January 10, 2025

3.53 రూపాయల నుండి 2.36 లక్షల రూపాయలకు పెరిగిన షేర్| స్టాక్ మార్కెట్ లో సంచలనం

స్టాక్ మార్కెట్ లో ఒక గొప్ప సంచలనం నమోదైంది. ముందే తెలిస్తే లక్షల రూపాయలు వెచ్చించడానికి అనేక మంది రెడీ గా ఉన్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా భారత స్టాక్ మార్కెట్ లో అత్యధిక ధర కలిగిన స్టాక్ గా అవతరించింది. సంచలనాలు అప్పుడప్పుడూ మాత్రమే నమోదవుతూ ఉంటాయి. ఒక్క రోజులోనే కోటీశ్వరులు అయ్యే అదృష్టం కొద్ది మంది అదృష్టవంతులకు మాత్రమే ఉంటుంది. 

Elcid investments stock price

Elcid investments stock price

3.53 రూపాయల నుండి 2.36 లక్షల రూపాయలకు పెరిగిన షేర్| స్టాక్ మార్కెట్ లో సంచలనం

స్టాక్ మార్కెట్ లో అప్పుడప్పుడూ సంచలనాలు నమోదు అవుతూ ఉంటాయి. ఒకే రోజులో కేవలం మూడున్నర రూపాయల విలువ కలిగిన ఒక స్టాక్ రెండు లక్షల ముప్పై ఆరువేల రెండువందల యాభై రూపాయలు (2,36,250/-) పెరిగింది అంటే నమ్ముతారా… ఇది నిజం. ఒక్క రోజులోనే 66,92,535 శాతం షేరు ధర పెరగడం స్టాక్ మార్కెట్ చరిత్ర లోనే ఇది మొదటి సారి.(Elcid investments stock price)

స్టాక్ మార్కెట్ చరిత్ర లో ఇప్పటివరకూ నమోదైన అత్యధిక షేరు ధర కూడా ఇదే. ఇంతకు ముందు ఎం.ఆర్.ఎఫ్ స్టాక్ మాత్రమే లక్ష రూపాయలు పైన ట్రేడ్ అవుతూ వస్తోంది. 3.53 రూపాయలు విలువైన ఆ షేరు ఒక్కసారిగా ఎందుకు రెండు లక్షల పైన పెరిగింది, ఏ కంపెనీ షేరు ఇది అనే వివరాలు చూద్దాం ఒకసారి.

ఎల్సిడ్ ఇన్వెస్ట్ మెంట్స్ (Elcid investments) ఒక స్మాల్ క్యాప్ స్టాక్. దీని యొక్క షేరు ధర 3.53 రూపాయలుగా ఉంది. కేవలం ఒక్క రోజులోనే 2.36 లక్షల రూపాయలకు చేరుకొని చరిత్ర సృష్టించింది. ఒక రకం గా చెప్పాలంటే పది వేల రూపాయలు ఒక్క రోజులో 67 కోట్ల రూపాయలు గా మారినట్లు. అసలు ఇలా జరుగుతుంది అని ఎవరూ ఊహించ లేదు.

ఇంత వరకూ భారత స్టాక్ మార్కెట్ లో ఎం.ఆర్.ఎఫ్ స్టాక్ మాత్రమే అత్యధిక ధర కలిగి ఉంది. 1,22,576 రూపాయల విలువ కలిగి ఉంది MRF కంపెనీ స్టాక్. ఇప్పుడు ఈ స్టాక్ విలువను  బ్రేక్ చేస్తూ 2.36 లక్షల రూపాయలు గా ఎల్సిడ్ ఇన్వెస్ట్ మెంట్స్ యొక్క స్టాక్ రికార్డు సృష్టించింది.

అసలు ఎందుకు ఇలా జరిగింది?

మన దేశం లోని బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE)  సోమవారం నాడు ఒక ప్రత్యేకమైన కాల్ ఆక్షన్ ను నిర్వహించారు. ఇన్వెస్ట్ మెంట్ హోల్డింగ్ కంపెనీలలో ధరల సర్దుబాటు మరియు ఆవిష్కరణ (price discovery) కోసం ఈ ఆక్షన్ ను నిర్వహించారు. స్మాల్ క్యాప్ కంపెనీ అయిన ఎల్సిడ్ ఇన్వెస్ట్ మెంట్స్ యొక్క బుక్ వాల్యూ రూ 5,85,225 /- గా ఉంది.

2,25,000 రూపాయల వద్ద ప్రారంభమైన షేరు ధర వెంటనే 5 శాతం పెరిగి 2,36,250 రూపాయలకు పెరిగింది. దీనితో భారత స్టాక్ మార్కెట్ లోనే అత్యంత ఖరీదైన స్టాక్ గా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ MRF షేరు ధర మాత్రమే 1.2 లక్షలు గా ఉంది. ఇప్పుడు ఎల్సిడ్ ఇన్వెస్ట్ మెంట్స్ అత్యంత ఖరీదైన స్టాక్ గా మొదటి స్థానం లో కొనసాగుతోంది. ఒకే రోజులో ఇలా 66 లక్షల శాతం పెరిగిన స్టాక్ గా గుర్తు ఉండిపోతుంది.

