January 10, 2025

Happy New Year 2024

Happy New Year 2024 – Vijay News Telugu – Victorious News for Telugu People

cropped-cropped-cropped-2.png

Vijay News Telugu న్యూస్ పోర్టల్ తరపున మీ అందరకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు .. ఈ నూతన సంవత్సరం మీ జీవితాలలో గొప్ప మార్పు తీసుకు రావాలని , మరింత ఆనంద కరమైన రోజులు మీరు చవి చూడాలని మన వెబ్ సైట్ తరపున మనస్పూర్తి గా కోరుకుంటున్నాము...

ఈ సమాజం లో ప్రతి రోజూ మన చుట్టూ అనేకానేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనకు స్ఫూర్తి నిచ్చే సంఘటనలు కొన్ని… మనసును మెలితిప్పే సంఘటనలు కొన్ని…. అయ్యో.. అనిపించేవి… ‘వావ్’ అనిపించేవి….. కన్నీళ్లు పెట్టించేవి… కలలకు పదును పెట్టేవి…. రోజంతా వెంటాడుతూనే ఉండేవి… ఇలా అనేకానేక సంఘటనల సారాన్ని మన ప్రియాతి ప్రియమైన భాషలో అదేనండి అచ్చ తెలుగులో … మీ కళ్ళ ముందు ఉంచే ఉద్దేశ్యం తో ప్రారంభించ బడినదే మన న్యూస్ పోర్టల్ ‘Vijay News Telugu’

ఈ న్యూస్ పోర్టల్ లో కేవలం మేము మాత్రమే కాదు.. మీరు కూడా మీ ఆలోచనలను పంచు కోవచ్చు… మీ రచనలను కూడా పంపవచ్చు… ఎక్కడా కాపీ చెయ్యకుండా మీరు స్వంతం గా రాసిన కవితలను, చిన్న కథలను కూడా పంపవచ్చు… ఎలా పంపాలి అనే విషయాలు త్వరలోనే మీకు తెలియ జేస్తాము…

ఎవరి కొమ్ము కాయకుండా…. నిష్పక్ష పాతం గా …. ఉన్నది ఉన్నట్టు మీ ముందు ఉంచి మీ మెప్పు పొందడమే మన Vijay News యొక్క ప్రధానమైన ఆశయం… అవసరమైనంత మేరకు మీ సలహాలు తీసుకుంటూ మన తెలుగు వారికి మంచి వార్తలను ఎప్పటికప్పుడు అందించడమే మన పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.. దీనికి సంబంధించి మీ అమూల్యమైన సలహాలను సూచనలను ఆహ్వానిస్తున్నాం….

మన న్యూస్ పోర్టల్ లో AP, TS, జాతీయ, అంతర్జాతీయ వార్తలను అందించడం జరుగుతుంది.. బిజినెస్ సెక్షన్ లో బులియన్ మార్కెట్, స్టాక్ మార్కెట్ , పెట్రో మార్కెట్ వివరాలు, వ్యవసాయ విభాగం లో వ్యవసాయ వార్తలతో పాటు వాతావరణ సమాచారం, విద్యా విభాగం లో వివిధ పరీక్షల అప్ డేట్స్ మరియు సైన్స్, టెక్నాలజీ విశేషాలు, సాహిత్య విభాగం లో కవితలు, చిన్న చిన్న కథలు, క్రీడా విభాగం లో క్రికెట్ , IPL వార్తలు, లైఫ్ స్టైల్ విభాగం లో విజేతల కథలు, ఎంటర్ టైన్మెంట్ విభాగం లో టీవీ, ఒటిటి, సినిమా విశేషాలు.. ఇలా అనేక విభాగాలలో నిరంతర వార్తా స్రవంతి ని మీ ముందు ఉంచడమే మా ఉద్దేశ్యం…

నూతన సంవత్సరం పూట ప్రారంభించ బడుతున్న మన వెబ్ పోర్టల్ ‘Vijay News Telugu’ మీ ఆదరాభిమానాలను చూరగొని…… ‘Victorious News for Telugu People’ అనే తన టాగ్ లైన్ ను సార్ధకం చేసుకొని, తెలుగు వారి ఆత్మాభిమానానికి ప్రతీక లా …. తెలుగు వార్తా ప్రపంచం లో ఒక క్రొత్త ఒరవడి కి నాంది పలకాలని ఆశిస్తూ ….

మరొక్క సారి మీ అందరకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము …

న్యూస్ డెస్క్, Vijay News Telugu, 31-12-2023

1 thought on “Happy New Year 2024

Comments are closed.