Dr Manmohan Singh died at 92| మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమయం
Dr Manmohan Singh Expired at 92| మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమయం
మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్దిక వేత్త డా మన్మోహన్ సింగ్ ఈ రోజు కన్నుమూసారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. ఢిల్లీ లోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ రోజు అనగా డిసెంబర్ 26, 2024 గురువారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత దేశ ప్రధాన మంత్రి గా 2004 నుండి 2014 వరకూ పనిచేసారు. అంతకు ముందు ఆర్ధిక మంత్రిగా కూడా బాధ్యత నిర్వహించారు. ఆర్ధిక శాఖా మంత్రి గా 1990 వ దశకం లో అనేక ఆర్దిక సంస్కరణలు తీసుకు వచ్చారు. అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వం లో మన్మోహన్ సింగ్ అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని దేశం లో ఆర్దిక సంస్కరణ లకు బాట వేసారు.