Electoral Bonds and Political Parties-రాజకీయ పార్టీల గుట్టు విప్పిన ఎలక్టోరల్ బాండ్లు
ఎలెక్టోరల్ బాండ్ల రూపం లో ఆయా పార్టీలు విరాళాలు సేకరిస్తున్నాయి. ఎవరైనా తమకు నచ్చిన పార్టీ కి బాండ్ల రూపం లో విరాళం ఇవ్వవచ్చు. ఈ వివరాలు గోప్యం గా ఉంచ బడతాయి. కానీ సుప్రీం కోర్టు తీర్పు నేఫద్యం లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వద్ద కొనుగోలు చేయబడిన ఎలెక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించింది.
Electoral Bonds and Political Parties -రాజకీయ పార్టీల గుట్టు విప్పిన ఎలక్టోరల్ బాండ్లు
మన దేశం లోని రాజకీయ పార్టీల లోగుట్టు విప్పింది ఎలక్షన్ కమీషన్. వివిధ పార్టీలు కొనుగోలు చేసిన ఎలెక్టోరల్ బాండ్ల వివరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమీషన్ కు సమర్పించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తమ వెబ్ సైట్ లో ఈ వివరాలను పొందు పరచింది ఎలక్షన్ కమీషన్.(Electoral Bonds and Political Parties)
ఎలెక్టోరల్ బాండ్ల రూపం లో ఆయా పార్టీలు విరాళాలు సేకరిస్తున్నాయి. ఎవరైనా తమకు నచ్చిన పార్టీ కి బాండ్ల రూపం లో విరాళం ఇవ్వవచ్చు. ఈ వివరాలు గోప్యం గా ఉంచ బడతాయి. కానీ సుప్రీం కోర్టు తీర్పు నేఫద్యం లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వద్ద కొనుగోలు చేయబడిన ఎలెక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణం లో ఈ చర్య అన్ని రాజకీయ పార్టీలకు కొరుకు పడనిదే.. ఎందుకంటే దేశ వ్యాప్తం గా ఆయా పార్టీల కోసం కొనుగోలు చేయబడిన ఎలక్టోరల్ బాండ్ల మొత్తం విలువ చూస్తే ఎవరైనా నోరెళ్ళబెట్ట వలసిందే.
దేశం లోని ప్రధాన పార్టీలన్నీ ఈ ఎలెక్టోరల్ బాండ్ల లబ్దిదారులే. అందరికంటే ఎక్కువగా రూ 6061 కోట్ల రూపాయలతో భారతీయ జనతా పార్టీ ముందంజ లో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ రూ 1610 కోట్ల రూపాయలతో రెండవ స్థానం లోనూ, కాంగ్రెస్ పార్టీ రూ 1422 కోట్ల రూపాయలతో మూడవ స్థానం లోనూ ఉన్నాయి.(Electoral Bonds and Political Parties)
తెలుగు రాష్ట్రాల నుండి ..
తెలుగు రాష్ట్రాలనుండి వైసీపీ కి 337 కోట్ల రూపాయలు, తెలుగుదేశం పార్టీకి 219 కోట్ల రూపాయలు, జనసేన పార్టీకి 21 కోట్ల రూపాయలచేసినట్లు చొప్పున బాండ్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
దేశం లోని ప్రముఖ కంపెనీలు లిస్టులో …
ఎలెక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వారి విషయానికి వస్తే దిగ్గజ కంపెనీలు ఈ లిస్టు లో ఉన్నాయి. లక్ష్మీ మిట్టల్, అనిల్ అగర్వాల్, సునీల్ భారతీ మిట్టల్ వంటి పారిశ్రామిక దిగ్గజాలతో పాటు మేఘా ఇంజనీరింగ్ సంస్థ, ఐటీసీ, మహీంద్ర అండ్ మహీంద్ర వంటి సంస్థలు కూడా ఈ బాండ్ల ను కొనుగోలు చేసిన లిస్టు లో ఉన్నాయి. వీటితో పాటు గ్రాసిం ఇండస్ట్రీస్, టోరెంట్ పవర్, డి.ఎల్.ఎఫ్ కమర్షియల్, పిరమల్ ఎంటర్ ప్రైస్ , అపోలో టైర్స్, పీవీఆర్, సన్ ఫార్మా వంటి అనేక సంస్థలు బండ్లు కొనుగోలు చేసాయి.
తెలుగు రాష్ట్రాలకు చెందిన నవయుగ ఇంజనీరింగ్, దివీస్ లాబొరేటరీస్, యశోదా హాస్పిటల్స్, అరబిందో ఫార్మా, ఎన్సీసి, నాట్కో ఫార్మా కూడా బాండ్లు కొనుగోలు చేసాయి.(Electoral Bonds and Political Parties)
మొత్తం 12,000 కోట్ల రూపాయలకు పైగా బాండ్ల ను కొనుగోలు చేసాయి వివిధ కంపెనీలు. అన్నిటికంటే ఎక్కువగా ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీ 1368 కోట్ల రూపాయల బాండ్లు కొనుగోలు చేయడం విశేషం. ఈ కంపెనీ పై ఇప్పటికే ఈడీ పలు ఆరోపణలు చేసి దర్యాప్తు చేస్తోంది.