ఆలౌట్ అయిన ఇంగ్లాండ్
భారీ అంచనాలతో భారీ స్కోరు చేసే పరిస్తితుల్లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ త్వర త్వరగా వికెట్లు కోల్పోయింది. డబుల్ సెంచరీ చేస్తాడని భావించిన డకేట్ 153 పరుగులకు అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ జట్టు లో రూట్ (18 పరుగులు), బెయిర్ స్టో (0) , స్టోక్స్ (41 పరుగులు), ఫోక్స్ (13 పరుగులు) చేసి అవుట్ అయ్యారు. రెహాన్ అహ్మద్, టాం హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్ సింగిల్ డిజిట్ కే అవుట్ కావడం తో ఇంగ్లాండ్ జట్టు 310 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సిరాజ్ 4 వికెట్లు తీసుకోగా, కుల్దీప్, జడేజా రెండేసి వికెట్లు, బుమ్రా, అశ్విన్ ఒక్కొక్క వికెట్ చొప్పున తీసుకున్నారు.
అశ్విన్ ఆడలేదు ఈ రోజు (Highlights Ind vs Eng 3rd Test)
ఈ రోజు అశ్విన్ మైదానానికి రాలేదు. తల్లి అనారోగ్యం దృష్ట్యా వెంటనే చెన్నై వెళ్ళినందువలన భారత్ నలుగురు బౌలర్ల తోనే ఆడింది.
విశ్వరూపం మరొక సారి చూపిన జైస్వాల్
రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన భారత ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ కేవలం 19 పరుగులు చేసి అవుట్ కావడం తో భారం అంతా జైస్వాల్ మరియు గిల్ పై పడింది. మొదట్లో కొంచం నెమ్మదిగా ఆడిన జైస్వాల్ తన విశ్వరూపం మరొక సారి చూపించాడు. ఫోర్లు సిక్సర్ల తో విరుచుకు పడ్డాడు. 133 బంతుల్లో 104 పరుగులు చేసాడు జైస్వాల్. ఈ స్కోరు లో 5 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. కాలి కండరాలు పట్టేయడం తో రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. అయితే తర్వాతి రోజు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. రిటైర్డ్ అవుట్ అయితే బ్యాటింగ్ చేసే అవకాశం ఉండదు.
పుంజుకొన్న గిల్
మరొక ప్రక్క గిల్ చాలా కష్టపడుతూ ఆడాడు. గిల్ గాడిలో పడటానికి చాలా సమయం పట్టింది. ఫాం కోల్పోయిన స్థితి లో ఉన్న గిల్ మెల్లగా పుంజుకొని అర్ద సెంచరీ చేసాడు.
అవకాశం జార విడుచుకొన్న రజిత్ పాటిదార్(Highlights Ind vs Eng 3rd Test)
జైస్వాల్ రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన రజిత్ పటిదార్ అసలు ఆకట్టు కోలేకపోయాడు. నిర్లక్ష్యం గా ఆడి వికెట్ సమర్పించు కొన్నాడు. రెండు ఇన్నింగ్స్ లో సరైన బ్యాటింగ్ చేయలేనందువలన వచ్చే టెస్టు లలో తన స్థానం ప్రశ్నార్ధకం కావచ్చు.
కనీసం 500 స్కోరు చేస్తే విజయం మనదే
నైట్ వాచ్ మాన్ గా క్రీజ్ లోనికి వచ్చిన కులదీప్ 3 పరుగులతో, గిల్ 65 పరుగులతో ఆడుతున్నారు. ఇప్పటికే ఇంగ్లాండ్ పై 322 పరుగుల ఆధిక్యం లో ఉన్న భారత్ రేపు మరింత స్కోరు చేసి కనీసం 500 పరుగుల ఆధిక్యం ఇవ్వగలిగితే ఈ టెస్టు లో భారత్ విజయం తధ్యం అని చెప్పవచ్చు.
ఈ రోజు స్టార్ ప్లేయర్లు :
4 వికెట్లు తీసుకొన్న సిరాజ్, అద్భుతమైన సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ ఈ స్టార్ ప్లేయర్లు గా చెప్పవచ్చు.