Donald Trump Inauguration|అమెరికా 47 వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్
ఈ కార్యక్రమం లో ట్రంప్ ఆద్యంతం చాలా హుషారుగా కనిపించారు. ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు తన భార్య మెలానియా ని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆమె తలకు పెట్టుకున్న క్యాప్ అడ్డు రావడం తో ఆగిపోయారు. కార్యక్రమం లో అందరినీ పలకరిస్తూ ఆకట్టుకున్నారు.

Donald Trump Inauguration
Donald Trump Inauguration| అమెరికా 47 వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్
అమెరికా దేశ 47 వ అధ్యక్షుడిగా డొనాల్డ్ జాన్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన తో పాటు ఉపాద్యక్షుడిగా జే.డీ వాన్స్ కూడా ప్రమాణ స్వీకారం చేసారు. నాలుగేళ్ల విరామం తర్వాత డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ వైట్ హౌస్ లో అడుగు పెట్టారు. ఇంతకుముందు ఆయన అమెరికా దేశపు 45 వ అధ్యక్షుడిగా కూడా పనిచేసారు.(Donald Trump Inauguration)
ఎక్కడ జరిగింది అంటే..
వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో గల క్యాపిటల్ హిల్ భవనం లో ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం అంగ రంగ వైభవం గా జరిగింది. క్యాపిటల్ హిల్ భవనం లోని రొటుండా హాల్ లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. సోమవారం అనగా జనవరి 20, 2025 మధ్యాహ్నం (భారత కాల మానం ప్రకారం రాత్రి 10 గంటలకు) ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యింది.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్నిట్రంప్ మద్దతు దారులు, అభిమానుల సమక్షం లో ఆరు బయట నిర్వహించ డానికి బదులుగా రొటుండా హాల్ లో ఏర్పాటు చేసారు. మైనస్ డిగ్రీలలో చలి రికార్డు కావడం తో ఈ కార్యక్రమాన్ని హాల్ లోనే ఏర్పాటు చేసారు.
వైట్ హౌస్ లో జో బైడెన్ దంపతులు ట్రంప్ దంపతులకు తేనీటి విందు ఇచ్చారు. ఆ తర్వాత ట్రంప్ బైడెన్ ఇద్దరూ ఒకే కార్ లో క్యాపిటల్ హిల్ కు కలిసి వెళ్ళారు. రొటుండా హాల్ లోనికి వీరిద్దరూ ప్రవేశించ గానే సభ లోని వారు అందరూ హర్షాతిరేకాల తో చప్పట్లు కొట్టారు. కాబోయే అద్యక్షుడు ట్రంప్ కు ,ఉపాద్యక్షుడు జే.డీ.వాన్స్ కు స్వాగతం పలికారు.(Donald Trump Inauguration)
ముందుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రెట్ కవనా ఉపాధ్యక్షునిగా జే.డీ. వాన్స్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జే.డీ. వాన్స్ ప్రమాణం చేస్తున్నంత సేపూ ఆయన సతీమణి ఉషా ఈవాన్స్ ఆయన ప్రక్కనే ఉండి చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.
హుషారు గా కనిపించిన ట్రంప్
ఆ తర్వాత ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసారు. సుప్రీంకోర్టు మరొక ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణ పత్రాన్ని ముందుగా చదువుతుండగా ట్రంప్ చిరునవ్వుతో ప్రమాణం చేసారు. ఈ కార్యక్రమం లో ట్రంప్ ఆద్యంతం చాలా హుషారుగా కనిపించారు. ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు తన భార్య మెలానియా ని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆమె తలకు పెట్టుకున్న క్యాప్ అడ్డు రావడం తో ఆగిపోయారు. కార్యక్రమం లో అందరినీ పలకరిస్తూ ఆకట్టుకున్నారు.
ప్రమాణ స్వీకారం అనంతరం అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత ట్రంప్ ప్రసంగించారు.
అమెరికాను అన్ని రంగాలలోనూ ముందుకు తీసుకు వెళ్తానని, అమెరికా కు స్వర్ణ యుగం ప్రారంభం అయ్యిందని జాతి ప్రజల ను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజు అమెరికా విముక్తి దినం అని, తన ద్వారా ఈ దేశానికి ఇంకా మంచి చేయడానికే తనపై జరిగిన హత్యాయత్నం నుండి దేవుడు కాపాడాడు అంటూ ఉద్వేగం గా ప్రసంగించారు.
ట్రంప్ ప్రసంగం లో విశేషాలు ఇవే Donald Trump Inauguration
ట్రంప్ తన ప్రసంగం లో అనేక సంచలనాత్మక ప్రకటనలు చేసారు. అమెరికా ఫస్ట్ అనే నినాదం తో ముందుకు వెళ్తామని చెప్పారు. దక్షిణ సరిహద్దు అయిన మెక్సికో ప్రాంతం లో అక్రమ చొరబాట్లను నిరోధించడానికి జాతీయ ఎమర్జెన్సీ ని ప్రకటించారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో ను గల్ఫ్ ఆఫ్ అమెరికా గా పేరు మార్చారు. అంతర్జాతీయ రవాణా కు సంబంధించిన పనామా కాలువను వెంటనే స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అలాగే పారిస్ పర్యావరణ ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. బైడెన్ పాలన లో కునారిల్లిన అన్ని రంగాలను ప్రధానం గా విద్య, ఆరోగ్య, ఆర్ధిక వ్యవస్థ లు అన్నిటినీ గాడిన పెడతామని చెప్పారు. ధరలను అదుపు చేయడానికి ద్రవ్యోల్బణాన్ని అదుపు లోనికి తీసుకు వస్తామని ట్రంప్ ప్రకటించారు.
హాజరైన ప్రముఖులు వీరే
ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరు అయ్యారు. గతం లో అమెరికా అధ్యక్షులు గా పనిచేసిన జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్ సతీ సమేతం గా విచ్చేశారు. అలాగే బరాక్ ఒబామా కూడా హాజరు అయిన వారిలో ఉన్నారు.
వివిధ దేశాలకు చెందిన దేశాధినేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. అమెరికా చరిత్రలోనే అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ఇలా ఇతర దేశాధినేతలు హాజరు కావడం ఇదే మొదటిసారి.
అర్జెంటీనా అద్యక్షుడు జేవియర్ మెయిలీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ హాజరు అయ్యారు. భారత్ తరపున విదేశాంగ శాఖా మంత్రి ఎస్. జైశంకర్ హాజరు అయ్యారు. ముఖేష్ అంబానీ ఆయన సతీమణి నీతా అంబానీ కూడా హాజరు అయ్యారు.(Donald Trump Inauguration). వీరితో పాటు అనేక మంది ప్రముఖులు హాజరు అయ్యారు.
ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్, జెఫ్ బెజోస్, సుందర్ పిచాయ్,రూపర్ట్ మర్దోక్, టిం కుక్ వంటి అనేక మంది టెక్ నిపుణులు, పారిశ్రామిక వేత్తలు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.