DR BR AMBEDKAR GURUKULAMS – 5th మరియు 1st ఇంటర్ అడ్మిషన్ లకు నోటిఫికేషన్…
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో అడ్మిషన్ లకు నోటిఫికేషన్…
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 5 వ తరగతిలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం లో అడ్మిషన్ లకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. 5 వ తరగతి వారికి , ఇంటర్ మొదటి సంవత్సరం లో చేరే వారికి ముందుగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి 5 వ తరగతి లోనూ, ఇంటర్ మొదటి సంవత్సరం లోనూ ప్రవేశం కల్పిస్తారు. వీరికి ఇంగ్లీష్ మీడియం లో బోధిస్తారు. ఈ గురుకులాల్లో చేరిన వారికి విద్య, వసతి సౌకర్యాలు అన్నీ ఉచితం గా లభిస్తాయి.(DR BR AMBEDKAR GURUKULAMS)
5 వ తరగతి లో చేరే వారికి అర్హతలు ఇవే….(DR BR AMBEDKAR GURUKULAMS)
- విద్యార్ధులు తమ స్వంత జిల్లాలో 2022 – 23 విద్యా సంవత్సరం లో 3 వ తరగతి, 2023 – 24 విద్యా సంవత్సరంలో 4 వ తరగతి చదువుతూ ఉండాలి. 4 వ తరగతి ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ శాలలో చదివి ఉండాలి.
- విద్యార్ధి తల్లి దండ్రుల / సంరక్షకుల యొక్క వార్షికాదాయం లక్ష రూపాయలకు మించి ఉండకూడదు.
- SC, ST విద్యార్ధులు 01-09-2011 మరియు 31-08-2015 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి.
- OC, BC, Converted Christians (BC-C) విద్యార్ధులు 01-09-2013 మరియు 31-08-2015 మధ్య జన్మించి ఉండాలి.
- అన్ని గురుకుల విద్యాలయాల్లో SC – 75%, BC-C (Converted Christians) – 12 %, , ST – 6%, BC – 5% ఇతరులకు 2% చొప్పున సీట్లు కేటాయిస్తారు.
- వికలాంగులకు 3% , సైనిక ఉద్యోగుల పిల్లలకు, ఇతర ప్రత్యేక కేటగిరీ ల వారికి 15% సీట్లు కేటాయిస్తారు.
ఎలా అప్లయి చేసుకోవాలంటే…
- ఆన్ లైన్ ద్వారా అప్లయి చేసుకోవాలి. https://apbragcet.apcfss.in అనే వెబ్ సైట్ ను సందర్శించాలి
- 25-01-2024 నుండి 23-02-2024 వరకు మాత్రమే అప్లయి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
- ఎటువంటి ఫీజు చెల్లించ వలసిన అవసరం లేదు.
- ఆన్ లైన్ లో గాని లేదా మీకు దగ్గర లోని ఏదైనా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో నేరుగా అప్లికేషన్ ఇవ్వొచ్చు.
- 5 వ తరగతి ఏ గురుకులం లో చదవాలని అనుకుంటున్నారో ఆ పాఠశాలను ఎంచు కున్న తర్వాత ఆ వివరాలు ఇవ్వాలి. తర్వాత ఈ వివరాలు మార్చడం కుదరదు. అప్లయి చేసుకోవడానికి చివరి తేదీ 23-02-2024
ప్రవేశ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు అంటే..
- అప్లయి చేసుకున్న బాల బాలికలకు 10-03-2024 వ తేదీ న ఉదయం 10.00 AM నుండి 12.00 noon వరకు పరీక్ష నిర్వహిస్తారు.
- విద్యార్ధులకు పరీక్ష లో వచ్చిన మార్కులను బట్టి ఆయా గురుకులాల్లో సీట్లు కేటాయిస్తారు.
- ఇది నిజం గా ఒక సువర్ణ అవకాశం… ఐదవ తరగతి లో సీటు పొందితే ఇంటర్ వరకూ కూడా ఉచిత విద్య పొందుతారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
ఇంటర్ ఫస్టియర్ లో చేరే వారికి అర్హతలు :DR BR AMBEDKAR GURUKULAMS
- 2023 – 24 విద్యాసంవత్సరం లో పదవ తరగతి చదువుతూ మార్చి 2024 లో పరీక్షలు రాసేవారు CBSE / ICSE అందరూ అర్హులు.
- 31-08-2024 నాటికి 17 సంవత్సరాలు నిండకుండా ఉండాలి.
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలు, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళలో చదివుతున్న వారికి ఒక సంవత్సరం వయసు సడలింపు ఉంటుంది.
- తల్లిదండ్రుల/ సంరక్షకుల వార్షికాదాయం లక్ష రూపాయలకు మించి ఉండకూడదు.
- అన్ని గురుకుల విద్యాలయాల్లో SC – 75%, BC-C (Converted Christians) – 12 %, , ST – 6%, BC – 5% ఇతరులకు 2% చొప్పున సీట్లు కేటాయిస్తారు.
- వికలాంగులకు 3% , సైనిక ఉద్యోగుల పిల్లలకు, ఇతర ప్రత్యేక కేటగిరీ ల వారికి 15% సీట్లు కేటాయిస్తారు.
- 25-01-2024 నుండి వెబ్ సైట్ లో అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది.
- అప్లికేషన్ పంపడానికి చివరి తేదీ 23-02-2024
- హాల్ టికెట్ లు వెబ్ సైట్ లో ఉంచే తేదీ : 02-03-2024
- ప్రవేశ పరీక్ష తేదీ – 10-03-2024 మధ్యాహ్యం 2.00PM నుండి 4.30 PM వరకూ
- IIT – Medical Academy లో ప్రవేశానికి 10-03-2024 తేదీన జరిగిన పరీక్షలో ప్రతిభావంతులను (1:3 నిష్పత్తి లో) ఎంపిక చేస్తారు. వారే IIT- Medical Academy పరీక్ష రాయడానికి అర్హులు – ఈ పరీక్ష ను 21-04-2024 న నిర్వహిస్తారు.