హోల్డింగ్ కంపెనీల యొక్క ప్రస్తుత మార్కెట్ విలువకు, బుక్ వాల్యూ కు మధ్య సమన్వయం కుదర్చడానికి సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ప్రత్యేక ఆక్షన్ నిర్వహించాలని స్టాక్ ఎక్సేంజ్ లను కోరింది. బుక్ వాల్యూ కంటే మార్కెట్ వాల్యూ తక్కువ గా ఉన్న కంపెనీల పై దృష్టి సారించింది.  ఆక్షన్ నిర్వహించే  రోజు మాత్రం ఆయా కంపెనీల షేర్ల ట్రేడింగ్ పై ఎటువంటి ఆంక్షలు, నియంత్రణ లు ఉండరాదు అని నిర్దేశించింది.  ఫలితం గా ఎల్సిడ్ ఇన్వెస్ట్ మెంట్స్ యొక్క షేర్ ధర అమాంతం పెరిగిపోయింది.

చాలా లిస్టెడ్ కంపెనీలు, ఇన్వెస్ట్ మెంట్ హోల్డింగ్ కంపెనీలు సాధారణం గా అరుదుగా ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఎల్సిడ్ కంపెనీ షేర్లు కూడా చాలా కాలం ట్రేడ్ కాలేదు. ఎల్సిడ్ ఇన్వెస్ట్ మెంట్స్ కి ఆసియన్ పెయింట్స్ లో 1.28 శాతం వాటా ఉంది.

బుక్ వాల్యూ అంటే ఏమిటి?

ఏదైనా కంపెనీ యొక్క మొత్తం నిఖర ఆస్తుల విలువను దానికి ఉన్న మొత్తం షేర్ల తో భాగించగా వచ్చే దానిని బుక్ వాల్యూ అని అంటారు. ఎల్సిడ్ కంపెనీ యొక్క బుక్ వాల్యూ 5,85,225/- రూపాయలు గా ఉంది. అంటే ఒక షేరు ధర 5,85,225/- రూపాయలు ఉంటుందనేది షేర్ హోల్డర్ల అంచనా. మార్కెట్ వాల్యూ కేవలం 3.23 రూపాయలు గా మాత్రమే ఉండటం తో షేర్ హోల్డర్లు షేర్లను అమ్మకుండా తమ వద్దనే ఉంచుకుంటున్నారు. దానితో చాలా కాలంగా అతి తక్కువ ధరకు ట్రేడింగ్ జరుగుతోంది.

ఎల్సిడ్ కంపెనీ యొక్క బుక్ వాల్యూ 5.8 లక్షలు గా ఉంది. ఈ ఒక్కరోజు జరిగిన ర్యాలీ లో షేరు ధర 2.3 లక్షలు గా పెరిగింది. అంటే బుక్ వాల్యూ కంటే తక్కువ కే పెరిగింది. ఇలా ఇంకా పెరుగుతూ పోతుందా అంటే అది కూడా చెప్పలేం. బుక్ వాల్యూ ని మాత్రమే బేస్ గా తీసుకొని షేరు విలువ పెరుగుతుంది అని చెప్పలేం. (Elcid investments stock price)

ఏది ఏమైనప్పటికీ స్టాక్ మార్కెట్ లో ఒక గొప్ప సంచలనం నమోదైంది. ముందే తెలిస్తే లక్షల రూపాయలు వెచ్చించడానికి అనేక మంది రెడీ గా ఉన్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా భారత స్టాక్ మార్కెట్ లో అత్యధిక ధర కలిగిన స్టాక్ గా అవతరించింది. సంచలనాలు అప్పుడప్పుడూ మాత్రమే నమోదవుతూ ఉంటాయి. ఒక్క రోజులోనే కోటీశ్వరులు అయ్యే అదృష్టం కొద్ది మంది అదృష్టవంతులకు మాత్రమే ఉంటుంది.

(వివిధ ఆర్దిక పరమైన అంశాలపై అవగాహన కోసం, స్టాక్ మార్కెట్ లో జరిగే విషయాలను తెలియజేయడం కోసం మాత్రమే ఈ వార్తా కధనం ప్రచురించబడింది. స్టాక్ మార్కెట్ కు సంబంధించిన ఏవైనా నిర్ణయాలు తీసుకోదలచినప్పుడు స్టాక్ మార్కెట్ నిపుణులను సంప్రదించి మాత్రమే నిర్ణయాలు తీసుకోగలరు)

బిజినెస్ డెస్క్, విజయ్ న్యూస్ తెలుగు